ఈరోజు భాగంలో అనుభవాలు:
- అన్ని రూపాలలో ఉన్నది శ్రీసాయే - సాయి పంపిన డాలర్
- సాయి దివ్యపూజతో తీవ్రమైన ఎసిడిటీ నుండి ఉపశమనం
అన్ని రూపాలలో ఉన్నది శ్రీసాయే - సాయి పంపిన డాలర్
సృష్టిలో సర్వం భగవంతుని రూపమేనని వేదాలు ఘోషిస్తున్నాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అదే చెప్పారు. కానీ అది ఎంతవరకు సామాన్య మానవునికి అర్థం అవుతుందనేది ప్రశ్నార్థకమే! కానీ ఆ విషయాన్ని శ్రీ సాయిబాబా బోధించినట్లుగా ఏ మహాత్ములూ బోధించలేదనేది నిర్వివాదాంశం. శ్రీసాయి, ఒక కుక్కకు రొట్టె వేస్తే తమ ఆకలి తీరిందన్నారు; ఒక పిల్లిని, గుర్రాన్ని కొడితే తమనే కొట్టినట్లు నిదర్శనాపూర్వకంగా చూపించారు; ఒక ఎద్దుని కసాయి ముంగింట్లో కట్టేస్తే తమనే బంధించినట్లు చెప్పారు. ఇన్ని రీతుల ఆయన సర్వజీవ స్వరూపుడనని అనుభవపూర్వకంగా భక్తులకు తెలియజేశారు. ఈ కారణంగానే సాయి భక్తులు వేదాంతం, భగవద్గీత వంటివి చదవకపోయినా సర్వజీవులలోనూ శ్రీసాయిని చూడగలుగుతున్నారు. అదే శ్రీ సాయి లీలలలోని అంతరార్థం.
ఇకపోతే పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలి అనుభవం:
ఓం సాయిరామ్! నేను అనంతపురం నివాసిని. నాకు రోజూ ఏదో ఒక రూపంలో బాబా దర్శనం లభిస్తూ ఉంటుంది. నేను సాయికి నివేదన చేసి, దాన్ని స్వీకరించమని వేడుకుంటే కాకి, పిచ్చుక, పిల్లి, కుక్క రూపాలలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. దాదాపు ప్రతిరోజూ గోమాత రూపంలో కూడా వస్తూ ఉండటం నేను గమనించాను. ఎప్పుడైనా ఒక్కోసారి రాకపోతే సాయిని ప్రార్థించి ఇంటి బయటకు వెళ్ళి చూస్తే, గుమ్మంలో గోమాత వుంటుంది. ఆ సంతోషం మాటల్లో చెప్పలేను. 2019 జూన్ 2వ తేదీ రాత్రి గాలివాన కారణంగా కరెంటు సప్లై ఆగిపోయింది. కొంతసేపటి తర్వాత కరెంటు వచ్చింది. కాని మా ఇంటి సర్వీస్ వైరు తెగిపోవడం వలన మాకు మాత్రం కరెంటు రాలేదు. మావారు కరెంటు ఆఫీసు డి.ఇ. కి ఫోన్ చేస్తే, "వర్కర్స్ ఎవరూ లేరు" అన్నారు. ఇక చేసేదిలేక నేను ఫోన్ లైటులోనే పారాయణ ముగించుకుని బాబాని ప్రార్థించాను. రాత్రి 11.30 సమయంలో వర్కర్స్ వచ్చారు. మావాళ్లు వాళ్ళకి సమస్య గురించి చెపితే, 'ఈ సమయంలో విద్యుత్తు స్థంభం ఎక్కడం కష్టం' అన్నారు. అప్పుడే గోమాత వచ్చింది. ఒక్క సెకను క్రితం స్థంభం ఎక్కడం కష్టం అన్నవాళ్ళు కాస్తా పని మొదలుపెట్టి సునాయాసంగా పని పూర్తిచేశారు. దాంతో కరెంటు వచ్చింది. ఇది అంతా బాబా దయ అని నా నమ్మకం.
2014లో ఒకసారి మాపాప ఇంటర్నెట్‌లో సాయిభక్తుల అనుభవాలు చదువుతూ ఉంది. అందులో ఒక భక్తురాలి అనుభవంలో తనకి ఎవరో సాయి డాలర్ బహుమానంగా ఇచ్చినట్లు ఉంది. అది వినగానే నేను మనసులో, "నాకు కూడా ఎవరైనా ఒక సాయి డాలర్ ఇస్తే బాగుంటుంది" అని అనుకున్నాను. అదేవారంలో మా ఇంటి సమీపంలో ఉండే సాయిబాబా గుడి పూజారి శిరిడీ వెళ్తుంటే, మా ఇంట్లో ఉన్న సాయి విగ్రహానికి వస్త్రాలు తెమ్మని అతనికి చెప్పాను. ఆ అబ్బాయి శిరిడీ నుండి వచ్చాక బాబా ప్రసాదం, వస్త్రాలు ఒక కవరులో పెట్టి నాకు ఇచ్చారు. నేను ఇంటికి వచ్చి కవరు తీసి చూస్తే, ఆశ్చర్యం! ప్రసాదం, వస్త్రాలతోపాటు బాబా డాలర్ కూడా ఒకటి ఉంది. వెంటనే ఆ అబ్బాయికి ఫోన్ చేసి అడిగితే, "నేను డాలర్ ఏమీ తీసుకోలేదు" అన్నాడు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. అడగగానే సాయి నా దగ్గరికి శిరిడీ నుంచి వచ్చారు. ఈ రోజుకీ ఆ డాలర్ ను బాబా కానుకగా జాగ్రత్తగా దాచుకున్నాను. "బాబా! ఇలాగే మీ కృపను మాపై సదా ఉంచండి తండ్రీ!" నేనెక్కడికి వెళ్లినా అక్కడ సాయి రూపంతో గానీ, నామంతో గానీ దర్శనం ఇస్తూ ఉంటారు.

సాయి దివ్యపూజతో తీవ్రమైన ఎసిడిటీ నుండి ఉపశమనం
బెంగళూరునుండి సాయిభక్తురాలు అనుజ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
కష్టకాలంలో నాకు తోడుగా ఉండి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తున్నందుకు ప్రతిరోజూ నేను బాబాకి కృతజ్ఞత తెలుపుకుంటాను. బ్లాగులో భక్తులు పంచుకునే అనుభవాలు చదవడంతో రోజురోజుకీ బాబాపట్ల విశ్వాసం వృద్ధిచెందుతూ ఉంది. బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.
కొన్నినెలల క్రితం నాకు ఎసిడిటీ సమస్య చాలా తీవ్రంగా ఉండేది. దానివలన నేను చాలారోజులు బాధపడ్డాను. కొన్నిసార్లు నా ఆరోగ్యం బాగుపడుతుందన్న ఆశని కూడా కోల్పోయాను. ఆ సమయంలో సరైన ఆహారం తీసుకోలేకపోయేదాన్ని. అందువలన భౌతికంగా, మానసికంగా చాలా నీరసించిపోయాను. ప్రతిక్షణం ఆరోగ్య విషయంగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇక నాకు వేరే దారి లేదు, జీవితాంతం ఈ బాధని అనుభవించాల్సిందే అని అనుకున్నాను. అంత కష్టకాలంలోనూ బాబానే నమ్ముకుని ఉన్నాను. అలావుండగా ఒకరోజు మా అక్క ఫోన్ చేసి, "ఒకసారి సాయి దివ్యపూజ చేయి, అన్నీ సర్దుకుంటాయి" అని చెప్పింది. నేను వెంటనే పూజ మొదలుపెట్టాను. అంత తీవ్రమైన ఎసిడిటీ సమస్య వెంటనే తగ్గుముఖం పట్టింది. జీవితాంతం అనుభవించాల్సి ఉంటుందనుకున్న సమస్య కొద్దిరోజుల్లోనే చాలావరకు తగ్గిపోయింది. ఇదేకాదు, నేను కష్టకాలాన్ని ఎదుర్కున్నప్పుడల్లా బాబా నాకు తోడుగా ఉండి, ధైర్యాన్నిచ్చి సమస్యలనుండి బయటపడేసారు. "థాంక్యూ సో మచ్ బాబా! కష్టకాలంలో నాకు అండగా నిలిచారు. దయచేసి ఎప్పుడూ ఇలాగే మీ కృపను చూపండి. నాకు, నా కుటుంబానికి తోడుగా ఉండి సరైన మార్గాన్ని చెప్పండి. ఎసిడిటీని పూర్తిగా నయంచేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి".
No comments:
Post a Comment