గురుపూర్ణిమరోజుతో ముడిపడివున్న అనుభవాలు:
- నేను ఇవ్వాలనుకున్న దక్షిణను బాబా స్వీకరించారు
- పండ్లు నైవేద్యంగా పెట్టే భాగ్యాన్నిచ్చారు బాబా.
- నాకోసం ట్రైన్ గంట ఆలస్యం చేసిన బాబా
గురుపూర్ణిమరోజు నేను ఇవ్వాలనుకున్న దక్షిణను బాబా స్వీకరించారు
సాయిబంధువు రాజేష్ తోలాని తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను మస్కట్(ఒమెన్)లో నివసిస్తున్నాను. 2019, జులై 16, గురుపూర్ణిమరోజు ఉదయాన నేను బాబా గుడికి వెళ్తూ కొంత డబ్బు హుండీలో వేయాలని అనుకున్నాను. అయితే నా పర్సు కారులోనే మర్చిపోయాను. ఆ విషయం గుళ్ళోకి వెళ్లి విఘ్నేశ్వరునికి నమస్కరిస్తుండగా గుర్తుకువచ్చి బాధతో నన్ను నేను తిట్టుకున్నాను. దర్శనం చేసుకుని నా కారు వద్దకు తిరిగి వచ్చేసరికి ఒక వయసు పైబడిన వ్యక్తి నా కారు ప్రక్కన నిలబడి ఉన్నాడు. నేను చాలా సంవత్సరాలుగా ఆ మందిరానికి ప్రతి మంగళవారం వెళ్తున్నాను. కానీ ఆ వ్యక్తిని అంతకుముందెన్నడూ చూడలేదు. అతనిని చూసిన మరుక్షణం సచ్చరిత్రలోని 'స్వచ్ఛమైన మనస్సుతో బాబాకి దక్షిణ ఇవ్వాలనుకుని మర్చిపోతే, బాబానే ఏదో ఒక రూపంలో వచ్చి ఆ దక్షిణను స్వీకరిస్తారు' అన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే హుండీలో వేయాలనుకున్న మొత్తాన్ని ఆ వృద్ధునికి ఇచ్చాను. అతను చిరునవ్వుతో ఆ డబ్బు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. "థాంక్యూ బాబా!"
గురుపూర్ణిమనాడు పండ్లు నైవేద్యంగా పెట్టే భాగ్యాన్నిచ్చారు బాబా.
2019, జులై 15న సాయిబంధువు హరిణి తాను పొందిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాధారణంగా ప్రతిరోజూ నేను బెల్లంతోపాటు ఏదైనా పండును నైవేద్యంగా బాబాకు పెడతాను. ఒకవేళ పండ్లు లేకుంటే బెల్లం మాత్రమే నైవేద్యం పెడతాను. గురుపూర్ణిమకు 4 రోజుల ముందు నుండి బెల్లం మాత్రమే పెడుతున్నాను. 2019, జులై 15 సాయంత్రం 'రేపు గురుపూర్ణిమ కదా! బాబాకి పండ్లు నైవేద్యంగా పెడదాం' అని అనుకుని 'పండ్లు తీసుకుని రమ్మ'ని నేను నా భర్తకి మెసేజ్ పెట్టాను. తన నుండి నాకు రిప్లై రాకపోవడంతో తను నా మెసేజ్ చూడలేదేమో అనుకున్నాను. అయితే తను ఇంటికి వస్తూ 4 ఆపిల్స్ తీసుకొచ్చారు. తను నా మెసేజ్ చూసి ఆ ఆపిల్స్ తీసుకొచ్చారని అనుకున్నాను. కానీ నేను మేసేజ్ చేసేటప్పటికే తను ఆఫీసు నుండి బయలుదేరి దారిలో ఉన్నందువల్ల మొబైల్ చూసుకోలేదని చెప్పారు. సాధారణంగా నేను పండ్లు, పువ్వులు మొదలైనవి తెమ్మని మెసేజ్ పెడితేనే తను తీసుకుని వస్తారు. అలాంటిది ఆరోజు నా మెసేజ్ చూడకుండానే తను పండ్లు తీసుకొచ్చారు. నా మనసు తెలిసిన బాబా తను పండ్లు తీసుకుని ఇంటికి వచ్చేలా చేసి గురుపూర్ణిమనాడు నా మనసుకు నచ్చేవిధంగా ఆయనను పూజించుకునే భాగ్యాన్ని కల్పించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

నాకోసం ట్రైన్ గంట ఆలస్యం చేసిన బాబా
సాయిబంధువు సెంథిల్ సచిన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను గురుపూర్ణిమ సందర్భంగా శిరిడీ సందర్శించి బాబా దర్శనం చేసుకున్నాను. 2019, జులై 17న నా తిరుగు ప్రయాణానికి పూణే నుండి మధ్యాహ్నం 3.45 కి ట్రైన్ ఉంది. కాబట్టి శిరిడీ నుండి పూణే వెళ్ళడానికి ఉదయం 10 గంటలకున్న ఒక ప్రైవేట్ బస్సుకు టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే 10 గంటలకు బయలుదేరాల్సిన బస్సు 10.30కి బయలుదేరింది. బయలుదేరటమే ఆలస్యమనుకుంటే డ్రైవర్ కూడా చాలా నెమ్మదిగా బస్సు నడుపుతూ, ఎక్కడికి అక్కడ బస్సు ఆపుతున్నాడు. దానికితోడు సుమారు 40 నిమిషాలు లంచ్ కోసం ఆపేశాడు. ఇక నా రైలు తప్పిపోవడం ఖాయం అనిపించింది. నిరాశతో బాబాను తలచుకుని, "రైలు తప్పిపోయే సందర్భంలో నేను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి బాబా" అని అనుకున్నాను. ఏమి జరిగిందో ఊహించగలరా?! కొద్దిసేపటికి నేను నా చేతిలో ఉన్న మొబైల్ లోని యాప్‌లో ట్రైన్ స్టేటస్ చూస్తే, ట్రైన్ గంట ఆలస్యంగా ఉంది. అది చూసి నాకు సంతోషంగా అనిపించింది. నేను స్టేషన్ చేరుకుని 15 నిమిషాలు వేచి ఉన్నాక ట్రైన్ వచ్చింది. బాబా నా ట్రైన్‌ను గంట ఆలస్యం చేసారు. ఆయన చూపిన దయకు కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
🕉 sai Ram
ReplyDelete🙏🙏🙏🙏 ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏
ReplyDelete