సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 41వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 41వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 69 

గోవిందరావు గద్రే  అనే పేరు కలిగిన గృహస్థు నాగపూర్లో ఉండేవారు. ఒకటిన్నర సంవత్సరం వయసు కలిగిన తన మేనల్లుడు తీవ్ర అనారోగ్యానికి  గురయ్యాడు. అప్పుడు గోవిందరావు “పిల్లవానికి బాగయినట్లైతే, నేను తనను తీసుకొని దర్శనానికి  వస్తాను” అని బాబాకు మొక్కుకున్నాడు. బాబా ఆ మొక్కును మన్నించారు. మరుసటిరోజునుండే పిల్లవాని ఆరోగ్యం కుదుటపడుతూ, తొందరలోనే తాను పూర్తిగా కోలుకున్నాడు. ఆ తరువాత గోవిందరావు సోదరి కొన్ని రోజులు నాగపూర్లో ఉండి తరువాత అత్తగారింటికి వెళ్ళింది. అంటే వెంట పిల్లవాడు కూడా వెళ్ళాడు. అందువలన మొక్కు తీర్చడం అలాగే ఉండిపోయింది. తరువాత ఒక సంవత్సరానికి తన సోదరి మరలా నాగపూర్ కి తన వద్దకు వచ్చింది. అప్పుడు గోవిందరావు అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్నో ఔషధోపచారాలు చేసినా తాను స్వస్థుడుకాలేదు. ఇంతలో గురువారం రావడంతో అందరూ బాబా భజన చేయమని చెప్పారు. భజన జరుగుతుండగా గోవిందరావుకి తన మొక్కు విషయం జ్ఞప్తికి వచ్చింది. అప్పుడు గోవిందరావు “ఆరోగ్యం కుదుటపడితే. వెనువెంటనే దర్శనానికి వస్తాను” అని ప్రార్థించాడు. ఆ విధంగానే ఒకటి, రెండు రోజులలో ఆరోగ్యవంతుడై బాబా దర్శనానికి వెళ్ళాడు.

అనుభవం - 70

పార్లేకి చెందిన కృష్ణాజీ పంత్ ఉరఫ్ అగ్లాసాహెబ్ ఆగోశే మరియు అంధేరికి చెందిన గోవిందరావు ఓక్(సర్వేయర్) ఇద్దరూ కలిసి బాబా దర్శనానికై శిరిడీ వెళ్ళారు. అక్కడ రెండుమూడు రోజులుండి తిరిగి వచ్చారు. వచ్చేటప్పుడు ఇద్దరూ రెండు బాబా ఫోటోలను తీసుకొని, ఆ రెండింటిని ఒకే పార్శిల్ చేసారు. బండిలో కూర్చొన్నాక “మనం ఇంకొక ఫోటో తీసుకొని ఉంటే బాగుండేది, ఆ ఫోటోను కొంకణ్ లోని సోదరునికి పంపించేవాళ్ళం” అని గోవిందరావుకి అనిపించింది. ఇంటికి వచ్చాక పార్శిల్ విప్పి చూస్తే అందులో రెండు ఫోటోలకు బదులు మూడు ఫోటోలు ఉన్నాయి. “మనం రెండు ఫోటోలను తీసుకుంటే, మూడవది ఎక్కడ నుండి వచ్చింది" అని వారికి ఆశ్చర్యం వేసింది. అంతా బాబా లీల అనే విశ్వాసం వారికి కలిగి, ఆ లీలను సంతోషంగా స్మరించుకోసాగారు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo