సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 50వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 50వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 93 

పూనాకు చెందిన ఒక స్త్రీకి పుత్ర సంతానం లేదు. అందువలన ఆ భాగ్యం పొందాలని ఆమెకు చాలా ఆతురతగా ఉండేది. అందుకోసం బాబాను ప్రత్యక్షంగా దర్శించుకోవాలని, ఆయన చేతుల మీదుగా ఒక టెంకాయను తీసుకోవాలని ఆమె కోరిక. శిరిడీ రావడానికి ఆమె చాలా సార్లు ప్రయత్నం చేసింది. కానీ ప్రతి ఒక్కసారి ఏదో ఒక సమస్య వచ్చి, ఆమె రాలేకపోయింది. ఒకసారి అయితే ఎంతో వేదనకు లోనయింది. అప్పుడు బాబా ఆమెకు స్వప్నదర్శనం ప్రసాదించారు. ఆ స్వప్నంలో బాబా ఆమెకు కొబ్బరికాయను కూడా ప్రసాదించారు. ఆమె మేల్కొన్నాక నిజంగానే కొబ్బరికాయ తన ప్రక్క మీద కనిపించింది. అందువలన ఆమెకు పట్టరాని సంతోషం కలిగింది. ఆ సంతోషంలో “నాకు బాబా కృప వలన పిల్లవాడు పుడితే, నేను ఆ పిల్లవాని పుట్టువెంట్రుకలు బాబా పాదాల వద్ద తీయిస్తాను” అని మొక్కుకుంది. ఆ విధంగానే సంవత్సరంలోపే అబ్బాయి పుట్టాడు. అప్పుడు మొక్కుకున్న ప్రకారమే ఆమె శిరిడీ వచ్చి పిల్లవానికి పుట్టువెంట్రుకలు తీయించారు. సారాంశం ఏమిటంటే స్వప్నంలోని టెంకాయ జాగృదవస్థలో చూడగానే బాబా యొక్క అగాధలీలను చూసి ఆమె ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురైంది.

అనుభవం - 94

శ్రీ లక్షణ్ గణేష్ మహాజని గారి ఒక అనుభవం. “నా స్నేహితుడు శ్రీధర్ కృష్ణ” అని ఉన్నారు. తాను ఎన్నోసార్లు బాబాకు సంబంధించిన లీలలు వినడం వలన  తనకు బాబా దర్శనానికై రావాలనే కోరిక కలిగింది. నాతో పాటుగా రావాలని నిశ్చయించుకున్నారు. ఆ విధంగానే మరలా నేను ఎప్పుడు శిరిడీకి బయలుదేరుతానో అప్పుడు నాకు కూడా చెప్పమని తాను నాతో చెప్పారు. ఆ తరువాత నేను 5, 6 సార్లు  శిరిడీకి వెళ్ళాను. ప్రతిసారి వస్తావా అని తనను అడిగేవాడిని. ఆ గృహసు బ్యాంకు పనిచేస్తారు. అందువలన నాకు సెలవులు దొరికినప్పుడు తనకు దొరికేవి కావు. ఆ కారణంతో లేదా ఇంకేదయినా కారణం వలన తాను శిరిడీకి రాలేకపోయాడు. చివరకు ఒకసారి మా ఇద్దరికి సెలవులు ఒకేసారి వచ్చాయి. దాంతో తాను నాతో పాటుగా బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. అప్పట్లో నేను బాంద్రాలో ఉండేవాడిని. టికెట్ తీసి రిజర్వేషన్ చేయించేందుకు తాను ఒప్పుకున్నాడు. “నేను రేపు బండి సమయానికి స్టేషనుకు వస్తాను” అని చెప్పి ఇంటికి వచ్చాను. మరుసటి రోజు ఉదయం శ్రీధర్ పంత్ మనుషులు నా వద్దకు వచ్చి “రాత్రి శ్రీధర్ పంత్ మెట్ల మీద నుండి పడ్డారు. ఆయన కాలు ఎంత వాచిందంటే నడవడానికి వీలు కావడం లేదు. అందువలన ఆయన శిరిడీకి రాలేరు” అని చెప్పారు. ఇక నేనొక్కడినే శిరిడీకి వెళ్ళాను. తరువాత ఆ గృహస్థు పై ఏదో కేసు వచ్చి, జైలుకు వెళ్ళాడు. చివరి వరకు తాను శిరిడీకి రాలేకపోయారు.

అనుభవం - 95

ప్రతిరోజు రాత్రి బాబాకు శ్రీమతి లక్ష్మీబాయి షిండే వద్ద నుండి సజ్జరొట్టెలు వచ్చేవి. ఆ సజ్జరొట్టెలు వచ్చే నిత్యక్రమం క్రింది విధంగా మొదలైంది. ఒకరోజు సాయంత్రం బాబా గోడ మీద పడుకుని ఉన్నారు. సమీపంలో తాత్యా పాటిల్ నిలబడి ఉన్నారు. ఇంతలో లక్ష్మీబాయి అక్కడకు వచ్చి బాబాకు నమస్కారం చేసుకుంది. “లక్ష్మీ నాకు ఆకలవుతోంది” అని బాబా అన్నారు. అప్పుడు లక్ష్మీబాయి “బాబా, భాకర్ (సజ్జరొట్టె) తీసుకు రమ్మంటారా?” అని అడిగింది. "తీసుకురా” అని బాబా అన్నారు. లక్ష్మీబాయి వెంటనే ఇంటికి వెళ్ళి రెండు సజ్జరొట్టెలు మరియు ఏదో కూర తీసుకు వచ్చింది. బాబా వాటిని తీసుకొని ఒక కుక్కముందర ఉంచారు. అప్పుడు లక్ష్మీబాయి “బాబా నీకు ఆకలి అవుతోంది కదా! మరి వాటిలో ఏమీ తినకుండా మొత్తం కుక్కకు వేసేసారు” అని అనింది. అందుకు బాబా “ఏం దానికి మాత్రం ప్రాణం లేదా? దానికి ఆకలి వేస్తుంది. తాను, నేను ఒకటే! తాను తిన్నా, నేను తిన్నా ఒకటే” అని అన్నారు. బాబా దేహత్యాగం చేసేముందు జేబులో నుండి ఒకసారి నాలుగు మరియు ఇంకోసారి ఐదు రూపాయలను తీసి లక్ష్మీబాయికి ఇచ్చారు. రాత్రిపూట బాబా భోజనం చేసిన తరువాత లక్ష్మీబాయి ఇంటికి వెళ్ళేది. స్త్రీలలో ఆమెకొక్కదానికే రాత్రిళ్ళు ద్వారకామాయికి రావడానికి అనుమతి ఉండేది. అందరికంటే చివరగా వెళ్ళే వారితో ఆమె వెళ్ళేది. మధ్యాహ్నం పూట ఎప్పుడైనా లక్ష్మీబాయి సజ్జరొట్టెలు తేవడం ఆలస్యమైతే, బాబా అలానే కూర్చొనేవారు. కొన్ని రోజుల వరకు మధ్యాహ్నం తరువాత కూడా బాబా ఆమె చేత సేమ్యా చేయించుకొని తెప్పించుకొనేవారు. బాబా నాలుగు ముద్దలు తిని, ఆ సేమ్యా పాత్రను లక్ష్మీబాయి చేతి ద్వారా కిటికీ గుండా రాధాకృష్ణాఆయికి ఇప్పించేవారు. ఆ విధంగా కొన్ని రోజులు జరిగింది. బాబా చాలాసార్లు తామే స్వయంగా వంట చేసేవారు. ఆ సమయంలో లక్ష్మీబాయి మరికొందరు దగ్గరే ఉండేవారు. కానీ బాబా వంటలో ఎవరినీ చేయి వేయనిచ్చే వారుకారు. గరిటెను అరుదుగా ఉపయోగించేవారు. చాలాసార్లు మసాలా వేసి పప్పు తయారుచేసేవారు. ఉడికేటప్పుడు ఆ పప్పును కలియబెట్టటానికి గరిటెను తీసుకోకుండా స్వయంగా తమ చేతిని ఉపయోగించేవారు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo