సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 29వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 29వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 48 

ఒక రోజు ఉదయం నేను ఏదో చదువుతూ ఉండగా ఒక ప్రశ్నకు సంబంధించి  గందరగోళానికి గురయ్యాను. దానిగురించి ఎంత ఆలోచించినా పరిష్కారం లభించలేదు. చివరకు ఆ ప్రకరణాన్ని అక్కడే పడవేసి నేను భోజనానికి కూర్చొన్నాను. భోజనం చేసి ఆఫీసుకు బయలుదేరాను. రైలులో బాంద్రా స్టేషనులో నన్ను నా మిత్రుడు ఒకరు చూసి, తాను కూడా నేనున్న డబ్బాలోనే ఎక్కి నావద్ద కూర్చొన్నాడు. తరువాత మాహిం స్టేషనులో నా మిత్రునికి పరిచయస్థులు ఒకరు అదే డబ్బాలోకి ఎక్కారు. నా మిత్రుడు తనను నాకు పరిచయం చేసారు. అదేరోజు మా ఇంట్లో జరుగబోయే కీర్తనకు ఆహ్వానించాను. బాంద్రా మిత్రుడు దాదర్లో దిగిపోయాడు. మాహిం పరిచయస్థుడు డబ్బాలోనే ఉన్నాడు. తాను నాతో ఏమీ మాట్లాడలేదు కానీ ఏదో వ్రాస్తున్నట్లుగా నాకు కనిపించింది. గ్రాంట్ రోడ్ స్టేషనులో తాను దిగిపోయాడు. దిగేటప్పుడు తాను వ్రాసిన - కాగితాన్ని నా చేతిలో పెట్టాడు. ఆ కాగితంలో ఒక అభంగం ఉంది. ఆ అభంగంలో ఉదయం నాకు కలిగిన సందేహానికి సమాధానం ఉంది. ఆ విధంగా అనేకసార్లు మనసులో కలిగే గందరగోళానికి ఆకస్మాత్తుగా, ఊహించని విధంగా సమాధానం లభించే సంఘటనలు జరిగేవి.

అనుభవం - 49 

ఒకసారి ఒక కర్ణపిశాచిని స్వాధీనపరచుకున్న జ్యోతిష్కుడు శిరిడీకి వచ్చాడు. తాను బాబా దర్శనానికి వెళ్ళాడు, కానీ ఆయన దృష్టంతా డబ్బుల మీదే ఉండేది. అక్కడ తనకు డబ్బులు దొరికే అవకాశం తక్కువగా కనపడటం వలన, తాను దర్శనం పూర్తి చేసుకుని రహతాకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆరోజు రాత్రి తనను తేలు కుట్టింది. ఎంతో వేదన పడసాగాడు. అప్పుడు తాను బాబా ఊదీని పెట్టుకొని, బాబా నామస్మరణను కొనసాగించాడు. అందువలన వేదన తగ్గిపోయింది. దాంతో బాబాపై తనకు శ్రద్ధ కుదిరింది. మరుసటి రోజు జోషిబువా మరలా శిరిడికి వెళ్ళాడు. అక్కడ దాదాపు 15-20 రోజులు ఉండటం జరిగింది. బాబా దయవలన తనకు అక్కడ సుమారు రూ. 300/-లు లభించాయి.

అనుభవం - 50

ఒకసారి  బాపూసాహెబ్ జోగ్ ను తేలుకుట్టింది. అప్పుడు రాత్రి సుమారు 8  గంటలైంది.  తాను వెనువెంటనే బాబా వద్దకు వెళ్ళాడు. మెట్లు ఎక్కుతుండగానే బాబా బాపూసాహెబ్?ఏమిటి?” అని అడిగారు. “బాబా నన్ను తేలుకుట్టింది” అని బాపూసాహెబ్ చెప్పాడు. “తగ్గిపోతుందిలే వెళ్ళు” అని బాబా చెప్పారు. బాపూసాహెబ్ అలాగే  మెట్ల మీద నుండే వెనుకకు తిరిగా వెళ్ళాడో లేదో తన వేదన పూర్తిగా తగ్గిపోయింది.

తరువాయి భాగం రేపు 

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo