సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 69వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా వేసిన ముద్ర
  2. మనం ఆశించిన దానికంటే ఎక్కువే ఇస్తారు బాబా

బాబా వేసిన ముద్ర

ఓం శ్రీ సాయినాథాయ నమః

సాయిభక్తులకు ప్రణామములు. నా పేరు మోదడుగు వాసు. మా నివాసం నెల్లూరు. పదిహేను రోజుల క్రితం బాబా నాకొక మంచి అనుభవాన్నిచ్చారు. అది సాయిభక్తులందరితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ బ్లాగువారికి పంపుతున్నాను.

ప్రతి ఆదివారం బాబా గుడిలో జరిగే సత్సంగానికి వెళ్లడం నాకు అలవాటు. ఆ అలవాటు ప్రకారం 2019 మే 19న రాత్రి 8 గంటల సమయంలో బాబా గుడికి వెళ్ళాను. ఆరోజు సత్సంగంలో ధ్యానం గురించి చర్చకు వచ్చింది. ధ్యానం గురించి తెలుసుకున్నాక ఇంటికి వచ్చి రాత్రి నిద్రపోయాను. తెల్లవారుఝామున నిద్రలేచి నా ఎడమచేయి చూసుకుని ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే ఎడమచేతి మధ్యభాగంలో స్వస్తిక్ గుర్తు, దాని చుట్టూ రౌండ్ అప్ చేసి ఒక రబ్బర్ స్టాంపు ముద్ర వేసినట్లుగా ఉంది. కలా లేక నిజమా అని ముద్రపై గట్టిగా రుద్ది చూశాను. ముద్ర ఏ మాత్రం చెరిగిపోలేదు. నాకు కాస్త భయంగా అనిపించింది. తరువాత నేను కొంతమంది సాయిభక్తులకు నా చేయి చూపిస్తే, అది శుభసూచకమని, మా కుటుంబాన్ని బాబా ఆశీర్వదించారని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించి మనసారా బాబాకు నమస్కరించుకున్నాను. బాబాను మనం ఆర్తితో పిలిస్తే, ఆయన పలుకుతారు. ఆయన మన వెన్నంటే ఉంటూ మనలను కంటికి రెప్పలా రక్షిస్తూ ఉంటారు.


ఓంసాయి శ్రీసాయి  జయజయసాయి.

మనం ఆశించిన దానికంటే ఎక్కువే ఇస్తారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబాకి అంకిత భక్తుడిని. ఆయన నాకేది మంచిదో అది అందిస్తూ ఉన్నారు. నేను ఈమధ్యనే నా కాలేజీ చదువు పూర్తిచేశాను. అతితక్కువ కాలంలోనే నాకొక పెద్ద mnc సంస్థలో ఉద్యోగం వచ్చింది. అయితే ప్రాజెక్టులోకి తీసుకునే ముందు కంపెనీ వాళ్ళు కొన్ని అస్సెస్‌మెంట్స్(చిన్న చిన్న కోడింగ్ తో కూడుకున్న వర్క్) ఇస్తారు. వాటిని బాగా చేయగలిగితేనే ప్రాజెక్టులోకి తీసుకుంటారు. అంటే ఒక విధమైన నిర్ధారణ పరీక్ష వంటిది. అందులో కనీసం 70% స్కోర్ చేయవలసి వుండటంతో నేను చాలా భయపడ్డాను. కానీ బాబా కృపవలన చాలా సులువైన మంచి డొమైన్ పై పనిచేసే అవకాశం వచ్చింది. దాంతో నేను చాలా తేలికగా ఆ పరీక్షను అధిగమించాను.

తరువాత ఒక మంగళవారంనాడు నా స్నేహితులందరికీ ప్రాజెక్ట్ టీమ్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. వాళ్లంతా బుధవారం రిపోర్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళకి వచ్చి నాకు రాకపోవడంతో నేను చాలా బాధపడ్డాను. మరుసటిరోజు నేను ఆఫీసుకి వెళ్లి 'సాయి సచ్చరిత్ర' చదువుకుంటుండగా హఠాత్తుగా ప్రాజెక్ట్ టీమ్ నుండి కాల్ వచ్చింది. వాళ్ళు నన్ను మరుసటిరోజు రిపోర్ట్ చేయాలని చెప్పారు. మరుసటిరోజు అంటే గురువారం, మన సాయిబాబా రోజు. నాకెంతో ఆనందంగా అనిపించింది. అయితే నా స్నేహితులందరికీ అదే లొకేషన్‌లో ప్రాజెక్ట్ వచ్చినా నా ఒక్కడికి వేరే లొకేషన్‌లో వచ్చింది. అందువలన నేనొక్కడినే అక్కడికి వెళ్ళాలి. కానీ సాయిబాబా నాతో ఉన్నంతవరకు నేనెందుకు భయపడాలి? నేను అక్కడికి వెళ్లకముందే నా సీట్ కూడా నిర్ధారణ అయిపోయింది. అలా మా స్నేహితులలో చాలామందికి జరగలేదు. నేను నా పని గురువారమే మొదలుపెట్టాలని అనుకున్నాను. అలాగే జరిగేలా బాబా చేశారు. నా ప్రతి అడుగులో బాబా నాకు తోడుగా ఉండి మార్గనిర్దేశం చేస్తున్నారు. మనమంతా బాబాపట్ల పూర్తి విశ్వాసంతో సహనంగా ఉండాలి. ఆయన మనం ఆశించిన దానికంటే ఎక్కువే ఇస్తారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2352.html

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo