ఈరోజు భాగంలో అనుభవాలు:
- ఐదు నిమిషాల్లో తీవ్రమైన నొప్పినుండి ఊదీతో ఉపశమనం
- బాబా లీలలు చిత్రవిచిత్రాలు
ఐదు నిమిషాల్లో తీవ్రమైన నొప్పినుండి ఊదీతో ఉపశమనం
సాయిబంధువు హరిణిగారు నిన్న తనకి జరిగిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
2019, జూన్ 16 ఉదయాన హఠాత్తుగా నాకు కడుపునొప్పి (నాభి ప్రాంతంలో) వచ్చింది. లోపల మెలిపెడుతున్నట్లు ఒకటే తీవ్రమైన నొప్పి. నా అంతట నేను లేచి నడవలేకపోయాను, కూర్చోలేకపోయాను. మంచం మీద నుండి క్రిందకి దిగడానికి మావారిని సహాయం అడిగాను. ఆయన సహాయంతో లేచి అలమరాలో ఉన్న బాబా ఊదీ తీసుకుని, కొద్దిగా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి, మరికొంత నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకున్నాను. తరువాత సచ్చరిత్ర పుస్తకాన్ని నా కడుపుమీద పెట్టుకున్నాను. అద్భుతం! ఐదు నిమిషాల్లో నొప్పి ఉపశమించింది. నేను పొందిన అనుభూతిని పదాలలో వివరించలేకపోతున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా!"
సాయిబంధువు హరిణిగారు నిన్న తనకి జరిగిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
2019, జూన్ 16 ఉదయాన హఠాత్తుగా నాకు కడుపునొప్పి (నాభి ప్రాంతంలో) వచ్చింది. లోపల మెలిపెడుతున్నట్లు ఒకటే తీవ్రమైన నొప్పి. నా అంతట నేను లేచి నడవలేకపోయాను, కూర్చోలేకపోయాను. మంచం మీద నుండి క్రిందకి దిగడానికి మావారిని సహాయం అడిగాను. ఆయన సహాయంతో లేచి అలమరాలో ఉన్న బాబా ఊదీ తీసుకుని, కొద్దిగా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి, మరికొంత నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకున్నాను. తరువాత సచ్చరిత్ర పుస్తకాన్ని నా కడుపుమీద పెట్టుకున్నాను. అద్భుతం! ఐదు నిమిషాల్లో నొప్పి ఉపశమించింది. నేను పొందిన అనుభూతిని పదాలలో వివరించలేకపోతున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా!"
బాబా లీలలు చిత్రవిచిత్రాలు
బెంగళూరునుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ ఓం సాయిరామ్! అనుభవాలు పంచుకుంటున్న తోటి సాయిభక్తులందరికీ నా ధన్యవాదములు. వాటి ద్వారా మా భక్తి విశ్వాసాలు దృఢపడటంతోపాటు మా సహనం, బాబాపట్ల సుస్థిరమైన నమ్మకం, మానసికధైర్యం కూడా చేకూరుతున్నాయి. "బాబా! మీ బిడ్డలందరికీ సదా ఆశీస్సులు అందజేయండి. మీరిచ్చిన అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి". ఇక నా అనుభవానికి వస్తే...
ఒకరోజు రాత్రి నాకో దుస్వప్నం వచ్చింది. ఆ కారణంగా భయపడుతూ నిద్రలేస్తూనే సాయి నామాన్ని తలచుకున్నాను. మరుక్షణంలో సచ్చరిత్రలోని ఒక భక్తుని అనుభవం నా మనసులో మెదిలింది. ఆ భక్తునికి చెడు స్వప్నాల వలన చాలాకాలంగా నిద్రపట్టని సమస్య ఉంటుంది. అతడు బాబా పటాన్ని తను పడుకునే చోట గోడకు తగిలించుకుని, ఊదీ ప్యాకెట్ తలక్రింద పెట్టుకుని నిద్రపోతాడు. బాబా ఆశీస్సులతో అప్పటినుండి ఆ చెడు స్వప్నాలు రావడం ఆగిపోయి అతను ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. వెంటనే నేను నా మంచం ప్రక్కనే ఉన్న టేబుల్ నుండి ఒక ఊదీ ప్యాకెట్ తీసి, నా నుదుటిపై కొంచెం ఊదీ పెట్టుకున్న తరువాత ఆ ప్యాకెట్టును తలగడ క్రింద పెట్టుకున్నాను. "బాబా! నేను ప్రశాంతంగా నిద్రపోయేలా చూడండి" అని చెప్పుకుని మళ్లీ నిద్రపోయాను. తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను.
ఉదయం నిద్రలేస్తూనే తలగడ క్రింద ఉన్న ఊదీ ప్యాకెట్టు తీసి టేబుల్ పైన పెడదాం, అక్కడైతే సురక్షితంగా ఉంటుందని అనుకున్నాను. తీరా తలగడ ఎత్తి చూస్తే అక్కడ ఊదీ ప్యాకెట్టు లేదు. మొత్తం మంచమంతా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. పరుపు ఎత్తి చూశాను. మంచం క్రింద, తలగడ కవర్స్ లోపల కూడా చూశాను. కానీ, ఎక్కడా కనిపించలేదు. బాత్రూంకి వెళ్లేటప్పుడు పొరపాటున పట్టుకుని వెళ్ళానేమో, అక్కడ పడిపోయిందేమోనని అక్కడా వెతికాను. చివరికి అది పెట్టడానికి ఆస్కారమున్న ప్రతిచోటా వెతికాను, కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. తర్వాత పూజగది వైపు నా దృష్టి మళ్ళింది. అక్కడ కూడా కొన్ని ఊదీ ప్యాకెట్లు ఉన్నాయి. అందులో ఏమైనా పెట్టి మర్చిపోయానేమోనని అక్కడ కూడా వెతికాను. అక్కడా లేదు. నేను ఎక్కడికీ తీసుకుని వెళ్లలేదని నాకు తెలుసు, అయినప్పటికీ ఇంట్లో అంతా వెతికాను. కానీ ఎక్కడా కనిపించలేదు. బాధతో, "బాబా! ఊదీ దొరికేలా నాకు సహాయం చేయండి. మీరు ఎంతోమంది భక్తులకు ఊదీతో రక్షణనిచ్చారు. మరి నా ఊదీ ఎక్కడ? మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు. ఊదీని నాకు తిరిగిచ్చి నన్ను ఆశీర్వదించండి" అని ప్రార్థించాను.
ఆరోజు రాత్రి నిద్రపోయేముందు పూజగదిలో ఉన్న మరో ఊదీ ప్యాకెట్ తెచ్చి నా నుదుటిపై కొద్దిగా ఊదీ పెట్టుకుని, ప్యాకెట్టుని ప్రక్కనే ఉన్న టేబుల్ పై పెట్టాను. అక్కడ ఉన్నా కూడా దాని ప్రభావం నాపై ఉంటుందని నా ఉద్దేశ్యం. తర్వాత గాఢనిద్రలో ఉన్నప్పుడు నాకొక ప్రశాంతమైన, అందమైన ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో నేను మగతనిద్రలో ఊదీ ప్యాకెట్టుని తలచుకుని సాయినామం తలచుకుంటూ నా చేతుల్ని తలగడ క్రింద పెట్టాను. అద్భుతం! ఊదీ ప్యాకెట్టు నా చేతికి తగిలింది. నేను ఆశ్చర్యంతో ఊదీ ప్యాకెట్టుని గట్టిగా పట్టుకుని నిద్రలేచాను. పడుకునేముందు టేబుల్ పైన పెట్టిన ఊదీ ప్యాకెట్టే నా చేతిలో ఉందేమోనని అనుమానంతో టేబుల్ వైపు చూశాను. ఆ ఊదీ ప్యాకెట్టు నేను పెట్టిన చోట అలాగే ఉంది. ముందురోజు రాత్రి తలగడ క్రింద పెట్టిన ఊదీ ప్యాకెట్టు తెల్లవారితే లేదు, అదిప్పుడు అకస్మాత్తుగా నా తలగడ క్రింద చేరి, నా చేతిలో చిక్కింది. ఎంత అద్భుతమైన అనుభవం! "థాంక్యూ సో మచ్ బాబా! ఇంత అద్భుతమైన అనుభవాన్నిచ్చి నన్ను ఆశీర్వదించారు" అని బాబాతో చెప్పుకుని మళ్ళీ నిద్రపోయాను. తెల్లవారి నిద్రలేచాక ఆలోచిస్తే, అంతా ఆశ్చర్యంగా అనిపించింది. అది కలా! నిజమా! ఎంత అద్భుతం! అనుకుని మళ్లీ ఒకసారి తలగడ క్రింద చూశాను. ఆశ్చర్యం! ఊదీ ప్యాకెట్టు అక్కడే ఉంది. బాబా ఎప్పుడూ తన బిడ్డల ప్రార్థనలు వింటూ వారిని తప్పక ఆశీర్వదిస్తారు. ఒక్కోసారి కొంతసమయం పట్టినట్టు ఉంటుంది కానీ, అది ఆయన లీలను అనుభూతి చెందడానికే! ఈ అనుభవం నాకు కలిగాక ముందుగా తోటి సాయిబంధువులతో పంచుకోవాలని నా మనసుకు తోచింది. "బాబా! మా అందరినీ ఆశీర్వదించండి".
No comments:
Post a Comment