కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 68వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం -127
శ్రీ కృష్ణారావు నారాయణ్ పరూల్ కర్ ఉరఫ్ చోటుభయ్యా సాహెబ్,హర్దా నివాసి గారి ఉత్తరంలోని(9-10 -24 )సారాంశం.
హర్ధాలో నా స్నేహితుడు మరియు మరాఠా కులస్తుడు అయిన నారాయణ్ గోవింద్ షిండే ఉన్నారు. అతను నాకు చిన్నప్పటి నుండి స్నేహితుడు. 1903వ సంవత్సరంలో ఆయన, నేను మరియు సాధూభయ్యా అందరం కలిసి గాణుగాపూర్ కి వెళ్ళాము. శ్రీ నారాయణ్ గోవింద్ షిండే గారికి ఏడుగురు కుమార్తెలు కలిగారుకాని పుత్రసంతానం కలుగలేదు. గాణుగాపూర్ కి వెళ్ళాక నేను తనతో “నీవు దైవం యొక్క పాదుకల మందు నిల్చోని నాకు సంవత్సరం లోపే పుత్రసంతానం కలిగితే ఆ పిల్లవానిని నీ చరణ దర్శనానికి తీసుకువస్తాను” అని మొక్కుకో అని చెప్పాను. తాను “సరే” అని చెప్పి కూర్చొన్న చోటనే మొక్కుకోసాగాడు. “అలాకాదు, పాదాల ముందుకు పద” అని చెప్పి అతని చేయి పట్టుకొని పాదాల ముందుకు తీసుకు వెళ్ళాను. అక్కడ తనను మొక్కుకోమని చెప్పి సాష్టాంగ నమస్కారం చేయించాను. హార్ధా వచ్చిన తరువాత తనకు ఒక సంవత్సరం లోపే పుత్రసంతానం కలిగింది. అప్పుడు తనకు నేను “ఇక నీవు నీ మొక్కు తీర్చుకోవాలి” అని చెప్పాను. కానీ “ఇప్పుడు వెళదాం, అప్పుడు వెళదాం” అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. తరువాత శ్రీ సమర్థ సాయిబాబా గారి లీలలను శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి ద్వారా వినడం జరిగింది. 1911వ సంవత్సరంలో నవంబరు మాసంలో మేము శిరిడీకి వెళ్ళాము. మొదట మాతో కలిసి శిరిడీ రావాలనే ఆలోచన శ్రీ షిండే గారికి లేదు. కానీ మేము స్టేషనుకు బయలుదేరే సమయానికి మా దగ్గరకు వచ్చి నేను కూడా మీతో వస్తాను” అని అన్నారు. “మొదట వచ్చే ఆలోచన లేదు కదా, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ నిర్ణయమేమిటి?” అని అడిగాను. “అవును నిజమే. మొదట మీతో వచ్చే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఉన్నట్టుండి మనసులో మీతో కలిసి వెళ్ళవలసిందేనని అనిపించసాగింది. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీ వద్దకు వచ్చాను” అని తాను చెప్పాడు. తరువాత తాను, నేను, సాధుభయ్యా, నాథుభయ్యా ఇలా అందరం కలిసి శిరిడీ వెళ్ళాము. మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలకు శిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకున్నాము. మరుసటి రోజు మధ్యాహ్నం ఆరతి జరిగింది. మేమందరము ద్వారకామాయిలో నిలబడియున్నాము. ఇంతలో బాబా షిండే వైపు చూస్తూ కొంచెం కోపంగా "గర్వంతో మిడిసిపడుతున్నావా? నీ జాతకంలో పిల్లవాడు ఎక్కడున్నాడు? (తమ పొట్ట వైపు చూపిస్తూ) ఈ పొట్టను పగలగొట్టి నీకు పిల్లవాడినిచ్చాను. పిచ్చివేషాలు వేసావంటే ఇక్కడి నుండి నెట్టి పారేస్తాను” అని అంటూ నా వైపు చూసి “అంతే కదా” అని అన్నారు. ఆ మాటలకు శ్రీ షిండే గారి కన్నుల నుండి అశ్రుధార ప్రవహించసాగింది. తాను మనఃస్పూర్తిగా బాబాను “బాబా పొరపాటైంది. నన్ను క్షమించండి” అని ప్రార్థించాడు. అక్కడనుండి తిరిగి రాగానే కొన్ని రోజులకు భార్యాపిల్లలను తీసుకొని శిరిడీ వచ్చి పిల్లవానిని బాబా చరణాలపై పెట్టాడు. అప్పుడు కూడా బాబా నా వైపు చూసి “అంతే కదా” అని అన్నారు. నేను తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళి గాణుగాపూర్ అక్షరం, అక్షరం చెప్పిస్తూ మొక్కించాను. అందువలన బాబా నా వైపు చూసి అలా అన్నారని అర్థం చేసుకున్నాను. ప్రస్తుతం షిండే మరియు తన కుమారుడు అందరూ ఆనందంగా ఉన్నారు. తనకు శ్రీ సాయి చరణాలపై ఎనలేని ప్రేమ మరియు తాను సాయిలీల యొక్క చందాదారుడు కూడా!
తరువాయి భాగం రేపు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
I pay a visit day-to-day some web sites and websites to
ReplyDeleteread articles or reviews, however this blog provides feature based posts.
Hi i am kavin, its my firet occasion tto commenting anyplace,
ReplyDeletewhenn i read this post i thoughjt i could also make comment due to this brilliant paragraph.
Fine way of explaining, and fastidious paragraph to take facts on the topic of
ReplyDeletemy presentation topic, which i am going to convey in institution of higher education.