ఈరోజు భాగంలో అనుభవం:
- అడుగడుగునా అందిన బాబా ఆశీస్సులు
ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను యు.ఎస్ లో నివసిస్తున్న సాయిభక్తుడిని. చిన్నప్పటినుంచి బాబాను ఒక సాధుసత్పురుషుడుగానే చూసేవాడిని. కానీ 2015లో నన్ను తన పాదాల చెంతకు లాక్కున్నప్పటినుండి బాబా భగవంతుని అవతారమని తెలుసుకున్నాను. అప్పటినుండి బాబా నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన రాకతో నా జీవితమే మారిపోయింది.
ప్రియమైన సాయిభక్తులందరికీ బాబా తన భక్తులను ఎలా రక్షిస్తారో తెలుసు. నేను ఒక విషయంలో ఎన్నో సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. అయినప్పటికీ బాబా యందు పూర్తి విశ్వాసంతో, ఆయన స్మరణ చేస్తూ సమస్యను ఆయనకే విడిచిపెట్టాను. ఆయన తనదైన ప్రత్యేకశైలిలో ఆ సమస్యనుండి నన్ను బయటపడేశారు. ఇటువంటి అనుభవాలు నాకు చాలానే జరిగాయి. వాటివల్ల బాబాపట్ల నా విశ్వాసం అధికమైంది. అటువంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
యు.ఎస్ లో నాకు ఒక స్వంత కంపెనీ ఉంది. 2018లో ఇండియాలో నాకున్న ఒక అపార్ట్‌మెంటుని అమ్మేసి, ఆ డబ్బుతో నా కంపెనీ లోన్ క్లియర్ చేయాలనుకున్నాను. అప్పటికే ఆ అపార్ట్‌మెంట్ తీసుకోవడానికి ఒకతను సిద్ధంగా ఉన్నారు. కానీ, నాకు త్వరగా ఇండియా వెళ్లే అవకాశం లేకపోవడంతో, అతనిని వెయిట్ చేయించడం ఇష్టంలేక వేరే అపార్ట్‌మెంట్ ఏదైనా చూసుకోమని చెప్పాను. కానీ అతను మా అపార్ట్‌మెంట్ తీసుకోవడానికే ఆసక్తి కనబరుస్తూ, "డిసెంబర్ వరకు వేచి ఉంటాను. మీకు వీలైనప్పుడు రండి" అని చెప్పాడు. ఇలా ఉండగా అక్టోబర్ నెలలో అత్యవసరంగా నాకు డబ్బు అవసరమైంది. కానీ అపార్ట్‌మెంట్ అమ్మే పని త్వరగా అయ్యేది కాదు. ఎందుకంటే, ముందుగా అతను బ్యాంకు లోన్ పొందాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా ప్రయాస, సమయంతో కూడుకున్నది. అదీకాక వచ్చిన డబ్బును యు.ఎస్ తరలించడం చార్టెడ్ అకౌంటెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు, బ్యాంకు వీటన్నిటితో ముడిపడివుంది. దాంతో నేను నా అపార్ట్‌మెంట్ తీసుకుంటానన్న వ్యక్తికి ఫోన్ చేసి, "పనంతా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందా?" అని అడిగాను. "నేను అన్నీ ఏర్పాటు చేస్తాను. మీరు రండి" అని అన్నాడు. సరేనని నేను ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకుని మంగళవారం ఉదయానికి ఇండియా చేరుకున్నాను. తీరా ఇండియా చేరాక ఒక నెల నుంచి లాయర్లు సమ్మె చేస్తున్నారని, అందువలన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్స్ జరగట్లేదని తెలిసింది. ఆ పనులన్నీ పూర్తి చేసుకోడానికి నావద్ద కేవలం ఎనిమిది పనిదినాలు మాత్రమే ఉండటంతో నాకేమి చేయాలో అర్థం కాలేదు. నా సమయం, డబ్బు వృధా అయిపోతున్నాయని ఆందోళనపడ్డాను. ఇక బాబాయే శరణం అనుకున్నాను. ఆయనయందు పూర్తి విశ్వాసముంచి, ఆయన స్మరణ చేస్తూ, "నా పని పూర్తయ్యేలా చూడమ"ని ప్రార్థించాను. ప్రతిరోజూ ఉదయం మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్తుండేవాడిని. అక్కడ ప్రశాంతంగా, అందంగా ఉన్న బాబా మూర్తిని చూస్తుంటే నాకు మనశ్శాంతి లభిస్తుండేది.
ఇలా రెండురోజులు గడిచాక గురువారం మధ్యాహ్నానికి నా అపార్ట్‌మెంట్ తీసుకుంటున్న అతని బ్యాంకు లోనుకి సంబంధించిన పేపర్ వర్క్ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. ఆ సమయంలో అతను లాయర్ల సమ్మె శుక్రవారం ఉదయానికి ముగుస్తుందని, కాబట్టి రిజిస్ట్రేషన్ పని కూడా ఆరోజు పూర్తయ్యేలా చూస్తానని చెప్పాడు. దాంతో మిగిలినరోజుల్లో డబ్బు యు.ఎస్ కి ట్రాన్స్‌ఫర్ చేసే పని కూడా అయిపోతుందని అనుకున్నాను. అయితే శుక్రవారం ఉదయం అతను మళ్ళీ ఫోన్ చేసి, "అనుకున్నట్టుగా సమ్మెను ఆరోజు కాకుండా శనివారంరోజు లాయర్లు విరమించుకుంటార"ని చెప్పాడు. దాంతో నేను మళ్ళీ టెన్షన్ పడ్డాను. అలవాటు ప్రకారం శనివారం ఉదయం బాబా దర్శనానికి వెళ్లి, "మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి" అని ప్రార్థించి, అక్కడ ఉన్నంతసేపు ఆయన స్మరణ చేస్తూ గడిపాను. తర్వాత పనిమీద బ్యాంకుకి వెళ్ళాను. మనసులో మాత్రం రిజిస్ట్రేషన్ గురించి ఆందోళనపడుతూ ఉన్నాను. ఒంటిగంట సమయంలో బ్యాంకు ముందున్న నా కారు తీస్తుండగా నా ఫోను రింగ్ అయింది. చూస్తే మా సిస్టర్. తను, "చాలాసేపటి నుంచి అపార్ట్‌మెంట్ తీసుకునే అతను ఫోన్ చేస్తున్నారు, కానీ మీ ఫోన్ కలవడం లేదు, వెంటనే బయలుదేరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రమ్మ"ని చెప్పింది. నాకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. వెంటనే నేను ఇంటికి వెళ్లి, కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి బయలుదేరాను. దారిలో ఈ మొత్తం ప్రక్రియలో మాకు సహాయం చేస్తున్న ఒకతనిని కూడా కారులో ఎక్కించుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చేరుకున్నాను. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే ఆ చోటు ఎడారిని తలపించేలా ఖాళీగా ఉండటంతో ఆశ్చర్యపోయాను. ముందుగా లాయర్ని కలవడానికి వెళ్ళాను. అక్కడ నా దృష్టిని ఆకర్షించిన మొదటి వస్తువు - ఆయన టేబుల్ పై ఉన్న ఒక పుస్తకం. దానిపై బాబా ఫోటో ఉంది. వెంటనే లాయర్ని, "అది సచ్చరిత్రనా?" అని అడిగాను. అందుకాయన, అది "శిరిడీ డైరీ" అని చెప్పారు. బాబా నాకు తోడుగా ఉన్నారని చాలా ఆనందించాను. తర్వాత లాయరు అవసరమైన డాక్యుమెంట్స్, ఐడీ ప్రూఫ్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అడిగారు. అయితే డాక్యుమెంట్స్, ఐడీప్రూఫ్స్ మాత్రమే కావాలని ముందుగా చెప్పి ఉండటంతో వాటినే నేను తీసుకెళ్లాను. దాంతో ఫోటోల కోసం ఏం చేయాలా అని టెన్షన్ పడ్డాను. వెంటనే బాబా నాకో ఆలోచన స్ఫురింపజేశారు. నాతోపాటు ఎప్పుడూ ఉండే బ్యాగులో 2 సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్ కోసం తీసుకున్న ఫోటోలున్నాయి. బ్యాగులో చూస్తే సరిగ్గా రెండు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. 'బాబా ఎంత కరుణామయుడు!' అని నా హృదయం ఆనందంతో పులకించిపోయింది.
ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటూనే లాయరు, 'సాక్షిగా ఎవరు ఉన్నారు?' అని అడిగారు. కారులో నాతోపాటు తీసుకొచ్చిన వ్యక్తి సాక్షిగా ఉంటానని అన్నారు. అప్పుడు లాయరు అతని ఐడీ ప్రూఫ్స్ అడిగారు. అవి అతని వద్దలేవు. లాయరు కనీసం మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరిపోతుందని అతనితో అన్నారు. కానీ అతను అది కూడా లేదని చెప్పారు. సరే ఇంటికి వెళ్లి వస్తామనుకుంటున్న సమయంలో మరో అద్భుతం జరిగింది. ఎందుకో అనుకోకుండా అతను తన జేబులో ఉన్న కాగితాలన్నీ చూస్తుండగా డ్రైవింగ్ లైసెన్స్ కనిపించింది. తరువాత డాక్యుమెంట్స్ టైపు చేసే వ్యక్తి భోజనానికి వెళ్లి గంటవరకు కనపడలేదు. మరో వ్యక్తి 3 గంటలకే తన గ్రామానికి వెళ్లిపోవాలని అంటాడు. చివరిగా సంతకం పెట్టాల్సిన వ్యక్తి లాయర్ల సమ్మె సాకుగా చెప్పి ఊరంతా తిరుగుతున్నాడు. ఇలా ఎన్నో అవాంతరాలు, ఇబ్బందుల నడుమ సుమారు 4 గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. చివరికి బాబా దయతో రాత్రి 7.30 కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా రావిచెట్టు కింద నడిచింది. అది నాకు బాబా వేపచెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్న వృత్తాంతాన్ని గుర్తు చేసింది. దానితో జరుగుతున్నదంతా బాబా ఆశీస్సులతోనే జరుగుతుందని, ఇకపైన కూడా ఆయన కృపతో ఉన్న తక్కువ సమయంలో అంతా సజావుగా సాగిపోతుందని అనిపించింది.
మరుసటిరోజు నేను బ్యాంకు మేనేజరుని కలిసాను. బ్యాంకు మేనేజర్ చేతివేళ్ళకి అందమైన బాబా ఉంగరం ఉంది. అలా ప్రతి మలుపులో 'నేను నీకు తోడుగా ఉన్నాన'ని బాబా సూచించారు. ఇంకా ప్రత్యేకించి చెప్పనక్కరలేదు, పనంతా సజావుగా సాగిపోయింది. అప్పటికి గత కొన్ని నెలలుగా రూపాయి విలువ పడిపోతుండటంతో నాకు చాలా ఎక్కువ డాలర్స్ వచ్చాయి. అంతా బాబా కృప.
నా అనుభవాన్ని చాలా ఎక్కువగా వ్రాసానని నాకు తెలుసు. కానీ నా తోటి భక్తులకు బాబా ఎట్టి పరిస్థితిలోనూ మన చేయి వదిలిపెట్టరని తెలియజేయడానికి ప్రతి విషయాన్నీ వ్రాసాను. ఆయన మన 'శ్రద్ధ' 'సబూరి'లను పరీక్షిస్తారు. కాబట్టి ప్రియమైన భక్తులారా! సహనాన్ని కోల్పోకుండా విశ్వాసంతో బాబాను ప్రార్థిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. "బాబా! మీ దివ్య పాదాల చెంత చోటివ్వండి. నాతోటి సోదర సోదరీమణులకు మీ సహాయాన్ని అందించి మీ చల్లని నీడలో ఆశ్రయాన్ని ఇవ్వండి".
ఓం శ్రీసాయినాథాయ నమః!

ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteఓం శ్రీ సాయిరాం.
ReplyDelete