సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 70వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 70వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 129

శ్రీ కాకాసాహెబ్  గారికి శ్రీ ఉద్ధవేశ్ బువా వ్రాసిన  ఉత్తరం

శ్రీవారు నిర్యాణం చెందినప్పుడు నాకు పదవ చాతుర్మాస్యం కావడం వలన శిరిడీకి రాలేకపోయాను. అక్కడ ఏ విధంగా జరిగిందో అంతా శ్రీవారు స్వప్నంలో చూపించడం వలన మరియు చాతుర్మాస్యంలో పొలిమేరలు దాటకూడదని శ్రీవారి ఆజ్ఞ ఉండటం వలన రాలేకపోయాను. గురుదేవులు ఏ స్వప్నమైతే చూపించారో, ఆ స్వప్నం ఇక్కడ జాను గారికి, అమళ్ నేర్ గారికి మరియు పావస్కర్ గారికి శ్రీవారి పదమూడవ రోజు పూర్తయ్యాక అర్థం అయింది.

కాకాజీ అప్పాజీ వైద్య, సప్తశృంగి దేవాలయం, వణి, శ్రీ సాయిబాబాకు రాసిన ఉత్తరం

ఆషాఢ శుద్ధ 11వ తారీఖు

శ్రీ జగదాంబ యొక్క ఆజ్ఞానుసారం మీ చరణాల వద్దకు వచ్చాను. మీ అనుమతితో నింబవృక్షం క్రింద పాదుకల వద్ద సేవ చేసుకున్నాను. చాలారోజుల నుండి ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నాను. శ్రీ గురుదర్శన యోగంతో మనసుకు శాంతి లభిస్తుంది. మీ కృప పొందాను. చాలా ఆనందంగా ఉంది. 

మాఘశుద్ద 8వ తేది నాడు శ్రీ కాకాజీ వైద్య శ్రీ సాయిబాబాకు వ్రాసిన  ఉత్తరం

శ్రీ సాయిబాబా ఆజ్ఞ అవడంతో బాబా దర్శనానికి కార్తీకమాసం చివరలో వచ్చేవాడినే కానీ మార్గశిరమాసం నుండి ఇక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించింది. ప్రస్తుతం బాగానే ఉంది. ఆ సమయంలో నా చిన్న కుమారుడికి మరియు నా సోదరుని మనవడికి పునర్జన్మ లభించింది. ఆ సంకట సమయంలో బాబా వచ్చి ఎంతో ధైర్యం ప్రసాదించారని చెప్పటానికి ఎంతో ఆనందంగా ఉంది. బాబా యొక్క మహిమను వర్ణించడానికి ఈ అజ్ఞాని అసమర్థుడు.

మధురదాస్ హిర్ జీ దాస్, అంజన్ వేల్ గారికి వచ్చిన అనుభవాలు.  

(1) 1917వ సం||లో నాపై కొన్ని ఆరోపణలు వచ్చి ఎన్నో కష్టాలుపడ్డాను. అప్పుడు వెళ్ళి బాబాకు చెప్పుకుంటే “వాటికై అవే తొలగిపోతాయి" అని చెప్పారు. అదేవిధంగా ఒక్క పైసా కూడా ఖర్చుకాకుండా ఆ ఆరోపణలు తొలగిపోయాయి.

(2) 1914వ సం||లో నా కుమారుడు ఎంతో జబ్బున పడ్డాడు. అదేరోజు నేను బయట గ్రామంలో ఉన్నప్పుడు “నీ కుమారుడు బాగా జబ్బున పడ్డాడు, కానీ ఆందోళనపడకు, తనకు నయమవుతుంది” అని బాబా చెపుతున్నట్లుగా దృష్టాంతం వచ్చింది.

(3) 1918వ సం||లో శిరిడీలో, సగుణెమేరు నాయక్ భోజనాలయంలో ఉన్నప్పుడు ఒక భక్తుడు చేసిన తప్పును, నాకు వేరే ఒక వ్యక్తి చెపుతూ ఉన్నాడు. నేను కూడా కుతుహలంగా అన్ని వివరాలు అడుగుతున్నాను. అప్పుడు బాబా నన్ను కావాలని పిలిపించి “నీవు ఎక్కడ కూర్చొన్నావ్? దగ్గర ఎవరున్నారు? ఏం చేస్తున్నావు?” అని అడిగారు. ఇదివరికెప్పుడూ అలా అడుగలేదు. దానిని బట్టి మా సంభాషణ బాబాకు నచ్చలేదని నాకు అర్థమై, మరలా ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడలేదు. 

(4) 1917వ సం||లో నా తృతీయ వివాహానికి సంబంధించి బాబా చెప్పిన విధంగానే అనుభవం వచ్చి 1918 సం||లో తృతీయ వివాహం జరిగింది.

(5) బాబాతో నా పరిచయం నాలుగు సంవత్సరాలు. అందులో విశేష పరిచయం ఒక సంవత్సరం. 

(6) 1918వ సం||లో ఆషాఢమాసంలో నా సోదరి ఎంతో జబ్బునపడింది. బాబాకు ఉత్తరం ద్వార విన్నవించుకోవడం జరిగింది. బాబా చెప్పిన విధంగానే కొద్ది రోజులలో తాను పూర్తిగా కోలుకుంది. 

(7) 1918వ సం||లో చైత్రమాసంలో నా మనవడు చాల అస్వస్థతకు గురయ్యాడు. ఉత్తరం ద్వారా విన్నవించుకుంటే, బాబా చెప్పిన విధంగానే పూర్తిగా కోలుకున్నాడు.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo