ఈరోజు భాగంలో అనుభవాలు:
- ఊదీ లీల
- బాబా ఆశీస్సులు - సంతాన భాగ్యం; పనిలో విజయం
ఊదీ లీల
ఓం శ్రీ సాయిరామ్! నా పేరు వల్లి. మా నివాసం విశాఖపట్నం. నేను చాలాకాలంనుంచి సాయినాథుని భక్తురాలిని. కొంతకాలంక్రితం జరిగిన ఒక చిన్న అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో మా పాపకి బాగా తలనొప్పి వచ్చింది. నొప్పి భరించలేక తను చాలా ఏడ్చింది. నేను, మావారు పాప తలమీద నూనె రాసి మర్దన చేసి, తలమీద నొక్కుతూ ఉన్నాం. కానీ నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను సాయినాథుని తలచుకుని ఊదీ పాప నుదుటన పెట్టి, నోటిలో కొంచెం వేసాను. అద్భుతం! తలనొప్పి వెంటనే తగ్గిపోయింది. తరువాత తను ప్రశాంతంగా నిద్రపోయింది. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు".
ఓం శ్రీ సాయిరామ్! నా పేరు వల్లి. మా నివాసం విశాఖపట్నం. నేను చాలాకాలంనుంచి సాయినాథుని భక్తురాలిని. కొంతకాలంక్రితం జరిగిన ఒక చిన్న అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో మా పాపకి బాగా తలనొప్పి వచ్చింది. నొప్పి భరించలేక తను చాలా ఏడ్చింది. నేను, మావారు పాప తలమీద నూనె రాసి మర్దన చేసి, తలమీద నొక్కుతూ ఉన్నాం. కానీ నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను సాయినాథుని తలచుకుని ఊదీ పాప నుదుటన పెట్టి, నోటిలో కొంచెం వేసాను. అద్భుతం! తలనొప్పి వెంటనే తగ్గిపోయింది. తరువాత తను ప్రశాంతంగా నిద్రపోయింది. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు".
బాబా ఆశీస్సులు - సంతాన భాగ్యం; పనిలో విజయం
హైదరాబాదునుండి సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
బాబా సచ్చరిత్రలో వాగ్దానం చేసినట్లు నేనెప్పుడూ ఒంటరిని అన్న భావన రాకుండా చూసుకుంటున్నారు. నా జీవితంలో ప్రతిక్షణం ఆయన నాతో ఉన్నారని అనుభూతి చెందుతూ ఉన్నాను. ఇక నా అనుభవాలు చెప్పాలంటే...
సంతాన భాగ్యం:
నాకు పెళ్ళైన ఐదేళ్లవరకు సంతానం కలగలేదు. ఎన్నో హాస్పిటల్స్‌కి వెళ్ళాము. ఎందరో డాక్టర్లను సంప్రదించాము. వాళ్ళిచ్చే రకరకాల మందులు వాడాము. కానీ ఏ ప్రయోజనం లేదు. చివరికి నేను 'నవ గురువార వ్రతం' చేశాక బాబా పెద్ద అద్భుతాన్ని చూపించారు. ఆయన కృపతో ivf ప్రక్రియ ద్వారా నేను గర్భవతినయ్యాను. కానీ, ఎక్కడ అబార్షన్ అయిపోతుందోనని ఏదో తెలియని భయంవలన నేను చాలా ఆందోళనపడ్డాను. అటువంటి సమయంలో నాకొక కల వచ్చింది. కలలో నేను పొరపాటున నాకు ఏమాత్రం తెలియని ఒక బస్టాపులో బస్సు దిగాను. అక్కడ కొంతమంది లాల్చీ, పైజామా వేసుకుని ఉన్న ఒక వ్యక్తిని చూపించి, "ఆయన శిరిడీ సాయిబాబా" అని చెప్పారు. నేను ఆయనను చూస్తూనే 'ఆయన సాయిబాబానేనా!?' అనుకున్నాను. ఆ సమయంలో ఆయన ఇద్దరు ఆడపిల్లలతో ఆడుకుంటున్నారు. ఆ పిల్లలు ఒంగుంటే ఆయన వాళ్ళపైనుండి దూకుతున్నారు. అక్కడున్నవారంతా ఆ పిల్లలకి ఏదైనా హాని జరుగుతుందేమోనని ఆందోళనపడుతున్నారు. నేను కూడా అలాగే ఆందోళనపడ్డాను. కానీ అలా ఏమీ జరగలేదు. వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. హఠాత్తుగా ఆయన నాకు దగ్గరగా వచ్చి, ఆయన ముఖాన్ని నా ముఖానికి దగ్గరగా పెట్టి, "చూసావా! ఏమీ జరగలేదు కదా!" అని మాయమైపోయారు. నిద్రలేచాక నేనా కల గుర్తుచేసుకుని, అబార్షన్ అవుతుందేమోనని నేను భయపడుతున్నట్లుగా ఏమీ జరగదని బాబా అభయమిచ్చారని అర్థమై ఎంతో ఉపశమనం పొందాను. ఆయన భరోసా ఇచ్చినట్లుగానే, ఆయన ఆశీర్వాద ప్రసాదంగా మాకు చక్కటి పాప పుట్టింది. "థాంక్యూ సో మచ్ బాబా!"
ప్రాజెక్ట్ అవకాశం - దాని విజయం:
బాబా నాకు జీవితంలో ప్రతిక్షణం సహాయపడుతున్నారు. ఇటీవల నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఒకానొక సమయంలో నేను ఆఫీసులో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులుపడ్డాను. అటువంటి సమయంలో బాబా ఆశీస్సులతో నమ్మశక్యం కాని విధంగా ప్రాజెక్ట్ నడిపించే అవకాశం నాకు వచ్చింది. మూడు నెలల ఆ ప్రాజెక్ట్ కాలంలో నా సుపీరియర్ ఒకరు నన్ను నిరుత్సాహపరుస్తూ ఉండేవారు. దానితో నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. అయితే బాబా ఆశీస్సులతో నేను ఒడిదుడుకులన్నీ దాటుకుని ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తిచేయగలిగాను. హఠాత్తుగా ఒకరోజు నేను ఫీడ్‌బ్యాక్ ఏమీ అడగకుండానే మా క్లయింట్, "మీ కంపెనీతో పనిచేయడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది, మరిన్ని భాగస్వామ్య వ్యవహారాలు మీతో చేసుకోవాలని అనుకుంటున్నాం" అని మెయిల్ పెట్టారు. అందుకు మేనేజర్ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మెయిల్ పెట్టారు. అంతేకాదు, టీమ్ మీటింగులో అందరిముందు నన్ను మెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ తరువాత కూడా క్లయింట్ టెస్టింగ్‌లో ఏమైనా సమస్యలు వస్తాయేమో, దానితో క్లయింట్ ఫండ్స్ విడుదల చేయరేమో అనే అనుమానంతో ఆందోళనపడ్డాను. కానీ అద్భుతంగా టెస్టింగ్‌లో ఒక్క సమస్య కూడా బయటపడలేదు. అంతేకాదు, అప్లికేషన్ ప్రొడక్షన్ లోకి వెళ్లకముందే బకాయిలన్నీ సెటిల్ చేశారు. అక్కడితో బాబా ఆశీస్సులతో నా బాధ్యత పూర్తయింది. "థాంక్యూ బాబా!"
నాకెప్పుడైనా ఒంటరిగా అనిపించినా, దేనిగురించైనా భయపడి సహాయాన్ని అర్థించినా బాబా తన అద్భుతాలతో నన్ను ఆశ్చర్యపరుస్తారు. ఎప్పుడైనా నేను రోడ్డుమీద ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే, వెంటనే ఆయన కారో, బస్సో ఏదో ఒక దానిపైన ఫోటో రూపంలో దర్శనమిస్తారు. ఆయన ఎన్నోసార్లు, "దిగులుపడకు బిడ్డా! నేను నీకోసం ఎల్లప్పుడూ ఉన్నాను. నేనెప్పుడూ నిన్ను పతనం కానివ్వను" అని భరోసా ఇస్తున్నారు. "ప్లీజ్ బాబా! నేనెప్పుడూ మీ పాదాలను విడిచిపెట్టకుండా చూసుకోండి".
🕉 సాయిరామ్
ReplyDelete