ఈరోజు భాగంలో అనుభవాలు:
- ఊదీతో చెవినొప్పి మాయం
- పునరావృతమైన సచ్చరిత్రలోని సాయిలీల
బెంగుళూరునుండి సాయిభక్తురాలు జయంతి దేశాయ్ తన అనుభావాలనిలా పంచుకుంటున్నారు:
సాయిరాం!
సాయిరాం! నా జీవితంలో జరిగిన బాబా లీలలను 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు' ద్వారా సాయిభక్తులతో పంచుకుంటూ, తద్వారా మరొకసారి ఆ అనుభూతులను మననం చేసుకోవడం నాకు చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈ అవకాశాన్ని నాకు ఒసగినవారికి నా ధన్యవాదాలు తెలుపుతూ....
ఊదీతో చెవినొప్పి మాయం
ఒక సాయిబంధువు అనుభవం చదివాక ఊదీ మహిమ వలన నాకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకోవాలనిపించింది. ఆ సాయినాథుని ప్రేరణతో నా అనుభవం మీతో పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది.
2018, నవంబరు నెలలో ఒకరోజు మధ్యరాత్రిలో దాహం వేసి మంచినీళ్లు త్రాగడానికి లేచాను. నీళ్ళు త్రాగుతుండగా ఎవరో ముందుకు తోసినట్లు కొంచెం దూరం ముందుకు పోయాను. నిద్రమత్తులో ఉన్న నేను ఏదోలే అనుకుని మళ్ళీ వెళ్లి నిద్రపోయాను. ఉదయం నిద్రలేచేసరికి తల తిరుగుతున్నట్లుగా అనిపించి నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను. పైకి లేస్తే ఏ పొజిషన్‌లో వెనక్కి పడిపోతానో నాకే తెలియదన్నట్లుంది నా పరిస్థితి. డాక్టరును సంప్రదిస్తే, "న్యూరో ప్రాబ్లెమ్ అయివుండొచ్చు. MRI, బ్రెయిన్ స్కానింగ్ మొదలైన చాలారకాల పరీక్షలు చేయాలి" అన్నారు. సాయిభక్తురాలినైన నా నోటివెంట ఏ పరీక్ష జరుగుతున్నా సాయి నామస్మరణ తప్ప ఇతర ఏ ఆలోచనా లేదు. రిపోర్టులు వచ్చాక పెద్ద డాక్టరుని కలవాల్సిన సమయం రానే వచ్చింది. ఆ సమయమంతా బాబా స్మరణ నా మదిలో జరుగుతూనే వుంది. డాక్టరు రిపోర్టులన్నీ చూసి, "న్యూరో ప్రాబ్లెమ్ కాదు. చెవి లోపల సమస్య ఉంది" అని చెప్పి, నెలకు సరిపడా మందులు వ్రాసిచ్చి వాడమని చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు నెలరోజుల పాటు చాలా బాధపడ్డాను. చివరికి బాబా దయవలన ఆరోగ్యం కుదుటపడింది.
మళ్ళీ రెండువారాల క్రితం రెండు చెవుల లోపలి భాగం చాలా నొప్పిగాను, లాగుతున్నట్లుగా ఉండి, భరింపరాని బాధగా ఉండేది. 4, 5 రోజుల్లో తగ్గుముఖం పడుతుందిలే అని నిర్లక్ష్యం చేశాను. తరువాత అది తీవ్రమైన ప్రభావం చూపడంతో ఒకరోజు ఉదయాన్నే ఇ.ఎన్.టి. డాక్టరుకు ఫోన్ చేస్తే, 10:30 కి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. త్వరత్వరగా దీపారాధన చేసి, సచ్చరిత్ర పారాయణ ముగించుకుని హాస్పిటల్‌కు వెళదామని అనుకున్నాను. దీపారాధన చేసి, పారాయణ చేయడానికి సిద్ధపడుతుండగా నా మనస్సులో ఎవరో చెప్తున్నట్లు, "ఎందుకు తొందరపడతావు? చెవి లోపల, బయట ఊదీ రాయి. మూడురోజుల తర్వాత కూడా బాధ అలానే వుంటే డాక్టరు వద్దకు వెళ్ళు" అని అనిపించింది. సర్వహృదయాంతర్యామి అయిన బాబాయే అలా చెప్తున్నారని, నేను ఆయన చెప్పినట్లుగా ఊదీ వైద్యం చేసుకున్నాను. మూడు రోజులు పూర్తయ్యేసరికి ఎలాంటి నొప్పీ కనబడలేదు. ఇప్పుడు చెవినొప్పి లేకపోయినా ప్రతినిత్యం ఊదీ రాయడం మాత్రం మానుకోలేక పోతున్నాను. నా జీవితంలో ఇలా బాబా ఇచ్చిన అనుభవాలెన్నో ఉన్నాయి. అంతా సాయిమయం.

పునరావృతమైన సచ్చరిత్రలోని సాయిలీల
సాయిసచ్చరిత్ర 13వ అధ్యాయంలో నీళ్ళ విరోచనములతో బాధపడుతున్న కాకామహాజని చేత వేరుశెనగపప్పు తినిపించి బాబా అతన్ని అనుగ్రహించిన విధంగా నన్ను కూడా అనుగ్రహించారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
పద్దెనిమిది సంవత్సరాల క్రితం చికున్ గున్యా వ్యాధినుండి కోలుకుంటున్న సమయంలో నాకు హఠాత్తుగా ఒకరోజు నీళ్ళ విరేచనాలు మొదలయ్యాయి. ఇంటి సభ్యులు వారి విధినిర్వహణకు వెళ్ళినందువలన మందులు తెచ్చివ్వడానికి ఎవరూ అందుబాటులో లేరు. మందులు తెచ్చుకోవడానికి నేను స్వయంగా వెళ్ళలేని పరిస్థితిలో ఉదయం నుండి సాయంత్రం వరకు బాబా నామస్మరణ చేసుకుంటూ, "నాకు మందులు తెచ్చి పెట్టేవారు ఎవరూ లేరు. ఎవరి ద్వారానైనా నాకు మందులు పంపండి బాబా" అని వేడుకున్నాను. ఇంట్లో ఇలా ఉన్న నా పరిస్థితి మా వారికి తెలియదు. అప్పట్లో ఇంటికి ఒక్కటే సెల్ ఫోను, అదికూడా ఇంటి యజమాని వద్ద మాత్రమే ఉండేది. ఇక ఇప్పుడు అసలు బాబా లీల చూడండి....
మావారు ఇంటికి వస్తూ బెంగళూరు బేకరీలో ఫేమస్ అయిన 'కాంగ్రెస్'(కారం మసాల వేరుశనగ విత్తనాలు) తెచ్చారు. నా పరిస్థితిని తెలుసుకుని, "నీ ఆరోగ్యానికిది మంచిది కాదు, నువ్వు తినకు" అన్నారు. నేను, "ఎవరి ద్వారానైనా మందులు పంపమని బాబాను వేడుకున్నాను, ఆయన మీ ద్వారా ఇవి పంపారు. కాబట్టి నేను వీటిని తీసుకుంటాను" అని అన్నాను. తరువాత సాయి నామాన్ని తలచుకుంటూ, "ఆనాడు కాకామహాజనికి వేరుశెనగపప్పు ఔషధంగా పనిచేసి విరోచనాలు తగ్గినట్లే, ఇప్పుడు నాకూ నయం కావాలి" అని దాన్ని తిన్నాను. కాసేపటికల్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను పడుతున్న కష్టాన్ని, బాధను బాబా ఇట్టే తీసేసారు.
అంతా సాయిమయం.

Om Sai ram today is my daughter's birthday.please bless her with long life.be with her.om saima
ReplyDeleteమీ పాపకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సాయి. తనకి బాబా ఆశీస్సులు సదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. తనకి దీర్ఘాయువు, మంచి విద్యాబుద్దులు, మంచి జీవితాన్ని బాబా ప్రసాదించాలని కోరుకుంటూ....
ReplyDeleteసాయి మహారాజ్ సన్నిధి టీమ్.
🕉 sai Ram
ReplyDelete