సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 28వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 28వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 44

బాబాసాహెబ్ తర్కడ్  ఒకసారి శిరిడీకి వెళ్ళినప్పుడు శ్రీ సద్గురు సాయిబాబా, బాబాసాహెబ్‌‌ను వాడాలో జరుగుతున్న పారాయణను శ్రవణం చేయడానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. ఆరోజు పారాయణలోని విషయం “ధృవాఖ్యానం.” ఆ పారాయణలో పరమేశ్వరుని యొక్క నిర్గుణనిరాకారస్వరూపాన్ని గురించిన వర్ణన ఉంది. బాబాసాహెబ్ పారాయణను పూర్తి చేసిన తరువాత బాబా వద్దకు వెళ్ళి “బాబా నన్ను ఒకటిన్నర సంవత్సరం తరువాత తీసుకువచ్చారు. నన్ను మీ చరణాల వద్దనే ఉండనివ్వండి” అని అడిగాడు. అప్పుడు బాబా “నేను నీ దగ్గరే ఉన్నాను” అని అన్నారు.

అనుభవం - 45

ఠాణే జిల్లాలోని బేలాపూర్ వద్ద తుర్భేగావ్‌లో శాంతాబాయీ అనే స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమె ఎడమచేతి వేళ్ళ మీద ఒక వ్రణం లేచింది. ఆ వ్రణం లేచి ఏడు సంవత్సరాలైంది. తరువాత ఒక రోజు రాత్రి బాబా తనకు స్వప్నంలో కనిపించి "డికామలి  (ఒక ఘాటైన వాసన గల లేహ్యం) వ్రణంపై రాయి” అని చెప్పారు. వెంటనే మెలకువ వచ్చి ఆమె లేచి కూర్చొంది. ఆమెకు ఎంతో ఆనందం వేయసాగింది. బాబా చెప్పిన విధంగా డికామలి వ్రాయడంతో ఆ వ్రణం తగ్గిపోయింది. జరిగిన విషయమంతా చెపుతూ ఉత్తరం వ్రాసింది. ఆ ఉత్తరం పై తారీకు సెప్టెంబర్ 1, 1918 అని ఉంది.

అనుభవం - 46

శిరిడీలో రామ్‌‌లాల్  అనే పేరు కలిగిన పంజాబీ బ్రాహ్మణుడు ఉండేవాడు. తాను ముంబాయిలో ఉండగా తనకు స్వప్నంలో బాబా కనిపించి “నా దగ్గరకు రా" అని అన్నారు. తాను ఎన్నడూ బాబాను దర్శించుకోలేదు. తాను కనీసం బాబా ఫోటోను కూడా చూడలేదు. అప్పుడు స్వప్నంలో కనిపించినది ఎవరో తాను గుర్తించలేకపోయాడు. మరుసటిరోజు దారిలో వెళుతూ ఉండగా తాను ఒక దుకాణంలో బాబా యొక్క ఫోటో కనిపించింది. అప్పుడు తనకు ఆ దుకాణదారుడిని “ఆ ఫోటోలో ఎవరు? ఆయన ఎక్కడ ఉంటారు?” అని అడిగాడు. దుకాణదారుడు మొత్తం వివరమంతా చెప్పాడు. అప్పుడు రామ్‌‌లాల్ శిరిడీకి వెళ్ళి బాబా సమాధి చెందేంతవరకు శిరిడీలోనే ఉన్నాడు.

అనుభవం - 47

నారాయణ్ గోపీనాథ్ దిఘే అనే పేరు కలిగిన గృహస్థు ముంబాయిలో నివసించేవారు. తనకు కడుపులో ఒక వ్రణం లేచింది. అది ఎంతో గట్టిగా ఉండి, దాని వలన తనకు ఎంతో బాధ కలుగసాగింది. ముంబాయిలో ఒకరిద్దరు సుప్రసిద్ధ వెద్యులకు చూపించడం జరిగింది. కానీ ఏమాత్రం ఉపయోగం కనిపించలేదు. తరువాత తనను శ్రీ సాయిబాబా దర్శనానికి వెళ్ళమని ఒక గృహస్థు సూచించాడు. కానీ తానున్న స్థితిలో వెళ్ళడం సాధ్యం కాదు. అప్పుడు తాను "బాబా యొక్క ఆశీర్వాదం వలన ఆ వ్రణం పగిలిపోయి, అందులోనున్న జబ్బంతా మలద్వారం ద్వారా బయటకు వెళ్ళితే నాకు ఉపశమనం కలుగుతుంది. అప్పుడు నేను బాబా వద్దకు వెళ్ళగలుగుతాను” అని చెప్పాడు. దాంతో ఆ గృహస్థు తనకు బాబా యొక్క ఊదీని ఇచ్చారు. ఆ ఊదీని నారాయణ్ సేవించడంతో మరుసటి రోజు ఉదయం ఆ వ్రణం పగిలిపోయి చీము మొత్తం మలద్వారం ద్వారా బయటకు వెళ్ళ సాగింది. రెండు మూడు రోజులకు తనకు ఉపశమనంగా అనిపించసాగింది. తరువాత తొందరలోనే తాను బాబా దర్శనానికి వెళ్ళాడు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo