సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 104వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. సాయే నా సంరక్షకుడు
  2. బాబా అనుగ్రహంతో కంప్యూటర్ సైన్సులో సీటు

సాయే నా సంరక్షకుడు

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

గత పది, పదకొండు సంవత్సరాలుగా నేను సాయిభక్తురాలిని. 2008లో నేను డిస్క్ ప్రోలప్స్ సమస్యతో బాధపడ్డాను. డాక్టర్స్ 8 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అప్పటికీ నొప్పి తగ్గకపోతే వెన్నెముక ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. నేను నా రోజువారీ కార్యకలాపాలకు మరొక వ్యక్తిపై ఆధారపడవలసిరావడం నాకెంతో బాధాకరంగా ఉండేది. నాకప్పుడు కేవలం 21 ఏళ్ల వయస్సు. నా బంధువులంతా నేను మళ్ళీ నడవగలుగుతానా? అని అనుకుండేవారు. కానీ సాయిబాబా రాకతో నా జీవితంలో ఆనందం చిగురించింది. ఆయన నా కాళ్ళమీద నన్ను నిలుచోబెట్టారు. అప్పటినుండి నేను ఆయనకు అంకిత భక్తురాలినైపోయాను.

2018లో బాబా మాకొక బిడ్డని అనుగ్రహించారు. కానీ హఠాత్తుగా నాకు వెన్నునొప్పి మళ్ళీ మొదలైంది. పది సంవత్సరాల క్రితం ఏ సమస్యతో అయితే భయంకరమైన వేదన అనుభవించానో అదే సమస్య మొదలయ్యేసరికి నేను చాలా భయపడిపోయాను. నేను నా భర్తతో అమెరికాలో ఉన్నాను. సహాయం చేసేందుకు ఎవరూ లేరు. నా బిడ్డ గురించి నేను చాలా బెంగపడ్డాను. తనకి నా అవసరం చాలా ఉంది. నిస్సహాయురాలైన ఈ తల్లి ఏమి చేయగలదు? అటువంటి సమయంలో సహాయం కోసం నా దేవుడిని పిలిచి, "నాకు నయం చేయమ"ని ప్రార్థించి ఊదీ తీసుకోవడం మొదలుపెట్టాను. మీరు నమ్మలేరు, ఒక్కవారంలో వేరే ఏ ఔషధం తీసుకోకుండా కేవలం ఊదీతో నా నొప్పి అదృశ్యమైపోయింది. "లవ్ యు దేవా!"

తరువాత నా బిడ్డకి 11 నెలలు వచ్చాక హఠాత్తుగా ఒకరోజు వాంతులు చేసుకుంది. తాను పుట్టింది మొదలు ఎప్పుడూ వాంతి చేసుకోలేదు. అలాంటిది ఆరోజు త్రాగిన నీళ్లు కూడా వాంతి చేసుకుంది. నేను మా డాక్టరుకి ఫోన్ చేస్తే, కడుపులో పురుగులేవైనా ఉండొచ్చు, 5 రోజులు మందులు వాడమని చెప్పారు. కానీ నేను మందులు ఇవ్వడానికి ఇష్టపడక తనకి ఊదీ ఇవ్వడం మొదలుపెట్టాను. తరువాత ఒక్క వాంతి కూడా కాలేదు. "ధన్యవాదాలు దేవా!" కానీ అప్పుడప్పుడు ఆమె వాంతులు చేసుకుంటుంది. నా దేవుడు ఖచ్చితంగా తనకి నయం చేస్తారని నా నమ్మకం. 

ఓం శిరిడీవాసాయ విద్మహే౹ సచ్చిదానంద ధీమహీ౹ 
తన్నో సాయి ప్రచోదయాత్౹౹

బాబా అనుగ్రహంతో కంప్యూటర్ సైన్సులో సీటు

యు.ఎస్.ఏ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను చిన్నవయస్సు నుండి సాయిభక్తురాలిని. బాబా ఇచ్చిన ఒక అద్భుత అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 'సాయిసచ్చరిత్ర'లో చెప్పినట్లు తల్లి ఎప్పుడూ తన ఒడిలో బిడ్డను పొర్లాడనివ్వకుండా నిషేధించదు, సముద్రం నదులను వెనుకకు తరమదు. అలానే బాబా మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వకపోవడమంటూ ఎన్నటికీ ఉండదు. ఒక సంవత్సరం క్రితం నేను ఏ కాలేజీలో చేరాలో నాకు తెలియలేదు. కాలేజీలో చేరడానికి ఎంట్రన్స్ పరీక్షలు పెద్ద సమస్య. అందుకోసం నేను SAT లేక ACT ఏదో ఒక దానికి ప్రిపేర్ కావాల్సి వచ్చింది. మంచి స్కోరు తెచ్చుకుంటేనే మంచి కాలేజీలో అవకాశం దక్కుతుంది. SAT పరీక్షకు నేను గంటల తరబడి చదివినా చివరికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇతరులతో పోలిస్తే ప్రతిసారీ నా స్కోర్ తక్కువగా ఉంటుండేది. నా స్కోర్ చూసి ఏడ్చేసేదాన్ని. నాకున్న స్వల్ప సామర్ధ్యంతో ప్రయత్నించి, ప్రయత్నించి అలసిపోయాను.

అదంతా అలా ఉంటే, నాకెంతో ఇష్టమైన మా అమ్మమ్మ వేసవికాలంలో చనిపోయింది. అప్పటికే నేను అనుభవిస్తున్న ఒత్తిడికి ఈ బాధ కూడా తోడై పూర్తిగా నీరసపడిపోయాను. ఇక పరీక్షలో విజయం సాధిస్తాననే ఆశ పోయింది. ఆ సమయంలో ఆశగా బాబా వైపుకు దృష్టి సారించాను. వెంటనే నా ఫ్రెండ్ SAT కు ప్రయత్నించడం ఆపివేసి, దానిబదులు ACT పరీక్షకు ప్రయత్నించమని సూచించారు. నేను పరీక్ష కోసం దరఖాస్తు చేసి భారం బాబాపై వేసాను. సాధారణంగా అందరూ నెలల తరబడి పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ నాకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. అయినా నా వంతు కృషి నేను చేసి, పరీక్ష వ్రాసి ఫలితం బాబాకు వదిలిపెట్టాను. తరువాత ఫలితాలు విడుదలయ్యే రోజు నేను బాబా ముందు కూర్చుని అదేపనిగా వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేస్తూ ఉన్నాను. చివరికి నాకు 36 మార్కులకి 34 మార్కులు వచ్చినట్లు చూసాను. వెంటనే నా కళ్ళనుండి కన్నీళ్లు ధారగా కారాయి. ఎంత అద్భుతం! బాబా నన్ను విడిచిపెట్టరని నాకు తెలుసు. నా నమ్మకమే నిజమైంది. ఆ స్కోరుతో ప్రతిష్టాత్మక కంప్యూటర్ సైన్స్ కాలేజీలో నాకు సీటు వచ్చింది. ఈ అనుభవం జరిగి ఒక సంవత్సరం అయినప్పటికీ, నాకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. బాబా ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటారు. ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. "బాబా! ఎల్లప్పుడూ నన్ను జాగ్రత్తగా సంరక్షిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు".

source: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2380.html

2 comments:

  1. Om Sai ram in hyd Sai tv arranged guru poornima arpanam to Sai baba.many devotees did arpanam to Sai baba.to fulfill their desires.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo