ఈరోజు భాగంలో అనుభవాలు:
- బాబా చేసిన ఏర్పాట్లు
- సాయి అడ్మిట్ కార్డు వచ్చేలా అనుగ్రహించారు
బాబా చేసిన ఏర్పాట్లు
రష్యా నుండి సాయిభక్తుడు రవి వీరరాఘవన్ తన అనుభవాలనిలా తెలియజేస్తున్నారు:
నేను సాయిబాబా భక్తుడిని. నేను బెంగళూరుకి చెందినవాడిని. ప్రస్తుతం రష్యాలోని వెస్ట్ సైబీరియాలో వున్న omsk సిటీలో ఉద్యోగం చేస్తున్నాను. బాబా మహాసమాధి ఉత్సవాలలో ప్రధానమైన రోజైన విజయదశమినాడు అనుకోకుండా నాకు కావలసిన చోట 'ట్రైన్ ఆగడం - ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలు కల్పింపబడటం' వంటి అద్భుతమైన బాబా లీలలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
నేను రష్యా తిరిగి వెళ్లిపోయేముందు నా కుటుంబంతో ఒకసారి గడిపి వద్దామని అక్టోబర్ 17న బెంగళూరు నుండి కేరళలోని ఫెరోకే ప్రయాణమయ్యాను. నేను ప్రయాణంలో ఉండగా మధ్యాహ్నం నా భార్య ఫోన్ చేసి, ఆడవాళ్ళని శబరిమలై దర్శనానికి సుప్రీంకోర్టు అనుమతించిన కారణంగా కేరళ అంతటా అక్టోబర్ 18న బంద్ ప్రకటించారని, ఆ కారణంగా ఆరోజు ఎటువంటి ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలు ఉండవని చెప్పింది. నేను ఒక్కసారిగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, ట్రైనుకు ఫెరోకేలో స్టాప్ లేనందున నేను కోజికోడ్ వరకు వెళ్లి ఫెరోకేకి తిరిగి రావాల్సి ఉంది. బంద్ వలన ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం లేకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. మరుసటిరోజు కాసేపట్లో స్టేషన్ వస్తుందనగా నేను సహాయం చేయమని బాబాని ప్రార్థించాను. కొద్దిక్షణాల్లో ఫెరోకే స్టేషన్లో ట్రైను ఆగింది. తోటి ప్రయాణికుల సహాయంతో నేను వెంటనే ట్రైను దిగేశాను. దిగిన వెంటనే ట్రైన్ కూడా కదిలింది. తర్వాత నేను స్టేషన్ బయటకు వస్తూనే బాబా చేసిన ఏర్పాటుకి ఆశ్చర్యపోయాను. స్టేషన్ బయట నాకు తెలిసిన ఒక ఆటోడ్రైవర్ స్కూటరుపై ఉండటం చూశాను. అతను మా మామగారిని వారంలో మూడుసార్లు డయాలసిస్ కోసం హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అతను నన్ను చూస్తూనే తనంతట తానుగా నా దగ్గరకు వచ్చి, "రండి, ఇంటి దగ్గర దించుతాను" అన్నాడు. నేను, "మీ వాళ్లెవరి కోసమైనా స్టేషన్‌కి వచ్చారా?" అని అడిగాను. అందుకతను, "అదేమీలేదు, మామూలుగానే వచ్చాను" అన్నాడు. అతను నన్ను 5 నిమిషాల్లో ఇంటికి చేర్చాడు. నేను చేసిన చిన్న ప్రార్థనకే బాబా అన్ని ఏర్పాట్లు చేశారు. స్టాప్ లేని చోట ట్రైన్ ఆగడం, స్టేషన్ బయట ఆటోడ్రైవర్ ఉండటం అంతా సాయిబాబా సర్వవ్యాపకత్వానికి నిదర్శనం.
రెండవ అనుభవం:
బంద్ కారణంగా బాబా మహాసమాధిరోజు ఆయన దర్శనం చేసుకోలేకపోయాను. అందుకు నేను చాలా బాధపడి మరుసటిరోజు షాపింగ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు బాబా దర్శనం చేసుకుందామని అనుకున్నాను. అయితే షాపింగ్ పూర్తయ్యేసరికి ఆలస్యం అవడం, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో నామీద నాకే అసహ్యం వేసింది. ఇంక బాబా గుడికి వెళ్లే ఆశ కూడా కోల్పోయాను. వెంటనే అద్భుతాలలోకెల్లా అద్భుతం జరిగింది. మాకు ఎదురుగా సాయిబాబా పల్లకి ఊరేగింపు వస్తుంది. నేను ఉన్నచోటనే బాబా నాకు దర్శనం ఇచ్చేశారు. మాములుగా అయితే నేను ట్రాఫిక్‌జామ్‌లో చాలా చికాకుకి గురవుతాను. అలాంటిది ఆరోజు నేనెందుకో చాలా ప్రశాంతంగా ఉన్నాను. చివరికి బాబా ఇచ్చిన అద్భుతమైన దర్శనంతో ఆనందంలో మునిగిపోయాను.
పై రెండు అనుభవాల ద్వారా బాబా ఎప్పుడూ తన భక్తుల ఆలోచనలు గమనిస్తూ వాళ్ల అవసరాలకు తగినట్టుగా పరిస్థితులను నియంత్రించి అవసరమైనది చేస్తారని నాకు అర్థమైంది. మనం ఏమాత్రం బాధపడకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు బాబా.
అంతకుముందు కూడా నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అయితే, మహాసమాధి ఉత్సవాలనాడు బాబా ఇచ్చిన ప్రత్యేకమైన కానుకలు ఇవి. ఇంకో విషయం, ఈ అనుభవాలు జరగకముందు నేను సచ్చరిత్ర పారాయణ పూర్తిచేయడంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు ప్రతిరోజూ ఒక అధ్యాయము చదవగలుగుతున్నాను. అందువలన మానసిక ప్రశాంతత చేకూరుతోంది. అది నా రోజువారీ పనులలో ఎంతో సహాయకారిగా ఉంది. మీకు అవకాశం ఉంటే రోజూ సచ్చరిత్ర చదవండి. మనసుకెంతో ప్రశాంతత చేకూరుతుంది.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2369.html

సాయి అడ్మిట్ కార్డు వచ్చేలా అనుగ్రహించారు:
సాయిభక్తురాలు షరీన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ ఓం సాయిరామ్! ఉండాల్సిన అటెండెన్స్ లేకపోయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాకు పరీక్షకు అవసరమైన అడ్మిట్ కార్డు వచ్చేలా బాబా చేసిన లీల నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను 3వ సంవత్సరంలో ఉన్నాను(తానేమి చదువుతున్నారో భక్తురాలు వెల్లడించలేదు). 2018 డిసెంబరులో నా సెమిస్టర్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. మా కాలేజీలో కనీసం 66.7శాతం హాజరు ఉంటేగానీ అడ్మిట్ కార్డు ఇవ్వరు. అలా ఉండని సందర్భంలో విద్యార్థి ఒక వాగ్దానపత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అదేమీ అంత సులువుగా అయ్యే పనికాదు. అందుకు చాలా రద్దీ ఉంటుంది. పైగా గంటలపాటు వేచి ఉండాలి. అయితే పరీక్షలకు 15 రోజుల ముందు నేను నా హాజరును తనిఖీ చేసుకుంటే సరిగ్గా 66.7 శాతం ఉంది. వెంటనే సాయికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. 'ఈ సెమిస్టర్‌కి నేను సులభంగా అడ్మిట్ కార్డు పొందుతాను' అని అనుకున్నాను. అయితే కార్డు పంపిణీకి ముందురోజు నేను మళ్లీ హాజరును చూస్తే 63 శాతం ఉండటంతో నేను నిర్ఘాంతపోయాను. ఆ సంవత్సరం నేను కష్టపడి చదివాను, నా క్లాసులకు కూడా క్రమం తప్పకుండా వెళ్ళాను. అయినా కూడా అలా జరిగేసరికి నేను చాలా బాధపడ్డాను. కానీ చేసేదిలేక వాగ్దానపత్రంలో సంతకం చేయడం కోసం లైనులో నిలబడటానికి మానసికంగా నన్ను నేను సిద్ధపరచుకున్నాను.
చివరగా ఆరోజు వచ్చింది. కాలేజీకి వెళ్లేముందు, "బాబా! హాజరు తక్కువైనందున వాగ్దానపత్రంలో సంతకం చేయడానికి వెళ్తున్నాను. కానీ నేను ఎక్కువసేపు నిలబడలేను. దయచేసి నాకు ఓపికగా నిలబడే శక్తినివ్వండి" అని ప్రార్థించి బయలుదేరాను. కానీ నా బాబా ప్రణాళిక వేరుగా ఉందని నాకు తరువాత తెలిసింది. నేను లైనులో నిలబడేందుకు వెళ్ళడానికి సిద్ధపడుతుండగా హఠాత్తుగా నా స్నేహితురాలు నా దగ్గరకు వచ్చి, "హాజరు తక్కువైనవాళ్ళ లైనులోకి వెళ్లేముందు ఒకసారి హాజరు 66.7 శాతం ఉన్న విద్యార్థులకు అడ్మిట్ కార్డు పంపిణీ చేస్తున్న కిటికీ వద్ద చెక్ చేసుకుందామ"ని చెప్పింది. సరేనని నేను, నా స్నేహితురాలు ఆ కిటికీ వద్దకు చేరుకున్నాము. ముందుగా నా స్నేహితురాలు కార్డుని అడిగింది. నిజానికి తనకి కూడా హాజరు తక్కువగా ఉంది. కానీ ఆశ్చర్యంగా తనకి కార్డు లభించింది. వెనుక ఉన్న నేను, "బాబా! దయచేసి నాకు అడ్మిట్ కార్డు ఇప్పించండి" అని మనసులో చెప్పుకుంటూ సాయి నామం ఉచ్ఛరిస్తూ ఉన్నాను. తరువాత నా వంతు వచ్చింది. అద్భుతం! కరుణామయుడైన నా సాయిబాబా ఎటువంటి అడ్డంకులు లేకుండా నాకు అడ్మిట్ కార్డు వచ్చేలా చేసారు. "నిరంతరం అంతులేని ఆశీస్సులు నాపై కురిపిస్తున్నందుకు, మీ సంరక్షణకు, కృపకు, అన్నింటికీ థాంక్యూ సో మచ్ బాబా!"
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2380.html
No comments:
Post a Comment