ఈరోజు భాగంలో అనుభవాలు:
- మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన శ్రీసాయి.
- ఊదీతో కంటి ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం
మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన శ్రీసాయి.
సాయిభక్తుడు వై. శ్రీనివాసరావుగారు తమ రీసెంట్ అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఇదివరకు నేను బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు బాబా మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన అనుభవం గురించి తెలియజేస్తాను. నా జీవితంలో శ్రీసాయిబాబా మాకు చేసిన మేలు, ఆ తండ్రి మాపై కురిపించిన ప్రేమ, ఆప్యాయతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతగా ఆదుకుంటున్న ఆ తండ్రిని నేను గుర్తించలేకపోవడం నా లోభత్వమని ఇదివరకే ఒక అనుభవంలో ప్రస్తావించాను. పదిరోజుల క్రితం పంచుకున్న నా గత అనుభవం చివరలో, "నా పెద్ద కుమారునికి త్వరగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా!" అని వేడుకున్నాను. ఆయన ఎంత త్వరగా అనుగ్రహించారంటే. ఆ అనుభవం బ్లాగులో పబ్లిష్ అయిన మూడురోజుల్లోనే!
మా అబ్బాయి బి.టెక్(మెకానికల్ ఇంజనీరింగ్) పూర్తిచేశాడు. 4వ సంవత్సరంలో ఉన్నప్పుడే తనకి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే అది తను చదువుతున్న సబ్జెక్టులకు సంబంధించి కాకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. అందువలన మా అబ్బాయి, "నేను చదువుతున్న కోర్సుకి సంబంధించిన ఉద్యోగం చేయడం నాకిష్టమ"ని చెప్పి ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. తరువాత తను బి.టెక్ పూర్తిచేసి కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. తను హాజరైన ప్రతీ ఇంటర్వ్యూలో మొదటి రెండు స్థానాల్లో నిలిచేవాడు. కానీ ఏదో ఒక కారణంచేత ఉద్యోగం వచ్చేది కాదు. అందువలన మా అబ్బాయి చాలా దిగులుపడేవాడు. మేము, "బాబాను నమ్ముకో, ఆయన నీకు మంచి చేస్తార"ని తనకి ధైర్యం చెప్పేవాళ్ళం. నేను, నా భార్య పద్మావతి బాబా మందిరానికి వెళ్లి, "మా అబ్బాయి ఉద్యోగ విషయంలో సహాయం చేయండి బాబా! ఈ విషయమై మేము 'నవగురువారవ్రతం' మొదలుపెడతాము. ఆ వ్రతం పూర్తయ్యేలోగా తనకి ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా!" అని వేడుకున్నాము. తరువాత నేను, నా భార్య వ్రతాన్ని మొదలుపెట్టాము. అలా ఉండగా ఒకరోజు నేను ఉద్యోగ విషయమై బాబాని ప్రశ్నలు&సమాధానాలు సైట్ లో అడిగాను. అప్పుడు బాబా నుండి "బిడ్డని తీసుకుని శిరిడీ వెళ్లి దర్శనం చేసుకుంటే తనకి ఉద్యోగం ప్రసాదిస్తాను" అని సమాధానం వచ్చింది. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. అంతకుముందు మేము శిరిడీ వెళదామని రెండు, మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక అవాంతరం ఏర్పడి వెళ్లలేకపోయాము. కానీ ఇప్పుడు బాబా పిలుపుతో అప్పటివరకు దొరకని రానూపోనూ ట్రైన్ టికెట్స్ దొరికి నేను, మా అబ్బాయి శిరిడీ వెళ్ళాము. బాబా మూడుసార్లు తమ దర్శనం ప్రసాదించడంతోపాటు సంధ్య ఆరతి చూసే భాగ్యం కూడా మాకిచ్చారు. శిరిడీ వెళ్లి వచ్చిన తరువాత గతంలో హాజరైన ఒక కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకు రమ్మని మెయిల్ చేశారు. 22.07.2019న మా అబ్బాయి ఆ ఇంటర్వ్యూకి హాజరవగా, దానిలో మావాడు సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చింది. మా వ్రతంలో ఇంకా రెండువారాలు ఉండగానే బాబా అనుగ్రహాన్ని మాపై కురిపించారు. ఇష్టపడ్డ ఉద్యోగం రావడంతో మావాడు, మేము చాలా చాలా సంతోషించాము. ఇంతగా మాకు అండగా ఉంటూ అవసరంలో ఆదుకుంటున్న నా తండ్రి బాబాకు ఏమిచ్చి కృతజ్ఞతలు తెలుపుకోగలము, జీవితాంతం ఆ తండ్రిని కొలవడం తప్ప! "బాబా! మీ చల్లని చూపు మా అందరిమీద ఉంచి, మా పిల్లల భవిష్యత్తు బాగుండేటట్లు, బంధుమిత్రులందరూ బాగుండేటట్లు ఆశీర్వదించండి తండ్రీ!"
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

ఊదీతో కంటి ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం
బెంగళూరు నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను సాయిబాబాకు అంకిత భక్తురాలిని. ఆయనపై నాకు అపారమైన నమ్మకం. నా ప్రియమైన సాయి నాకు అనేక అద్భుతమైన అనుభవాలనిచ్చారు. వాటిలో ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.
ఒకరోజు ఉదయం నిద్ర లేచాక నా రెండు కళ్ళు ఎర్రగా ఉండటం గమనించాను. కాస్త ఇబ్బందిగా కూడా అనిపించింది. బహుశా కళ్ళకి ఇన్ఫెక్షన్ సోకిందేమో అనుకున్నాను. కానీ ఆరోజు ఆఫీసులో ముఖ్యమైన పని ఉండటం వలన సెలవు తీసుకునే అవకాశం కూడా లేదని చాలా బాధపడ్డాను. వెంటనే, "బాబా! నా కంటి ఇన్ఫెక్షన్‌ను నయం చేయండి. మీ కృపవలన నాకు ఉపశమనం లభిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించి కళ్ళపై ఊదీ రాసుకున్నాను. తరువాత ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతున్నాను. అంతలోనే బాబా దయతో కళ్ళ ఎర్రదనం తగ్గడం ప్రారంభమైంది. ఆఫీసు చేరుకునేసరికి చాలావరకు ఉపశమనంగా అనిపించింది. ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆఫీసు పని చేసుకోగలిగాను. తరువాత ఐ డ్రాప్స్ కూడా వేసుకోవడం మొదలుపెట్టాను. కంటి ఇన్ఫెక్షన్ సాధారణంగా 5 నుండి 7 రోజుల వరకు ఉంటుంది. కానీ కేవలం రెండు రోజుల్లో నాకు పూర్తి ఉపశమనం లభించింది. రెండు రోజులలో నయం కావడం అసాధ్యమైనప్పటికీ సాయి ఆశీస్సులతో సాధ్యమైంది. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ! దయచేసి మా కుటుంబం మీద, మీ భక్తులందరి మీద మీ దీవెనలు సదా కురిపించండి".
ఓం సాయిరాం
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDelete