ఈరోజు భాగంలో అనుభవాలు:
- బాబా ఇచ్చిన అద్భుత అనుభవం
- మాకోసం ట్రైన్ ఆపిన సాయి
బాబా ఇచ్చిన అద్భుత అనుభవం
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:
బాబా ఇచ్చిన అనుభవాలను పంచుకునే అవకాశమిస్తున్న ఈ వెబ్‌సైట్ నిర్వాహకులకి చాలా చాలా ధన్యవాదాలు. ఈ వెబ్‌సైట్ బాబా పట్ల మా నమ్మకాన్ని మరింత పెంచుతుంది.
మొదటి అనుభవం:
మా ఆంటీగారు MRI స్కాన్ చేయించుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని రిపోర్టులలో తెలిసింది. నేను బాబాను ప్రార్థించి మళ్ళీ చెక్-అప్ కోసం వెళితే అద్భుతం జరిగింది. ఈసారి MRI రిపోర్ట్ అంతా బాగున్నట్లు వచ్చింది. "లవ్ యు సో మచ్ బాబా!"
మరో అనుభవం:
నా ఆనందాన్ని ఎలా తెలియజేయాలో తెలియడం లేదు. ఎందుకంటే ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఆఫీసు విషయంలో నా భర్తకు 24 రెవెన్యూ స్టాంపులు అవసరమయ్యాయి. కానీ ఆరోజు ఆదివారం అయినందువల్ల ఆయనకు తెరిచి ఉన్న షాపు ఏదీ కనిపించలేదు. స్టాంపులు అత్యవసరంగా కావాల్సి వుండటంతో ఏమి చేయాలో మాకు తెలియలేదు. ఆ స్థితిలో నేను హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించాను. కొద్దిసేపట్లో బాబా దీవెనలు ఒక అపరిచితుడి ద్వారా వచ్చాయి. వ్యక్తిగతంగా అతను మాకు తెలియదు. అతనిని కలవడం అదే మొదటిసారి. అతను మా సమస్యల గురించి అడిగితే, నేను స్టాంపుల సమస్య గురించి వివరించాను. హఠాత్తుగా అతను వెళ్ళిపోయి, కొద్దిసేపట్లో 24 రెవెన్యూ స్టాంపులతో తిరిగి వచ్చి, వాటిని మాకందించి వెళ్ళిపోయాడు. మేము నిజంగా ఆశ్చర్యపోయాము. "బాబా! అపరిచితుని రూపంలో మాకు సహాయం చేసింది మీరు మాత్రమేనని మాకు తెలుసు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు తెలియడం లేదు. ప్రతిరోజు మా జీవితంలో మీరు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు బాబా! దయచేసి ఎప్పుడూ ఇలాగే మాతో ఉంటూ మీ దీవెనలు మాపై కురిపించండి".

మాకోసం ట్రైన్ ఆపిన సాయి
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను నోయిడాలో నివాసముంటున్నాను. సాయి భక్తలోకంలో నేనొక చిన్న ధూళి కణాన్ని. "దేవా! నన్ను గట్టిగా పట్టుకోండి. ఈ జీవితసాగరంలోని ఒడిదుడుకుల నుండి నన్ను కాపాడండి. జీవితమనే ఈ చీకటిసంద్రంలో నాకు, మీ భక్తులకు మీరు దీపస్తంభం వంటివారు. లవ్ యు దేవా! జీవితంలోని ప్రతి చిన్న నిర్ణయంలో మీరు నాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రాపంచికమైన అన్ని విషయాలలో తోడుగా ఉంటూ సహాయపడుతున్నందుకు మీకు నా కృతజ్ఞతలు". ఇక నా అనుభవానికి వస్తే......
ఈమధ్యకాలంలో ఒకసారి మా తల్లిదండ్రులు మా కుటుంబంతోను, మా బ్రదర్ కుటుంబంతోను 15 రోజులు గడపటానికి వచ్చారు. వాళ్ళు తిరిగి వెళ్లాల్సిన రోజు మా బ్రదర్ మా ఇంటినుండి వాళ్ళని కారులో స్టేషన్‌కు తీసుకుని వెళ్ళి ట్రైన్ ఎక్కిస్తానని చెప్పాడు. తన ప్రణాళిక ప్రకారం తను 12.45 కి మా ఇంటికి రావాలని అనుకున్నాడు కానీ, ఆలస్యమై 1.10 కి మా ఇంటికి చేరుకున్నాడు. అయినా పర్వాలేదు, శనివారం కదా ట్రాఫిక్ అంతగా ఉండదని మేము అనుకున్నాము. బయలుదేరే చివరి నిమిషంలో నన్ను కూడా వాళ్లతో రమ్మన్నాడు మా బ్రదర్. అప్పటికి నేను సిద్ధంగా లేకపోయినా, మా తల్లిదండ్రుల సంతోషం కోసం నేను కూడా వాళ్లతో వెళ్ళాను. మేము ఊహించని విధంగా దారిలో చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంది. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ట్రాఫిక్ జామ్ చాలా ఉందని, వేరే ఇతర మార్గాల గుండా వెళితే స్టేషన్‌కి 2.12pm కి చేరుకోవచ్చని చూపించింది. బాబా కృపవలన మేము సరైన సమయానికి గూగుల్ చూసాము. లేకపోతే, ఆ మార్గాన్ని దాటిపోయి ఉండేవాళ్ళం. కానీ ఆ మార్గంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువగా ఉండటంతో మేము చేరుకోవాల్సిన సమయం (ETA - Estimated Time of Arrival) పెరుగుతూ పోతోంది. అది చూస్తే మా తల్లిదండ్రులు ఎక్కడ టెన్షన్ పడతారోనని, నేను వాళ్ళకి తెలియకుండా దాచాను. ఎందుకంటే ట్రైన్ బయలుదేరే సమయం 2.15pm. అది అక్కడినుండే బయలుదేరుతుంది, కాబట్టి ఎప్పుడూ ఆలస్యం ఉండదు. వెంటనే నేను, "దేవా! మాకు సహాయం చేయండి" అని బాబాని ప్రార్థించాను. మేము స్టేషన్ చేరుకునేసరికి గం. 2.16 నిమిషాలయ్యింది. మా బ్రదర్ పూర్తిగా ఆశ వదిలేసాడు. కానీ నేను చివరి నిమిషం వరకు ప్రయత్నిద్దామని అనుకున్నాను. ఏమి జరిగినా మన మంచికేనని నాకు బాబాపై పూర్తి విశ్వాసముంది. మేము కారు దిగేసరికి బాబా పంపినట్లు మేము ఏ ప్రయత్నం చేయకుండానే ఒక కూలీ వచ్చి మా సామానులు అందుకున్నాడు. తరువాత మేము ప్లాట్‌ఫాం మీద పరుగుతీసాము. మేము మెట్లు ఎక్కుతుండగా మా బ్రదర్, "ట్రైన్ ఆల్రెడీ కదిలింది, ఇంక పరిగెత్తాల్సిన అవసరంలేదు" అని చెప్పాడు. కానీ, నేను బాబా స్మరణ చేస్తూ నా పరుగు కొనసాగించి తరువాతి ప్లాట్‌ఫాం కోసం ఎస్కలేటర్ ఎక్కాను. నేను నా బాబా ఇష్టానికనుగుణంగా వెళ్తుంటే, మా వాళ్లంతా నన్ను అనుసరించారు. అంతలో ట్రైన్ ఆగడం మేము చూశాము. ఆశ్చర్యం! మేము ఎక్కాల్సిన బోగీ సరిగ్గా ఎస్కలేటర్‌కి ఎదురుగా ఉంది. మేము చకచకా ట్రైన్ ఎక్కి సామాను సర్ది, మా తల్లిదండ్రులను కూర్చోబెట్టి క్రిందకు దిగాము. ప్లాట్‌ఫాం మీద ఉన్న వాళ్ళు, "ఎవరో ట్రైన్ ఆపడం కోసం చైన్ లాగార"ని చెప్పారు. ఇంతలో ట్రైన్ కదిలింది. మా తల్లిదండ్రులను నిరాశపరచకుండా ట్రైన్ అపినందుకు బాబాకు హృదయపూర్వకం గా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "దేవా! మీకంటే ఎవరూ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేరు. మా అబ్బాయి కోపం తగ్గేలా చేసి శాంతపరిచినందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి తన ప్రవర్తన ఇంకా మెరుగుపడేలా చేయండి. మా అమ్మాయి యూరినేషన్ సమస్యను కూడా పరిష్కరించండి. ఆ విషయంలో నేను మీ ఆదేశాలు పాటిస్తున్నాను. దయచేసి మీ చిన్ని మనవరాలికి నయం చేయండి. మీకంటే గొప్ప వైద్యుడు నాకెవరూ తెలీదు. మీ ఆశీస్సులన్నింటికీ నా కోటి ప్రణామాలు".
ఓం శిరిడీవాసాయ విద్మహే సచ్చిదానందాయ ధీమహి
తన్నో సాయి ప్రచోదయాత్.
సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDelete