కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 30వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
ఆ వివరాలు రేపటి భాగంలో
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

అనుభవం -51
శ్రీ వాసుదేవ్ సీతారాం రాతాంజన్ కర్, హైదరాబాద్ నివాసి, ఇంటి నెంబర్, 163, శ్రీ హరిసీతారాం దీక్షిత్ కు 18-8-1921 వ రోజు వ్రాసిన ఉత్తరంలోని సారాంశం!
ప్రప్రథమంగా శ్రీ సాయిబాబా పేరు మరియు మహత్యం గురించి శ్రీ కుశాభావు (శ్రీ కృష్ణనాథ్ బువా మిరిజ్ గావ్ కర్ జోషి) గారి ద్వారా 1908 సంవత్సరంలో తెలిసింది. అందరూ శ్రీ కుశాభావును చాల చోట్లకు పూజ చేయడానికై ఇంటికి పిలిచి, ఎంతో గౌరవం వ్యక్తపరచసాగారు. ఆ విధమైన క్రమం ఊరిలో చాలారోజులు జరిగింది. ఆయన ఒకరోజు శ్రీ సీతారాంజీ ఘటే గారి ఇంట్లో పూజ చేశారు. అది మా మేనమామ గారి ఇల్లు కావడం వలన అక్కడికి వెళ్ళి పూజాకార్యక్రమాలను చూసే భాగ్యం నాకు కలిగింది. ఆయన ఇచ్చిన తీర్థ ప్రసాదాలతో చాల మందికి ఆరోగ్యం చేకూరింది అనే చర్చ జరుగుతోంది. దాంతో సహజంగానే “శ్రీ సాయిమహారాజ్ తమ దివ్య చరణాలను మన ఇంట్లో పెట్టాలి (అంటే ఆయన శిష్యునిది), పూజచేయాలి” వగైరా వంటి ఆలోచనలు మనసులో రాగానే, వెంటనే మహారాజ్ (శ్రీ కుశాభావు) నవ్వుతూ స్ఫూర్తిదాయకంగా “నేను రేపు మీ ఇంటికి రావాలి” అని అన్నారు. ఆ మాటలు వినగానే మనసుకు సమాధానంగా అనిపించింది. మరుసటి రోజు ఆయన పూజా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి? అని ఆలోచనలో మునిగిపోయి ఇంటికి వెళ్ళాను. ఇంట్లో వారందరికి విషయం చెప్పాను. అందరికీ సంతోషం కలిగింది. మరుసటి రోజు తెల్లవారుతుండగా మా తల్లిగారు శ్రీ గంగాబాయికి ఒక స్వప్నం వచ్చింది. ఒక కాషాయంబరధారియైన మరియు కమండలం వంటివి కలిగిన మహాత్ముడు నేరుగా ఇంట్లోకి వచ్చారు. ఆయనకు ఆసనం ఇచ్చి కూర్చోబెట్టడానికి తల్లిగారు ఆసనాన్ని ముందుకు జరిపారు. ఆ ఆసనంపై ఆ మహాత్ముడు నిలుచున్నారు. మా తల్లిగారు ఆయన చరణాలపై తమ శిరస్సును ఉంచారు. ఇంతలో ఆమెకు మెలకువ వచ్చింది. వెంటనే ఆమె తన స్వప్నాన్ని అందరికీ చెప్పింది. కానీ ఎవరూ ఆ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. సరి! అదేరోజు మరలా పూజా కార్యక్రమాలను చూడటానికి మేనమామ ఇంటికి వెళ్ళాను. అక్కడ పూజ పూర్తవగానే మహారాజ్ (కుశాభావు) తీర్థ ప్రసాదాలు పంచే సమయంలో అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చేటప్పుడు నా వంతు వచ్చింది. నేను తీర్థప్రసాదాలు తీసుకొని లేచేటప్పుడు పూజలోనున్న శ్రీ సాయిమహారాజ్ ఫోటోను ఒక్కసారిగా తీసి నా చేతికి ఇచ్చారు. “ఫొటోకు ప్రతిరోజు మనఃపూర్వకంగా పూజ చేసుకో” అని చెప్పి, సెలవు తీసుకునేందుకు - అనుమతి ప్రసాదించారు. ఆ ఫోటోను తీసుకొని ఇంటికి వచ్చిన తరువాత మా తల్లి గారికి ఉదయం వచ్చిన స్వప్నం యొక్క అంతరార్థం అర్థమై అందరికీ చాల సంతోషం కలిగింది. తరువాత మరలా శ్రీ కుశాభావుని భోజనానికి ఆహ్వానించి ఆయనకు పూజాసత్కారాలు చేసుకున్నాము. ఆ విధంగా శ్రీ సాయినాథుని గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ తరువాత చాలమంది శిరిడీకి వెళ్ళి వచ్చి వారికి కలిగిన అనుభవాలను చెపుతూ ఉండేవారు. అలాగే మనం కూడా ఒకసారి శ్రీ సద్గురు సాయిబాబాను దర్శించుకొని, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకోవాలనే భావన కలుగసాగింది. నాకు 2-3 సంవత్సరాలు అటువంటి భాగ్యం కలుగలేదు. తరువాత 1912వ సంవత్సరంలో ముంబాయికి వెళ్ళినప్పుడు శిరిడీ వెళ్ళే సందర్భం ఊహించని విధంగా వచ్చింది. అదెలాగంటే, శ్రీ శివదాస్ ధాటే గారు ఉదయాన్నే కోపర్గాంకు ఒక టికెట్లు (ఆయనకు సంబంధించిన వారిదెవరిదో ప్రయాణం రద్దవడం వలన) నాకు ఇచ్చారు. దానిని శ్రీ సాయిబాబా పంపించిన ఆహ్వానపత్రికగా భావించి, అదేరోజు సాయంకాలం బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. ఆ విధంగానే బయలుదేరాను. శ్రీ సాయి మహారాజ్ ను దర్శించుకున్న తరువాత అక్కడ ఎన్నో అనుభవాలు వచ్చాయి. ఆ తరువాత ఆయనపై పద్యాలు వ్రాయాలని అనిపించడంతో ఒక పద్యమాలను తయారుచేసాను. ఆ తరువాత ఒక పెద్ద చమత్కాలిక సంఘటన జరిగి గొప్ప అనుభవం వచ్చింది. నిజంగానే ఆ అనుభవం అపూర్వమైనది. ఆ మొత్తం సంఘటనంతా ఎంతో విస్తారమైనది, అయినప్పటికీ సంక్షిప్తంగా వివరిస్తాను.

Way cool! Some extremely valid points! I appreciate you penning this write-up and the rest
ReplyDeleteof the website is also really good. I’ve been browsing online more than 3 hours these days, yet
I by no means found any fascinating article like yours. It’s lovely price sufficient for me.
Personally, if all website owners and bloggers made good content material as you did, the net will probably be much
more helpful than ever before. Ahaa, its nice dialogue concerning this piece
of writing at this place at this website, I have read all that, so now me also commenting
at this place. http://starbucks.com/
🕉 sai Ram
ReplyDelete