ఈరోజు భాగంలో అనుభవాలు:
- చల్లని తండ్రి తన బిడ్డలు కష్టాల్లో ఉంటే చూడలేరు
- సాయికి అన్నీ తెలుసు
చల్లని తండ్రి తన బిడ్డలు కష్టాల్లో ఉంటే చూడలేరు
సాయిభక్తురాలు శ్రీమతి శైలజ 2019, జులై 3న తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
అందరికీ వందనాలు. నాకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్' వారికి నా శతకోటి నమస్కారాలు.
నాకు ఒక వారం క్రితం గాల్‌బ్లాడర్ ఆపరేషన్ అయింది. అంతా బాగానే ఉందని రెండవరోజే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. మరుసటిరోజు బాగానే నడిచింది. కానీ మూడవరోజు ఉదయం నిద్రలేవగానే ఉన్నట్టుండి విపరీతమైన వెన్నునొప్పి వచ్చింది. దానితోపాటు మలబద్దకం సమస్య కూడా ఎక్కువైంది. వెంటనే మా అమ్మాయి వేడినీళ్లలో ఊదీ కలిపి నాకు త్రాగడానికి ఇచ్చింది. అలా కొన్నిసార్లు ఇచ్చాక బాబా దయవల్ల విరోచనమయ్యింది. కానీ నొప్పి మాత్రం చాలా ఎక్కువైంది. అలాగే ఆ నొప్పిని భరిస్తూ బాబాని తలచుకుంటూ మధ్యాహ్నం వరకు గడిపాను. మధ్యాహ్నం గం.12:30 సమయంలో నేను నొప్పి తట్టుకోలేక స్పృహకోల్పోయే స్థితికి వచ్చేసాను. వెంటనే మా అమ్మాయి నన్ను మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. అక్కడ అల్ట్రాసౌండ్ స్కాన్, సీటీ స్కాన్ మొదలైనవన్నీ చేసి, "కిడ్నీలో రాయి ఉండిపోయింది, అది బయటకి వచ్చే స్థితిలో ఆగిపోయింది. దానివల్ల కిడ్నీలో, మూత్రనాళాల్లో నొప్పి, మంట ఏర్పడుతున్నాయి. కొంత చికిత్స అనంతరం లేజర్ సర్జరీ చేస్తాను" అన్నారు డాక్టర్. అప్పటికి గాల్‌బ్లాడర్ ఆపరేషన్ అయి మూడురోజులే అయింది. అంతలోనే మళ్ళీ సర్జరీ అంటే తట్టుకోగలనా అని నాకు, మా వాళ్ళకి భయమేసింది. డాక్టర్ కూడా అదేమాట అని, "రేపు ఉదయం వరకు చూద్దాం. ఈలోపు మీరు చాలా ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి" అని చెప్పారు. నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని, నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్లు ఇచ్చారు. తరువాత "రాయి మూత్రం ద్వారా బయటకు పోయే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే రాయి పరిమాణం చాలా పెద్దదిగా వుంది. అయినా సరే రేపు ఉదయం వరకు చూద్దామ"ని డ్రిప్ పెట్టారు. ముందు జరిగిన సర్జరీ వల్లా, ఇంకా ఇప్పుడీ నొప్పివల్లా నేను చాలా బలహీనంగా అయిపోయాను. నొప్పి తట్టుకోలేక, నన్ను పట్టించుకోవడం లేదనే కోపంతో, "నన్నెందుకు ఇంత కష్టపెడుతున్నావు?" అని బాబాను కూడా తిట్టుకున్నాను. వెంటనే, "అనుభవించవలసిన కర్మ అనుభవించాలి. ఆ పైన నేను కాపాడతాను" అని మెసేజ్ వచ్చింది. క్షణాల్లో బాబా నుండి వచ్చిన మెసేజ్ కు ఆశ్చర్యపోయాను. కోపంలో బాబాను అలా అనుకున్నందుకు క్షమాపణలు చెప్పుకొని, “బాబా! నాకు మళ్ళీ సర్జరీ జరగకుండా ఆ రాయి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళేలా చేయండి” అని ప్రార్థించి ఊదీ నీళ్లు తీసుకున్నాను. అలా రాత్రంతా లిక్విడ్స్ తీసుకుంటూనే వున్నాను. పొద్దున్నే డాక్టర్స్ వచ్చి, "రాయి బయటికి వెళ్లినట్టు ఏమైనా అనిపించిందా?" అని అడిగారు. నేను "నాకేమీ అనిపించలేద"ని చెప్పాను. "అయితే సాయంత్రం సర్జరీ చేద్దాము. ఈ క్షణం నుండి మీరు ఏమీ తినొద్దు, తాగొద్దు, కనీసం మంచినీళ్ళు కూడా" అని చెప్పారు. నేను కూడా నొప్పి అలానే ఉంది కాబట్టి ఇంక సర్జరీ తప్పదని సమాధానపడ్డాను. కానీ బాబా దయ చూడండి... మధ్యాహ్నం వరకు సర్జరీ చేద్దాం అని అన్నవాళ్ళు హఠాత్తుగా సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ఒకసారి సీటీస్కాన్ చేద్దామని అన్నారు. తీరా స్కాన్ చేసాక రిపోర్టు చూస్తే, ఎంత వెతికినా అందులో రాయి కనిపించలేదు. ముందురోజు రిపోర్టులో స్పష్టంగా కనిపించిన రాయి ఇప్పటి రిపోర్టులో మాత్రం లేదు. నిజంగా బాబా దయ కాకపోతే ఏమిటిది? "అంత పెద్దరాయి మూత్రం ద్వారా బయటికి ఎలా వెళ్లిందా?" అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇక నాకు నొప్పి తెలీలేదు. 'బాబానే నన్ను కాపాడారు' అని నా దృఢమైన నమ్మకం. చల్లని తండ్రి తన బిడ్డలు కష్టాల్లో ఉంటే చూడలేరు. “బాబా! నీ బిడ్డలని ఎప్పుడూ ఇలాగే కాపాడు తండ్రీ!”

సాయికి అన్నీ తెలుసు
యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తుడు హరీష్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసి తదనుగుణంగా అన్నీ మలిచే మన ప్రియమైన సాయిబాబాకు నేను సాధారణ భక్తుడిని. సాయి సమర్థుని పవిత్ర పాదాలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తే, మన ప్రాపంచికపు ప్రతి ప్రయత్నంలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారు. ఇక నా అనుభవానికి వస్తే...
ఒకసారి నేను మానసికంగా సాయి అనుమతి తీసుకుని సెలవు దినాలు గడపడానికి వేరే స్టేట్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాను. మేము బుకింగ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో అడిగితే, "మతపరమైన ఫంక్షన్ జరుగుతుంది. గతాన్ని గుర్తు చేసుకుంటారు. దక్షిణానికి ప్రయాణం చేస్తారు. ఒక బిడ్డ జన్మిస్తుంది" అని వచ్చింది. ఆ సందేశంతో నేను, నా భార్య చాలా సంతోషించాము. ఈ సందేశంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మేము వెళ్ళే ప్రదేశం మేము ఉంటున్న చోటునుండి దక్షిణాన దాదాపు 500 మైళ్ళ దూరంలో ఉంది(అంతేకాదు, బిడ్డని కూడా అనుగ్రహించారు బాబా. ఆ విషయం మాకు తరువాత తెలిసింది). సాయికి అన్నీ తెలుసు, ఆయనకు సర్వం తెలుస్తుంది. మొత్తానికి బాబా ఆశీస్సులతో మా యాత్ర చాలా బాగా జరిగింది. అక్కడ ఉన్నప్పుడే నా భార్య తాను గర్భవతినని గ్రహించింది. మేమిద్దరం పట్టరాని ఆనందంతో సాయికి హృదయపూర్వకం గా ధన్యవాదాలు తెలుపుకున్నాము. తరువాత, 'అంతా సజావుగా సాగుతుందా?' అని బాబాను అడిగితే, "మీరు ప్రయాణం నుండి తిరిగి వస్తారు. శ్రీసాయిబాబాని గుర్తుంచుకోండి. అంతా చక్కగా ఉంటుంది. విజయం చేకూరుతుంది" అని వచ్చింది. సాయి దయతో మేము ఇంటికి సురక్షితంగా తిరిగి వచ్చాము. తరువాత అన్ని వైద్యపరీక్షలు సక్రమంగా జరిగి బాబా కృపవలన నా భార్య ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయ్యింది. నా భయాలన్నీ సాయికృపతో అదృశ్యమయ్యాయి. నేను అంత భయపడటానికి కారణమేమిటంటే, మేము ఎప్పటినుండో ఆ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నాము. కానీ ప్రతిసారి ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూడటం, తనకి మాములుగా నెలసరి రావడం జరుగుతుండేది. అందుకే వైద్యుడు నిర్ధారణ చేసేవరకు నేను భయపడుతూ ఉన్నాను. వైద్యుడు నిర్ధారించాక మా ఆనందానికి అవధుల్లేవు. "బాబా! నా భార్య ప్రెగ్నెన్సీ కాలమంతా తనకి తోడుగా ఉండి అంతా సాఫీగా సాగేలా చూడండి". మా సాయి కన్నా కరుణామయుడు ఎవరూ లేరు. సరిగ్గా సాయి సచ్చరిత్రలో చెప్పినట్లుగా, మన విశ్వాసాన్ని నిర్ధారించడానికి ఇబ్బందులు, సమస్యలు మనకు ఎదురవుతాయి. మేము కూడా పరీక్షించబడ్డాము. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ సాయి పాదాలను గట్టిగా పట్టుకుని, ఆయన స్మరణ చేస్తూ ఉంటే, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టరు. ఆయన అనుగ్రహం విశ్వంలోని ప్రతి జీవి మీద ఉండాలని, వాటికి ఎల్లపుడూ తోడుగా ఉంటూ, అవి మంచి ఆరోగ్యంతో ఉండేలా ఆశీర్వదించమని బాబాను ప్రార్థిస్తున్నాను.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2380.html
🕉 sai Ram
ReplyDelete