సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 25వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 25వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 34

బాంద్రాలో ఆదాము అనే పేరు కలిగిన గృహస్థు ఇండ్లకు సంబంధించిన దళారి వ్యాపారం చేసేవాడు. ఒక విషయంగా తనపై మరియు ఇంకొకరిపై పోలీసుకేసు నమోదు అయింది. ఆ కేసు పోలీసుస్టేషన్‌‌లో దాఖలు అయ్యే పరిస్థితి కనిపించసాగింది. ఆదాము ఎంతో భయంతో, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. ఏ రోజయితే తాను మెజిస్టేట్ ముందర హాజరుకావాలో, ఆరోజు ఉదయం తాను టెండూల్కర్ వద్దకు వెళ్ళాడు. వారింట్లో బాబా ఫోటో ముందరకు వెళ్ళి “బాబా మీరు నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నేను నాలుగు, ఐదునెలలు జైలుకు వెళ్ళినా సరే, మిమ్మల్ని వదలను. నేను జైలుకు వెళ్ళక తప్పేట్టు లేదు. పరిస్థితి అలా కనిపిస్తోంది. నేను నిజంగా నిరపరాధిని. ఆ విషయం మీకు తెలుసు, మీరే నన్ను విడిపించాలి” అని వేడుకున్నాడు. తాను, శ్రీ టెండూల్కర్ మరియు సౌ|| సావిత్రీబాయి పాదాలపై పడి విపరీతంగా ఏడ్చాడు. తరువాత కొద్దిసేపటికి మరలా శ్రీమతి సావిత్రీబాయి, ఆదాముకు దారిలో ఎదురు పడ్డారు. అప్పుడు తాను శ్రీ సావిత్రీబాయి చరణాలను పట్టుకుని “బాబా నన్ను ఈ కేసునుండి విడిపిస్తారని చెప్పండి” అని అన్నాడు. ఎంత చెప్పినా పాదాలను వదలలేదు. చివరకు సావిత్రీబాయి “బాబా, తప్పక నిన్ను విడిపిస్తారు" అని చెప్పింది. తరువాత తాను కోర్టుకు వెళ్ళాడు. అక్కడ బాబా తన పరువును కాపాడారు. మిగిలిన ముద్దాయిలందరినీ మెజిస్ట్రేట్ అపరాధితులుగా ఖరారు చేసారు. ఆదామును మాత్రం నిర్దోషిగా వదలి పెట్టారు. ఆదాము ఎంతో ఆనందభరితుడయ్యాడు. ఆదాము మరలా శ్రీ టెండూల్కర్ ఇంటికి వెళ్ళి బాబా ఫోటోకు మరియు ఇతరులందరి పాదాలపైపడి నమస్కరించుకున్నాడు. సాయంత్రం తన ఇంటికి ఒక వృదుడైన ఫకీరు వచ్చారు. ఆదాము ఆ ఫకీరుతో “పదండి, మా దుకాణంలో తేనీరు సేవిద్దాం” అని అన్నాడు. “మంచిది, అలాగే” అని ఆ ఫకీరు సమాధానమిచ్చాడు. ఆదాము అలా వెనుకకు తిరిగి మరలా చూస్తే ఆ ఫకీరు ఎక్కడా కనిపించలేదు. ఎంత వెదకినా మరలా ఆ ఫకీరు కనిపించలేదు. మరుసటి రోజు ఆదాము శిరిడీకి బాబా దర్శనానికై బయలుదేరి వెళ్ళాడు.

అనుభవం - 35

ఒక  పార్శీ గృహస్థు ఒకరోజు బాబా దర్శనానికి వచ్చి "ఉద్యోగం లేదు, డబ్బులకు చాల ఇబ్బందిగా ఉంది” అని తన కష్టాలను బాబాకు నివేదించుకున్నాడు. అప్పుడు బాబా “అల్లా అచ్ఛా కర్దేగా” (అల్లా అంతా చక్కబరుస్తారు) అని ఆశీర్వదించారు. ఆ గృహస్థు తన ఊరికి తిరిగి వచ్చిన తరువాత తనకు ఒక మంచి ఉద్యోగం లభించింది. తన వ్యవసాయంలో పండిన పంటకు ఎంతో మంచి ధర లభించి, ఆ ఫలసాయాన్ని అమ్మడం వలన తనకు ఎంతో లాభం కూడా వచ్చింది.

అనుభవం - 36

నా మిత్రుడు ఒకతను గడచిన గురుపూర్ణిమ ఉత్సవం కోసం శిరిడీకి రావడం జరిగింది. తాను బాబా దేహధారిగా నున్న రోజులలో బాబాను ప్రత్యక్షంగా దర్శించుకోలేకపోయాడు. బాబా గురించి తాను ఎంతో విన్నాడు. అందువలన బాబాను దర్శించుకోవాలని తనకు ఎంతో కోరిక! కానీ ఆ దర్శనభాగ్యం లభించలేదు. కానీ, గడచిన పుణ్యతిధికి శిరిడి వచ్చి బాబా సమాధిని దర్శించుకోవాలనే దృఢమైన భావం తన మనసులో కలిగింది. ఆ విధంగానే తాను శిరిడీకి వచ్చాడు. బాబా కృప వలన తనకు బాబా చరణాలపై దృఢవిశ్వాసం కలిగింది. సాధ్యమయినంతవరకు బాబా ఉపాసనలోనే గడపసాగాడు. తన యొక్క ఆనందకర స్థితి పైపైకి పెల్లుబుకుతూ బాహ్యంగా ప్రకటితం కాసాగింది. "బద్దలు కొట్టుకొని పైకి వస్తుంది” అని అన్నా సరిపోతుంది. రెండు నెలల  క్రితం తన కుమారుని వద్ద నుండి ( ఆ అబ్బాయి దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు), రమ్మని వినతి చేస్తూ ఉత్తరం రావడంతో తనకు ఇష్టం లేకపోయినప్పటికి బయలుదేరాడు. సుమారు పావుదూరం ప్రయాణం చేసిన తరువాత ఒక ప్రదేశంలో బస చేసాడు. అక్కడ బాబా క్రింది విధంగా దృష్టాంతాన్ని ప్రసాదించారు. ఆ దృష్టాంతంలో ప్రభుత్వ స్వారీ ఒకటి ఎంతో భారీగా బయలుదేరింది. ఆ స్వారీలో కలువవలసిందిగా ఒక స్వైరుడు తనను ఆహ్వానించడానికి వచ్చాడు. తాను ఆ స్వైరుని వెంట వెళ్ళాడు. ఆ విధమైన దృష్టాంతం రావడంతో తాను మిగిలిన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. తరువాత అక్కడ నుండి గురుపూర్ణిమ ఉత్సవానికై ఇక్కడకు వచ్చాడు. ఇక్కడి బాబా యొక్క రథయాత్రలో పాలుపంచుకున్నాడు. కొన్ని రోజులు ఇక్కడ బస చేసి, కొంతమందితో కలసి వేరు, వేరు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని ఇంటికి చేరుకున్నాడు. తాను తన గ్రామానికి తెల్లవారుఝామున నాలుగు గంటలకు చేరుకున్నాడు. తన ఇల్లు ఒక ఖాళీ స్థలంలో కట్టబడి, చూట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. ఆ ప్రహరీ గోడ తలుపు లోపల వైపు నుండి గడియవేసి ఉంది. నా మిత్రుడు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఆ ప్రహరీ గోడ వద్దకు చేరుకున్నాడు. ఇంట్లోని వారిని గట్టిగా కేక వేసాడు మరియు తలుపును గట్టిగట్టిగా కొట్టాడు. కాని ఇంట్లోని వారికి ఆ శబ్దాలు వినపడలేదు. ఇంతలో ఇంట్లోని ఒక అమ్మాయికి స్వప్నంలో బాబా కనిపించి “నిద్రపోతున్నావా? లే, బయట ఇంటి యజమాని నిలబడి ఉన్నాడు" అని చెప్పారు. వెంటనే ఆ అమ్మాయికి చటుక్కున మెలకువ వచ్చింది. ప్రహరీగోడ వద్దకు వెళ్ళి తలుపు తీసి చూస్తే స్వప్నంలో బాబా చెప్పిన మాదిరిగానే ఆ గృహస్థు ప్రహరిగా వద్ద నిలబడి ఉన్నాడు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

  1. And the wrestle for the Iron Throne begins.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo