సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 73వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవం:

  • ఊదీతో మూడునెలల సమస్యనుండి విముక్తి

సాయిభక్తుడు మల్లిక్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! మా కుటుంబమంతా సాయిభక్తులం. బాబా ఆశీస్సులతో మా కుటుంబం సంతోషదాయకంగా సాగిపోతోంది. ఇక నా అనుభవానికి వస్తే, ఇది నేను పంచుకుంటున్న మొదటి అనుభవం.

ఇటీవల నేను మూడునెలలపాటు ఒక తీవ్రమైన సమస్యతో చాలా బాధపడ్డాను. వారంలో ఒకసారి నా మూత్రంలో రక్తంతో కూడుకున్న ఎర్రని కణాలు కనిపిస్తుండేవి. ఎందువలన అలా జరుగుతుందో అర్థంకాక భయపడి, స్థానికంగా ఉన్న ఒక డాక్టరుని సంప్రదించాను. ఆయన వేడి వలన అలా జరుగుతుండవచ్చని చెప్పి, యూరినరీ ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చారు. నేను వాటిని వాడుతున్నప్పటికీ ఒక వారం తర్వాత ఆ కణాలు మూత్రంలో కనిపించాయి. ఇక లాభం లేదని నేనొక యూరాలజీ స్పెషలిస్టుని సంప్రదించాను. ఆయన కొన్ని మూత్రపరీక్షలతో పాటు స్కానింగ్ చేయించారు. రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉండటంతో బహుశా ఇన్ఫెక్షన్ అయివుండొచ్చని మందులిచ్చి మూడువారాలు వాడమని చెప్పారు. ఆ మందులు వాడుతున్న ఒక వారం తర్వాత కూడా ఆ ఎర్రని కణాలు మూత్రంలో కనిపించాయి. నేను వెంటనే డాక్టరుకి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాను. ఆయన, "అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో సమస్య ఏమిటో తెలియలేదు, కాబట్టి సీటీ స్కాన్ చేద్దాం" అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం సీటీ స్కాన్ చేయించుకున్నాను. అప్పుడు కూడా రిపోర్టులు నార్మల్ గానే వచ్చాయి. దాంతో ఆయన అవే మందులు కంటిన్యూ చేయమన్నారు.

అయితే ఆ మందులు వాడుతున్నా ఫలితం కనిపించకపోగా ఆ కణాలు తరచూ కనిపిస్తూ ఉండేవి. దాంతో నాకేమైనా జరుగుతుందేమోనన్న ఆందోళనతో దేనిమీదా మనసు నిలుపలేకపోయేవాడిని. నామీద నాకే విశ్వాసం లేకుండా పోయింది. నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని నేను, నా భార్య  భయంతో రాత్రిపగలు ఏడుస్తూ వుండేవాళ్ళం. ఆ స్థితిలో అంతా శూన్యంగా కనిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఎప్పటిలాగానే బాబాని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. తరువాత డాక్టరు, "యూరిన్ సైటోలజీ చేద్దాం. ఏవైనా అసాధారణ కణాలు మూత్రంలో ఉంటే తెలుస్తుంది" అని చెప్పారు. సరేనని అది కూడా చేయించుకున్నాను. రిపోర్టులు రావడానికి మూడురోజులు పడుతుందని చెప్పారు. ఆ మూడురోజులు ఏ భయంకర వార్త వినాల్సి వస్తుందోనన్న పలురకాల ప్రతికూల ఆలోచనలతో చాలా టెన్షన్‌గా గడిచాయి.

ఆ సమయంలో నాకు ఏమీ తోచక బాబా మందిరంలో పూజారికి ఫోన్ చేసి మాట్లాడాను. అతనొక గురువును పంపారు. ఆయన సంకల్పం చెప్పి, "ఏం భయం లేదు, అంతా బాబా చూసుకుంటార"ని మామూలుగానే చెప్పారు. ఇక బాబా మిరాకిల్ మొదలైంది. సోమవారం టెస్ట్ రిపోర్టులు వస్తాయనగా ఆదివారం రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఆ సమయంలో సచ్చరిత్ర పారాయణ చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. వెంటనే ఆ రాత్రి 9 గంటల సమయంలో సాయి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. పారాయణ చేస్తూ మధ్య మధ్యలో బాబా ఊదీ కలిపిన నీళ్లు త్రాగుతూ, ప్రతి అధ్యాయం ముగిసిన తర్వాత మూత్రవిసర్జనకు వెళ్తుండేవాణ్ణి. యూరిన్ పసుపుపచ్చగా ఉండి అందులో కొన్ని కణాలు కనిపిస్తూ ఉండేవి. ఉదయం నాలుగున్నర వరకు పారాయణ చేసి, అప్పుడు నిద్రపోయాను. ఉదయం లేచాక మళ్లీ మూత్రవిసర్జనకు వెళితే, ఈసారి యూరిన్ నార్మల్‌గా ఉన్నప్పటికీ కణాలు మాత్రం ఉన్నాయి. బాబా లీల జరుగుతుందని నా మనసుకు అనిపించి, నాకు నయమవుతుందన్న నమ్మకం కలిగింది. కాసేపటి తర్వాత స్నానంచేసి  పారాయణ పూర్తిచేద్దామని అనుకుని బాత్‌రూముకి వెళ్లాను. అప్పుడు మూత్రవిసర్జన చేయగా అందులో చిన్న తలవెంట్రుక ఒకటి కనిపించింది. అది బయటకు వచ్చాక యూరిన్ చాలా స్వచ్ఛంగా కనిపించింది. నేను స్నానానంతరం పారాయణ చేశాక  టెస్ట్ రిపోర్టులు నార్మల్‌గా వస్తాయని చాలా చాలా దృఢంగా అనిపించింది. నా నమ్మకమే నిజమైంది. బాబా ఆశీస్సులతో రిపోర్టులు నార్మల్‌గా వచ్చాయి. తరువాత బాబా ఆశీస్సులతో అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నాకే సమస్యా లేదు. అసలు సమస్య అంతా ఆ తలవెంట్రుకవలనే వచ్చింది. దాని కారణంగానే నేను మూడునెలలపాటు అంత బాధ అనుభవించాను. బాబా ఊదీ నీళ్లు త్రాగడంతో ఆ తలవెంట్రుక మూత్రం ద్వారా బయటపడి మూడునెలల బాధనుండి ఉపశమనం లభించింది. "థాంక్యూ సో మచ్ బాబా! నేను తెలిసీ తెలియక చేసిన తప్పులను దయచేసి మన్నించండి బాబా! మీ ఆశీస్సులు ఎప్పుడూ నాపై, నా కుటుంబంపై, ఇంకా మీ బిడ్డలందరిపై ఉంచండి".

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/a-couple-of-sai-baba-experiences-part.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo