ఈరోజు భాగంలో అనుభవాలు:
- నిస్సహాయస్థితిలో బాబా ఊదీ చేసిన మహత్యం
- బిడ్డను ప్రసాదించిన బాబా
నిస్సహాయస్థితిలో బాబా ఊదీ చేసిన మహత్యం
సాయిభక్తులకు నా నమస్కారములు. నా పేరు రఫీ. 2019, జనవరి నెల మూడు లేదా నాల్గవ వారంలో ఒకరోజు రాత్రి మా కుటుంబసభ్యులందరం భోజనం చేసి పడుకున్నాము. హఠాత్తుగా అర్థరాత్రి 12 గంటల సమయంలో మా అమ్మకి గుండెలో మంట వచ్చింది. అమ్మ నొప్పి భరించలేకపోయింది. అలాంటి సమయంలో ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా డాక్టర్లెవరూ ఉండరు. ఏం చేయాలో అర్థంకాక బాబా ముందు నిలబడి, "బాబా! మీ మీదే భారం వేస్తున్నాను తండ్రీ! మీ ఊదీని నీళ్లలో వేసి అమ్మ చేత త్రాగిస్తాను. ఎలా అయినా అమ్మకి గుండెలో మంట తగ్గేలా చూడండి తండ్రీ!" అంటూ కన్నీళ్ళతో బాబాను వేడుకున్నాను. ఆ తరువాత అమ్మకు ఊదీ కలిపిన నీటిని త్రాగించాను. ఆశ్చర్యం! అద్భుతం! అమ్మకి ఊదీ నీళ్ళు త్రాగిన కొద్ది నిమిషాల్లో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు నేను పొందిన ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందంలోనే మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ సంఘటన ద్వారా బాబా ఊదీకి ఎంతటి మహిమ వుందో మనకి అర్థమవుతుంది. ఇంత అద్భుతమైన అనుభవాన్నిచ్చిన నా సాయినాథునికి పాదాభివందనాలు.

బిడ్డను ప్రసాదించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. నేను ఎల్లప్పుడూ సద్గురు సాయి దివ్యచరణాలను ఆశ్రయించుకుని ఉంటాను. నేను యుఎస్‌లోని చార్లెట్(charlotte)లో నివసిస్తున్నాను. నేనిక్కడ హెల్త్ ఔట్‌కమ్స్ రీసెర్చ్ ఫీల్డ్‌లో రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను. నా భార్య ప్రెగ్నెన్సీ విషయంలో మా దంపతులిద్దరము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఆ విషయంగా చాలామంది డాక్టర్లను సంప్రదించాం, అన్నిరకాల పద్ధతులను ప్రయత్నించాము. కానీ మా కోరిక నెరవేరలేదు. దాంతో ఇండియా వెళ్లి ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించాలని అనుకున్నాము. శిరిడీ, అక్కల్కోట, గాణ్గాపురం, జజూరీ, మహాబలేశ్వరం క్షేత్రాలను దర్శించాము. వాటిలో శిరిడీ సందర్శన ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుత అనుభవాన్ని ఇచ్చింది.
మేము క్యూలో నిలుచుని ఉన్నప్పుడు ఒక తోటి సాయిభక్తునితో పరిచయం అయింది. అతను దర్శనానికి వెళ్లడంలో మాకు చాలా సహాయం చేశారు. ఏ క్యూలో వెళితే 'సమాధికి దగ్గరగా వెళ్లే వీలుందో' మాకు చెప్పారు. అతను చెప్పినట్లుగానే మేము నడుచుకున్నాము. మేము సమాధికి దగ్గరగా చేరుకుని బాబాని ప్రార్థిస్తుండగా అక్కడున్న పూజారి బాబా సమాధిపై ఉన్న పువ్వులు, ప్రసాదాలను మాకిచ్చారు. బాబా ఆశీర్వాదాలు లభించాయన్న ఆనందంతో ఆ సాయిభక్తునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాము. మా అత్తగారు చాలా భక్తిప్రపత్తులు గల వ్యక్తి. మేము బాబాను ప్రార్థిస్తున్న సమయంలో తన మదిలో ఉయ్యాల ఊగుతున్న అనుభూతి చెందారు.
శిరిడీ నుంచి వచ్చిన కొన్నివారాల తరువాత ఒక గురువారంనాడు నా భార్య ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయింది. మా ఆనందానికి హద్దుల్లేవు. తక్కువ వ్యవధిలోనే బాబా మమ్మల్ని ఆశీర్వదించారు. తరువాత ప్రెగ్నెన్సీ సమయంలో నా భార్యకు థైరాయిడ్ సమస్య, గెస్టేషనల్ డయాబెటిస్, తీవ్రమైన వికారం, పాదాల నొప్పులు వంటి చాలా సమస్యలు ఎదురయ్యాయి. చివరికి ఉమ్మనీరు ప్రమాదకర స్థాయికి తగ్గిపోవడంతో బిడ్డ కదలికలు కూడా నా భార్యకు తెలియలేదు. అన్ని సమస్యలున్నప్పటికీ బాబా ఆశీస్సులతో కాలమంతా సక్రమంగా సాగింది. ఆ సమయమంతా నేను బాబాని ప్రార్థిస్తూ, 'ఓం సాయిరామ్' అని జపిస్తూ ఉండేవాడిని. చివరికి బాబా ఆశీస్సులతో మాకు పాప పుట్టింది. "థాంక్యూ సో మచ్ బాబా! నా తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్లని ఆశీర్వదించండి".
నేను సాయిసచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాను. సాయిసచ్చరిత్ర నిజ జీవిత అనుభవాలతో కూడుకున్నది. అది బాబాపట్ల మన విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. నేను ఈ మధ్యనే నవ గురువార వ్రతం కూడా చేసాను. తరచూ బ్లాగులో అనుభవాలు చదువుతూ ఉంటాను. అవి నాపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. తోటి సాయిభక్తులకు ఒకమాట చెప్పాలనుకుంటున్నాను. బాబా మనల్ని పరీక్షిస్తారు, కానీ ఎప్పుడూ మనకు అండగా ఉంటారు. కాబట్టి ఆయనను ప్రార్థిస్తూ, రాత్రిపగలు తలచుకుంటూ ఉండండి. ఏ పని చేస్తున్నా బాబాను తలచుకుంటూ ఉండండి. అలాచేస్తే సచ్చరిత్రలో చెప్పినట్టు మనం మంచి మార్గంలో ఉంటాం. ఎవరైనా మన వెనుక మన గురించి చెడుగా మాట్లాడినా, మనం మాత్రం చెడు మాట్లాడకూడదు. మనం శ్రద్ధ, సహనాలను కలిగి ఉంటే ఆయన సహాయం మనకు తప్పకుండా అందుతుంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
source: http://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2362.html