కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 64వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 123
శ్రీ వాసుదేవ్ సదాశివ్ జోషి గారి అనుభవం.
నిన్నటి తరువాయి భాగం....
ఆ తరువాత శిరిడీ నుండి బయలుదేరడానికి అనుమతి అడగడం జరిగింది. అప్పుడు బాబా “ఇటువంటి నిరపేక్ష జీవులకు రావడానికి, పోవడానికి అనుమతి అవసరం లేదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రావచ్చు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పోవచ్చు” అని చెప్పారు. ఆ రోజు గురువారం మధ్నాహ్నం శ్రీ గాడ్గిల్ “ఇక్కడ నుండి ఏదైనా ప్రసాదం తీసుకు వెళ్ళు” అని అంటూ, పూజారి జోగ్ వద్ద నుండి ప్రసాదం అడగడానికి వెళ్ళారు. అప్పుడు ఒక్కక్కరికి ఒక్కొకటి చొప్పున ముగ్గురు మనుషులకు మూడు బర్ఫీలు చేతిలో పడ్డాయి. బసకు శ్రీ అన్నా సాహెబ్ గాడ్గిల్ వగైరా వంటి వారి వద్దకు ఆ బర్పీలతో వచ్చాను. అప్పుడు వారు ఆ ప్రసాదాన్ని చూసి “ఈ ప్రసాదం సరిపోదు. ఇంకా ఎనిమిది అణాలు తీసుకొని వెళ్ళి బర్ఫీ తీసుకొనిరా” అని చెప్పారు. షిరిడీలో ఏదికొన్నా బాబా ప్రసాదమే అనుకుంటూ బయలుదేరగా, దారిలో ఒక వ్యక్తి పళ్ళెం నిండా బర్ఫీ నింపుకొని వస్తూ “బర్ఫీనంతా బాబా శ్రీ గాడ్గిల్ గారి అతిథికి ఇమ్మన్నారు” అని చెప్పాడు. నేను వెనుకకు తిరిగి బసకు వచ్చాను. నాకు మరియు శ్రీ గాడ్గిల్ గారికి ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం బాబాకు ఎలా తెలిసింది, అప్పటికప్పుడు ఇది అంతా ఎలా ఏర్పాటు చేసారు” అనే విషయం తలచుకొని కంటినుండి ఆనందాశ్రువులు జలజల రాలాయి. తరువాత అదే రోజు సంత ఉండటంతో పచ్చి వేరుశనగకాయలను కొనుక్కొని తీసుకువచ్చి భక్తులు తింటున్నారు. శ్రీ గాడ్గిల్ గారు ఒక రూపాయిని ఇచ్చి ఇంకా వేరుశనగకాయలను తీసుకురమ్మని మనిషిని పంపారు. ఆ మనిషిని శ్రీ తాత్యాసాహెబ్ గారు దారిలో ఆపి “ఎక్కడకు వెళుతున్నావు?” అని అడిగారు. "శ్రీ గాడ్గిల్ గారి అతిధికి వేరుశనగకాయలు కొనుక్కుని తీసుకురావడానికి వెళుతున్నాను” అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అప్పుడు శ్రీ తాత్యాసాహెబ్ “మొదట వచ్చిన వేరుశనగకాయల బస్తాలలో నుండి రెండు సంచుల వేరుశనగ కాయలను గాడ్గిల్ మరియు తన అతిథికి తినడానికి ఇవ్వమని బాబా ఆజ్ఞాపించారు. తరువాత కూడ వారు ఎంత కావాలంటే అంత వారికిచ్చి మిగిలినది ఇతరులకు పంచిపెట్టమన్నారు” అని ఆ వ్యక్తికి చెప్పడంతో ఆ వ్యక్తి వేరుశనగకాయలతో మరియు ఇచ్చిన రూపాయతో వెనుకకు వచ్చాడు. విషయం తెలిసి మేము ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాము. బాబా కూర్చొన్నచోటు నుండే ఏ విధమైన కేళీవినోదాన్ని చేస్తుంటారు మరియు ఆయన సర్వాంతర్యామితత్వాన్ని తెలియపరచే అనుభవం అందరికీ కలగడంతో అందరికీ కళ్ళ నుండి ఆనందాశ్రువులు ధారగా ప్రవహించసాగాయి. అటువంటి ఆనందానుభూతులతో, మరియు బాబా ఫోటోను ఈ జీవుని యొక్క నిత్యగీతాపారాయణ గ్రంథంలో ఉంచినట్లయితే నిత్యదర్శనం అవుతుంది అనే భావన నాకు కలిగింది. అది ఈ జీవుని యొక్క పరమ భాగ్యంగా భావించి, తిరిగి షోలాపూర్ రావడం జరిగింది. ఇక్కడకు వచ్చాక వి. యస్. ఫోటోగ్రాఫర్ ఎంతో భావికుడు మరియు శ్రద్ధాళువు అంటే ఆ భక్తిలో తనను తాను మరిచిపోతాడు. అటువంటి భావికుడైన వ్యక్తికి శ్రీ బాబా దర్శనానికై వెళ్ళమని సలహా ఇచ్చాను. ఖర్చుల కోసం 10 రూపాయిలను ఇచ్చి “పది రూపాయిలు పోతే పోనీ! నీవు అయితే బాబా దర్శనం చేసుకొని రా! వీలయితే బాబాను ఫోటో తీసే పని పూర్తి చేసుకుని రా” అని చెప్పాను. వెంటనే తాను వెళ్ళేందుకు సిద్దమై నేను ఇచ్చిన ఉత్తరంతో సహా శిరిడీ చేరుకున్నాడు. అక్కడ శ్రీ గాడ్గిల్ మరియు శ్రీ సాటే ఆ వ్యక్తికి అన్ని ఏర్పాట్లు చేసి బాబా దర్శనం చేయించారు. తరువాత తాను బాబాకు చెప్పకుండా పొరపాటున తీసిన ఫోటో ఉంది. కానీ ఆ వ్యక్తి దర్శనం చేసుకోగానే బాబా తమకు తామే స్వయంగా “అరే! నిన్ను సత్యనారాయణ కంపెనీ జోషీబువా ఫోటో తీసుకోవడానికి పంపించాడు కదా, మరి ఊరకనే కూర్చొన్నావెందుకు? నీకు ఎలా కావాలంటే అలా ఫోటో తీసుకో” అని అంటూ బాబా ఆనందంతో కూర్చొని మరియు నిల్చొని ఫోటో తీయించుకోవడంతో అందరికీ ఎంతో సంభ్రమాశ్చర్యం కలిగింది. ఫోటో తీసే కార్యక్రమం అయిపోయిన తరువాత తనను శిరిడీలో నాలుగు రోజులు ఉంచుకొని, తనతో “నీవు ఆ ఫోటో విలువ కంటే అధిక మొత్తానికి అమ్ముకోవద్దు. అయినా నీవు సత్యనారాయణ కంపెనీ జోషీబువా యొక్క ప్రియ శిష్యుడివి. తాను నిన్ను అధిక మొత్తానికి ఎలాగు అమ్ముకోనివ్వడు. తన ఆశీర్వాదంతోనే నీకు మంచి జరుగుతుంది” అని ఉపదేశం చేసారు. అక్కడ స్థాపించిన దక్షిణ భిక్షాసంస్థలో ఆ ఫోటోగ్రాఫర్ తన యొక్క పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ సంస్థ వాళ్ళు తనకు కొన్ని ఫోటోలకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. తనకు రానూ, పోనూ రవాణా ఖర్చులు కూడా ఇచ్చి, బాబా అనుమతితో తనను తిరిగి పంపించారు. ఆ విధంగా ఆ సంస్థ ద్వారా ఆ ఫోటో యొక్క బట్వాడా యోగ్యమైన విధానంలో చేయడం జరిగింది.

తరువాయి భాగం రేపు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
This page definitely has all the info I needed concerning this
ReplyDeletesubject and didn't know who to ask.
what do you want, please explain sai
Delete