సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 80వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • సాక్షాత్తూ శ్రీసాయిబాబానే వచ్చి రక్షించారు.

సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు జ్యోతి, మాది తాడిపత్రి. నాకు 3 సంవత్సరాల వయస్సునుండి బాబానే నా దైవం. వేరే ఏ దైవం నాకు తెలియదు. అంతగా చిన్నప్పటినుండి బాబా నా మనస్సులో స్థిరపడిపోయారు. బాబా లేకపోతే నేను లేను. పూర్వం దైవం మన ప్రార్థన వినాలంటే, మనమెంతో తపస్సు చేయాలని విన్నాను. కానీ సాయిబాబా పిలిచిన పలికే దైవం. ఇంతకన్నా ఆయనను పొగడటానికి నాకు శక్తి చాలదు. ఇటీవలే మీతో ఒక అనుభవాన్ని పంచుకున్నాను. ఇప్పుడు సుమారు పాతికేళ్లక్రితం బాబా నన్ను కాపాడిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఆనాడు ఆయన నన్ను కాపాడకపోయుంటే ఈనాడు నేను అనేదాని అడ్రస్ ఉండేది కాదు. ఇంత గొప్ప అనుభవాన్ని మీతో పంచుకునే అవకాశం కూడా ఉండేది కాదు.

నాకు 14 సంవత్సరాల వయస్సున్నప్పుడు 1994వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారి మరణంతో ఆర్థికంగా మా కుటుంబ పరిస్థితి బాగాలేకుండాపోయింది. అందువలన నా మేనమామ 1995వ సంవత్సరంలో మా అమ్మతో, "అమ్మాయికి 10వ తరగతి పూర్తయింది కదా! నాకు తెలిసిన ఒక లేడీ లాయర్ ఉన్నారు. ఆమెకు తెలిసినవారు మద్రాసులోని సాలిగ్రామంలో 'స్త్రీ సేవా సదన్' నడుపుతున్నారు. నీకు సమ్మతమైతే అక్కడ చేర్పిద్దాం" అని అన్నారు. అమ్మ, "మనం బ్రాహ్మణులం, సేవా సదన్ నడుపుతున్న వాళ్ళు కూడా బ్రాహ్మణులే కాబట్టి వాతావరణంలో మార్పు ఉండద"ని బాగా అలోచించి, కుటుంబ పరిస్థితి దృష్ట్యా నన్ను అక్కడ చేర్చడానికి ఒప్పుకున్నారు. ఇక నేను మా మేనమామతో ప్రయాణమయ్యాను. మా మామయ్య ఉండేది నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి. అక్కడికి వెళ్ళాక మామయ్య నన్ను ఆ లాయర్ దగ్గరకు తీసుకుని వెళ్లి, నా విషయం చెప్పి సేవా సదన్ వారికి సిఫారసు చేయమని చెప్పారు. ఆమె, "అమ్మాయి బాగా హుషారుగానే ఉంది కాబట్టి, ఏమీ ఫరవాలేదు, తనక్కడ సర్దుకుంటుంది. నేను వాళ్ళకి చెప్తాను, మీరు రెండురోజుల తర్వాత వెళ్లి అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి రండి" అని చెప్పింది. అదే సమయంలో టీచరైన మామయ్యకు 10వ తరగతి పరీక్ష పేపర్లు దిద్దే డ్యూటీ వేసారు. అందువలన ఆయన, "నేను నీకు తోడుగా నా స్నేహితుడు రమణయ్యను పంపుతాను. ఆయన నిన్నక్కడ చేర్చి వస్తాడు. నేను తరవాత వస్తాను" అని చెప్పారు. ఆరోజు గురువారం. నేను, మామయ్య కూతురు వెంకటగిరిలోని బాబా గుడికి వెళ్ళాము. బాబా దర్శనం చేసుకున్నాక బాబా విభూది కొంచెం తెచ్చుకున్నాను. ఇంటికొచ్చాక మా అత్తయ్య నాకొక చిన్న బాబా ఫోటో ఇచ్చింది. నేను ఆ ఫోటో, విభూది నా బట్టల మధ్య సర్దిపెట్టుకున్నాను. తరువాత మామయ్య తన స్నేహితుని చేతికి మా ఖర్చుల నిమిత్తం కొంత డబ్బిచ్చి మమ్మల్ని తెల్లవారుఝామున 4 గంటల బస్సు ఎక్కించారు.

వెంకటగిరినుండి మద్రాసుకు 5 గంటల ప్రయాణం. మేము సరిగ్గా 9 గంటలకు మద్రాసులో దిగి, సిటీ బస్టాండుకు వెళ్లి నిలుచున్నాము. అక్కడ కాషాయవస్త్రాలు, విభూతి ధరించి ఉన్న ఒకాయన నిలబడి ఉన్నారు. ఆయన నన్ను చూసి చిరునవ్వు నవ్వారు కానీ, నేను పట్టించుకోలేదు. రమణయ్యగారు ఆయనని సాలిగ్రామం వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుందని తమిళంలో అడుగుతున్నంతలో బస్సు వచ్చింది. వెంటనే సీటు కావాలన్న ఆరాటంతో నేను బస్సెక్కి కూర్చున్నాను. అది ఉదయం 9 గంటల సమయం కావడంతో కాలేజీలకు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్లంతా ఒకరినొకరు తోసుకుంటూ బస్సు ఎక్కేశారు. చిన్నదాన్నైన నేను మద్రాసు సిటీ చూడాలన్న సరదాలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ ఉన్నాను. ఒక గంట ప్రయాణమయ్యేసరికి ప్రయాణీకులు ఎవరి స్టేజీలో వాళ్ళు దిగిపోవడంతో బస్సులో జనాలు తక్కువయ్యారు. అప్పుడు నాకు రమణయ్యగారు గుర్తుకువచ్చి,  అతనెక్కడ కూర్చున్నారా అని బస్సు అంతా చూసాను. రమణయ్యగారు ఎక్కడా కనపడలేదు. దాంతో ఒక్కసారిగా బిత్తరపోయాను. భయంతో ఒకటే గుండెదడ. నాకేమో తమిళం రాదు, ఇప్పటిలా అప్పట్లో ఫోన్లు లేవు, అడ్రస్ తెలియదు, డబ్బులు లేవు, ఏ స్టేజీలో దిగాలో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో నాకెవరూ గుర్తుకురాలేదు. బాబా మాత్రమే గుర్తుకువచ్చారు. "బాబా! ఇప్పుడెలా? నేను ఎక్కడ దిగాలో, ఏమి చేయాలో తెలియదు. నువ్వు నా దగ్గరకు రా!" అనుకుంటూ వెనుకకు తిరిగి చూసాను. వెనుక సీటులో ఒక ప్రక్కగా బస్టాండులో కనిపించిన కాషాయవస్త్రాలు ధరించిన ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన నన్ను చూసి మళ్ళీ అదే చిరునవ్వు నవ్వాడు. కానీ నేను ఆయనను లెక్కచేయలేదు. నా ముందు ఒకతను కూర్చుని ఉన్నాడు. అతను చూడటానికి చాలా మొరటుగా, కర్కశంగా వున్నాడు. నేను అతనిని పిలిచి తెలుగులో నా విషయమంతా వివరించాను. నేను చెప్పినదంతా విని, నేను భయపడేటట్లు మాట్లాడాడు. అతనలా మాట్లాడినా నాకు ఆ సమయంలో బాధ కలగలేదు. ఎందుకంటే, అతనొక్కడే తెలుగు మాట్లాడుతున్నాడన్న సంతోషం. నేను అతనితో, "నన్ను సాలిగ్రామం చేర్చండి" అని ప్రాధేయపడ్డాను. చివరికతను, "సరే, దిగు" అన్నాడు. నేను వెనుకాముందు ఏమీ ఆలోచించుకోకుండా వెంటనే అతనితో బస్సు దిగేసాను. అతను, "ఏమైనా తిన్నావా?" అని నన్ను అడిగాడు. నేను, 'ఏమీ తినలేద'ని చెప్పాను. అతను, "సరే, కాఫీ తాగుదువు, రా" అని రోడ్డు ప్రక్కన కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. షాపతను రెండు స్టీల్ గ్లాసులలో కాఫీ ఇచ్చాడు. అతను తాగుతున్నాడు, నేను కూడా కాఫీ తాగుదామని నోటివరకు పెట్టుకుంటూ, హఠాత్తుగా ఎవరో చెప్పినట్టు అటుగా వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ని చూసాను. వెంటనే కాఫీ, నా సామాను అక్కడే వదిలి ఆ పోలీసు వద్దకు పరుగున వెళ్లి అతనితో నా విషయం చెప్పడానికి ప్రయత్నించాను. కానీ అతనికి తెలుగురాదు, నాకు తమిళం రాదు. అయినా అతను అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నంతలో మా ముందు ఒక పోలీసు జీపు వచ్చి ఆగింది. దానిలోనుండి ఐదుగురు పోలీసులు, వారితోపాటు కాషాయవస్త్రాల స్వామి దిగారు. పోలీసులను చూసి భయం, స్వామిని చూసి కోపం వచ్చాయి. నాలో నేను, "ఏమిటితను? ఆశ్చర్యంగా ఉందే! నాముందే బస్సు వెళ్లిపోయింది. మళ్ళీ ఇంతలోనే పోలీసులను తీసుకుని వచ్చాడు. ఇంతకీ ఏమి గొడవ చేద్దామని వాళ్ళని పిలుచుకొచ్చాడు? ఏమిటి బాబా ఇలా అవుతోంది? నేను ఏం చెయ్యాలి?" అని అనుకున్నాను. భయంగా ఉన్నాగానీ, బాబా తప్పకుండా వస్తారని ధైర్యం తెచ్చుకున్నాను. అంతలోనే నేను ముందు సహాయం అడిగిన మొరటుమనిషిని రోడ్డుమీదే పోలీసులు కొడుతున్నారు. నాకేమీ అర్థం కాలేదు. అతనిని జీపులో పడేసి, "నువ్వు కూడా ఎక్కు" అన్నారు. ఇంక నా పరిస్థితి చూడాలి. అసలే పోలీసులంటే భయం, పైగా 'నావాళ్లు అని చెప్పుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు' అని మనసులో ఆందోళన. అయినప్పటికీ మనసునిండా బాబా వస్తారనే నిబ్బరంతో జీపు ఎక్కాను. పోలీసులు ఆ స్వామిని కూడా జీపు ఎక్కమన్నారు. ఆయన నా ప్రక్కనే కూర్చున్నారు. ఆయన స్పర్శ నాకు తగులుతూ ఉంది. మా కాళ్ళవద్ద ఆ మొరటుమనిషిని పడేసారు.

కాసేపట్లో అక్కడి టూ టౌన్ పోలీసుస్టేషన్‌కి తీసుకెళ్లారు. అప్పుడు సమయం 10.30 అయ్యింది. మొరటుమనిషిని లోపలికెక్కడికో తీసుకుని వెళ్లారు. నన్ను ఒక కుర్చీలో కూర్చోమన్నారు. తరువాత స్వామికొక కుర్చీ ఇచ్చి కూర్చోమన్నారు. ఆయన నా ప్రక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు. నన్ను తమిళంలో ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. స్వామి వాళ్ళతో ఏదో మాట్లాడి, నాతో, "చూడమ్మా! వాళ్ళు తెలుగు తెలిసినవాళ్ళని పిలుస్తారు. నువ్వు వాళ్ళకి నీ సమస్య చెప్పు" అన్నారు. అప్పుడు నా మనస్సు కాస్త ప్రశాంతం అయింది. 10 నిముషాల తరువాత నీలం చొక్కా, బ్లాక్ ప్యాంట్ వేసుకున్న ఒకతను కొంచెం కుంకుమ, ఆకులో ఏదో ప్రసాదం పట్టుకుని ముందు నా దగ్గరకే వచ్చి, "ఈ అయ్యప్పస్వామి ప్రసాదం, కుంకుమ తీసుకో!" అన్నారు. నేను అంతకుముందెప్పుడూ అయ్యప్ప ప్రసాదం తినలేదు. కొంచెం కుంకుమ, ప్రసాదం తీసుకున్నాను. తరువాత అక్కడున్న స్టాఫ్ అంతా తీసుకున్నారు. తరువాత ఒక కానిస్టేబుల్ నా పెట్టె తనిఖీ చేసి దానిలో ఉన్న బాబా ఫోటో, ఊదీ చూసి నమస్కరించుకుని, 'ఇందులో ఏమీ లేవు' అని చెప్పాడు. తరువాత నన్ను ప్రశ్నించారు. నేను అన్ని వివరాలు చెప్పాను. కానీ వాళ్ళు నన్ను ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నారు. కాసేపటికే ప్రక్కనే ఉన్న స్వామి హఠాత్తుగా ఇంగ్లీషులో మాట్లాడుతూ వారిపై పోట్లాటకు దిగారు. "అమ్మాయి చెబుతోంది కదా! ఇంకా ఎందుకు ఒత్తిడి చేసి ప్రశ్నిస్తున్నారు? మీకు మాత్రమే కాదు, డిపార్ట్‌మెంట్ గురించి నాకూ తెలుసు" అని ఏవేవో గట్టిగా అరచి టేబుల్ పై ఉన్న పేపర్ తీసుకుని, దానిపై ఏదో వ్రాసి విసిరేశారు. ఎంతో శాంతంగా ఉండే స్వామి కోపాన్ని చూసి వాళ్లంతా భయపడిపోయి, "స్వామీ! క్షమించండి" అంటూ బ్రతిమిలాడారు. అప్పుడు స్వామి, "ముందు మీరు వెంకటగిరి పోలీసుస్టేషన్‌కు ఫోన్ చేసి ఆమె చెప్పిన అడ్రెస్ ఉందో లేదో అడగండి" అని చెప్పారు. వాళ్ళు అలాగే చేసి, వివరాలు తెలుసుకుని, "మేము అమ్మాయిని బస్సు ఎక్కిస్తాము స్వామీ!" అని చెప్పారు. అప్పుడు స్వామి శాంతించారు. తరువాత అక్కడున్న పోలీసులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని, వాళ్లలో ఒకతను, "స్వామీ! మీ పేరు ఏమిటి?" అని అడిగారు. ఆయన ఏదో చెప్పారు కానీ, వాళ్లకు అర్థంకాక మళ్ళీ అడిగారు. స్వామి మళ్ళీ చెప్పారు. తరువాత స్వామి అక్కడే ఉన్న పూలచెట్ల వద్దకు వెళ్లి చూస్తూ నిలబడ్డారు. స్వామి పేరు అడిగినతను నా వద్దకు వచ్చి, "స్వామి పేరు చెప్పారు కదా, నీకేమైనా అర్థమైందా?" అని అడిగాడు. నేను 'అర్థంకాలేద'ని చెప్పాను. అక్కడున్న వాళ్ళందరూ, "మాకు కూడా వినపడలేదు, మళ్ళీ అడిగితే ఏం బాగుంటుందని అడగలేదు" అన్నారు. అసలు విషయమేమిటంటే, ఆయన తన పేరు చెబుతున్నప్పుడు ఆయన పెదాల కదలిక మాత్రమే అందరికీ కనిపించింది. మాటలేమీ బయటకు వినపడలేదు. అంతలో స్వామి ఉన్నవైపుకి చూస్తే స్వామి కనిపించలేదు. చుట్టుప్రక్కలంతా చూసారు, కానీ స్వామి ఎక్కడా కనిపించలేదు.

అప్పుడు 12.45కి పోలీసులు నన్ను ఆంధ్రా బస్టాండుకు తీసుకెళ్లి, టిక్కెట్, వడలు కొనిచ్చి, డ్రైవర్‌కి, కండక్టర్‌కి చెప్పి వెంకటగిరి పంపించారు. సాయంత్రం 6 గంటలకి నేను ఊరు చేరుకుని, నడుచుకుంటూ ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. మామయ్య  తలుపు తీసి, "ఏమిటి అప్పుడే వచ్చేసావు? ఏమి జరిగింది?" అని కంగారుగా అడిగారు. నేను తొందర తొందరగా ఏదేదో చెప్పాను. ఆయన, "ముందు మొహం కడుక్కో" అని నాతో చెప్పి, అత్తతో, "పాపకు ముందు అన్నం పెట్టు, ఉదయంనుండి ఏమీ తిని ఉండదు" అని చెప్పారు. తరువాత జరిగినదంతా విని, "చూడమ్మా! మనకు తెలిసిన మన ఊరిలోనే ఏదయినా సమస్య వస్తే ఎవరూ పట్టించుకోరు. అందువలన నేను దృఢంగా చెప్పగలను, నిన్ను సాక్షాత్తూ శ్రీసాయిబాబానే వచ్చి రక్షించారు. లేకపోతే ఇంకెవరు వస్తారు? నిన్ను సిటీ బస్సులో కండక్టర్ టిక్కెట్ అడగలేదు. అడిగివుంటే నీ దగ్గర డబ్బుల్లేవు. అంటే బాబానే నీ వెనక సీటులో ఉండి, నీ టిక్కెట్ తీసుకున్నారు. తరువాత నువ్వు ఆ మొరటుమనిషితో బస్సు దిగినంతనే బస్సు వెళ్ళింది అంటున్నావు. మరి అలాంటప్పుడు స్వామి ఎప్పుడు బస్సు దిగి, ఎప్పుడు పోలీసులను పిలుచుకుని వచ్చినట్లు? నువ్వు కనీసం కాఫీ కూడా త్రాగలేదు, అంతలోనే ఆయన జీపులోనుండి దిగడము, స్టేషన్లో నీ ప్రక్కనే కూర్చుని నీకు సపోర్టు చేసి మాట్లాడడం ఇవన్నీ సామాన్యమైన విషయాలు కాదు. సాక్షాత్తూ బాబానే వచ్చారు. ఆయనకు మాత్రమే అదంతా సాధ్యం" అని అన్నారు. అప్పుడు బాబానే నన్ను రక్షించారని నాకర్థమై, "అయ్యో! స్వయంగా బాబా వచ్చినా, ప్రక్కనే కూర్చున్నా నేను గుర్తించలేకపోయాను. ఆయన నన్ను కాపాడారు, లేకపోతే నేను ఏమైపోయేదాన్ని?" అని అనుకున్నాను. ఇంకో విషయం, ఆ మొరటుమనిషి చాలారోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఒక క్రిమినల్ అని, అందుకే అతన్నలా కొట్టారని స్టేషన్లో ప్రసాదమిచ్చిన అతను చెప్పారు.

మరుసటిరోజు రమణయ్య వచ్చి, "ఏమ్మా! నువ్వు తొందరగా బస్సు ఎక్కేసావు. నన్ను అందరూ క్రిందకు తోసేశారు. నేను నిన్ను పేరుపెట్టి పిలిచాను, కానీ నీకు వినపడలేదు. తరువాత సాలిగ్రామం వెళ్ళావేమో అని అక్కడకు వెళ్లి విచారించాను. నువ్వు ఏమయ్యావో, నా మొహం మీ మామకు ఎలా చూపించాలో తెలియక, నేరుగా తిరుపతి వెళ్లి నీ గురించి స్వామికి మ్రొక్కుకుని వస్తున్నాను. దేవుడి దయవల్ల నువ్వు క్షేమంగా ఇంటికి చేరుకున్నావు" అన్నారు. తరువాత లాయరుగారు వచ్చి, "జరిగిందేదో జరిగింది. దీనివల్ల ఈమె దైవభక్తి ఎంత అనేది తెలిసింది. మేమే పిల్లను తీసుకుని వెళతాం" అన్నారు. అందుకు మా మామయ్య, "ఈమె అక్కడకు వెళ్లడం బాబాకు ఇష్టం లేనట్లుంది, అందుకే మాకు కూడా ఇష్టం లేదు" అని చెప్పి, మా అమ్మ దగ్గరికి పంపించేశారు. తరువాత కొన్నిరోజులకి తమిళనాడు పోలీసులు నన్ను ఫోనులో పలకరించి, "ఆనాడు బాబానే వచ్చార"ని నమ్మకంగా చెప్పారు. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అద్భుతమైన బాబా లీల ఇది. ఈ గొప్ప అనుభవాన్ని 24 సంవత్సరాల తరువాత 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు' ద్వారా అందరితో పంచుకునే అవకాశాన్ని బాబానే కల్పించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" త్వరలోనే మరో అనుభవం పంచుకుంటాను. 

10 comments:

  1. Marvellous
    Miracle...Baba is Guru Samrat...
    Om Sai ❤️

    ReplyDelete
  2. Kallaninda Neelu vatchesaye amma chala chala Anandam kaligindhi...
    Sai Baba Leela telipinanduku Thanks.. om Sai Ram..🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Chala Adrushtavanthuralandi Meeru.
    Antha chinna vayssulone anthagoppa swanubhavam sontham chesukunnaru Babavaaritho. Intha Goppa Adrushtam enthamandiki dakkutundi. Nijanga *SAMARTHA SAINATHUDU PILISTHE PALUKUTHADU ANEDANIKI INTHAKANTE NIDARSANAM INKEKKADA UNTUNDI*
    Jai Sri Sairam Jai Jai Sri Sairam .

    ReplyDelete
  4. Ur really great ma ...baba is there...

    ReplyDelete
  5. Om Sai how to write experience in telugu.please inform me.i want to write Sai Leela's.

    ReplyDelete
    Replies
    1. 1. https://youtu.be/Tq3BY-vaF3c
      పైన ఇవ్వబడిన yutube లింక్ చూస్తే మీకు మొబైల్ లో ఎలా చేయాలో మీకు ఐడియా వస్తుంది.
      2. ఒకవేళ అలా చేయడం మీకు కుదరకపోతే, చక్కగా పేపర్ మీద వ్రాసి, దాన్ని ఫోటో తీసి నా whatsapp నెంబర్ 7842156057కి గాని మెయిల్ ఐడి saimaharajsannidhi@gmail.com కి గాని పంపవచ్చు సాయి.

      3. అలా కూడా కుదరకపోతే ఇంగ్లీష్ లో వ్రాసి పంపిన మేము translate చేస్తాం సాయి.

      Delete
  6. Om sairam. Ilanti anubavalani chaduvuthunte Inka Inka baba payina Prema perigipothondi. Sai lelalu adbhutham anantham. Avi anubhavinchina varike arthamavuthundi. Andaru Sai tatvani telusukoni ayana premanu pondali. Anduku ilanti margam Chala bagundi. Thanks for you and this website. Om Sai ram . Omsai Sri Sai Jaya Sai.

    ReplyDelete
  7. I have been surfing online more than 3 hours as of late, yet I by no means found any interesting article like yours.
    It is pretty worth sufficient for me. In my opinion, if all website owners and bloggers made good content as you probably did, the internet will likely be a lot more helpful than ever before.

    It’s the best time to make some plans for the future and it’s time to be happy.

    I’ve read this post and if I could I want to suggest you few interesting things or suggestions.
    Maybe you can write next articles referring to this article.

    I desire to read more things about it! I could not refrain from commenting.
    Very well written! http://pepsi.net

    ReplyDelete
  8. Om Sairam ,
    Pls do something sai
    i am helpless. please sai , please sai, please sai
    Om sai sri sai jaya jaya sai sadguru sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo