సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 74వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా నన్ను శిరిడీకి రప్పించి అమ్మకు నయం చేసారు.
  2. ఊదీయే అసలైన ఔషధం

బాబా నన్ను శిరిడీకి రప్పించి అమ్మకు నయం చేసారు.

కెనడా నుండి సాయిభక్తురాలు ఆర్తి సూద్ తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు:

సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నేను టొరంటోలో నివసిస్తున్నాను. నేను గత మూడు సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. మా అమ్మకి బాబాపట్ల చాలా విశ్వాసం. మా ఇంటికి దగ్గరలోనే బాబా మందిరం ఉంది. ఆ మందిరంనుండే నాకు బాబాతో అనుబంధం ఏర్పడింది.

2016 జనవరిలో మా అమ్మకి మలద్వారంగుండా బ్లీడింగ్ అయ్యింది. అది పైల్స్ కారణంగా అయివుండొచ్చని అమ్మ చాలా తేలిగ్గా తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్లలేదు. అయితే 2017 ఏప్రిల్ వచ్చినా ఆ సమస్య అలాగే ఉండటంతో మా అక్క డాక్టర్ని సంప్రదించి చెకప్ చేయిద్దామని అంది. 2017, మే 9న అది క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు. అది వింటూనే మా జీవితాలు స్తంభించిపోయినంత పనైంది. నేను, "బాబా! ఎందుకిలా జరిగింద"ని ఏడ్చేసాను. బాబా మాకు తోడుగా నిలిచారు. నేను గుడికి వెళ్ళిన ప్రతీసారి, "నేనున్నాను. అంతా బాగుంటుంది" అని బాబా సూచన ఇస్తూండేవారు. ఆ సమయంలో అమ్మకు నయమైతే శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని అనుకున్నాను. అయితే నాకు కేవలం 21 సంవత్సరాలు. ఇండియాలో మాకు తెలిసినవాళ్లు ఎవరూ లేరు. అందువలన ఇండియా వెళ్లడం నాకు చాలా కష్టతరమైంది. 'ఎవరితో ఇండియా వెళ్ళాలా?' అని నేను తరచూ ఆలోచిస్తూ ఉండేదాన్ని.

ఇలా ఉండగా నన్ను శిరిడీ తీసుకుని వెళ్ళడానికి బాబా లీల చేసారు. మా అక్క పెళ్లి 2018లో జరగాల్సి ఉండగా, అనుకోని కారణాలతో 2017 ఆగస్టులోనే జరిగింది. అదే నెలలో మా బావగారు తన కుటుంబసభ్యులను కలవడానికి ఇండియా వెళ్ళడానికి ప్లాన్ చేసారు. తను వాళ్లతోపాటు నన్ను కూడా రమ్మని అడిగారు. నేను సరేనన్నాను. ఆశ్చర్యంగా వెంటనే తను శిరిడీ కూడా వెళ్దామని అన్నారు. ఇక నా సంతోషానికి అవధులు లేవు. అలా నేను మొదటిసారి పవిత్ర శిరిడీ క్షేత్రంలో అడుగుపెట్టాను. నా కళ్ళనుండి కన్నీళ్లు ఆగలేదు. ఎంత ఆపుకుందామనుకున్నా నావల్ల కాలేదు. శిరిడీకి నన్ను తీసుకుని వచ్చి అమ్మ ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ లేదని బాబా తెలియజేసారు. తర్వాత అమ్మకి సర్జరీ జరిగింది. 2017 నవంబరులో కీమోథెరపీ కూడా జరిగింది. ఆమె చాలా నొప్పి భరించాల్సి వచ్చింది. అయితే బాబా తనకు తోడుగా ఉన్నారు. 2018 మరో సర్జరీ కూడా జరిగింది. ఈ సమయమంతా నేను బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతూ, బాబా అమ్మకు నయం చేస్తారని ధైర్యాన్ని పొందుతూ ఉండేదాన్ని. అదే నిజమైంది, ఇప్పుడు అమ్మ చాలావరకు కోలుకుంది. ఈ కష్టకాలంలో బాబా సహాయం అనేకరూపాల్లో వస్తుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. "బాబా! థాంక్యూ సో మచ్! అమ్మ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గా వచ్చేలా చూడండి. తను పూర్తి ఆరోగ్యంతో ఉండేలా అనుగ్రహించండి".

ఊదీయే అసలైన ఔషధం

ఆస్ట్రేలియానుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదములు. బ్లాగు ద్వారా భక్తుల ప్రశ్నలకు సమాధానాలు లభిస్తున్నాయి. బాబా ఊదీ ఈ ప్రపంచంలో ఉన్నతమైన ఔషధమని నేను విశ్వసిస్తాను. నేనిప్పుడు చెప్పబోయేది ఊదీ మహిమకు సంబంధించినదే.

2018, అక్టోబర్ నెలలో ఒక శనివారం సాయంత్రం మా అమ్మాయికి సంగీత కచేరీ ఉంది. ఆరోజు ఉదయం తను నిద్రలేచిన తరువాత అల్పాహారం తీసుకుంది. ఆ తర్వాత తను కడుపునొప్పి అని ఫిర్యాదు చేసింది. అంతలోనే అది డయేరియాగా పరిణమించి వాంతులు మొదలయ్యాయి. ఫుడ్ పాయిజన్ అయిందేమో అనుకున్నాను. కానీ, ఉదయం 9 నుండి 9.45 వరకు తనకి రిహార్సల్స్ ఉండటంతో నేను తనకి కొంచెం మంచినీళ్ళిచ్చి, రిహార్సల్స్‌కి తీసుకెళ్ళాను. అక్కడికి చేరుకుంటూనే తను మళ్ళీ వాంతులు చేసుకుంది. తను రిహార్సల్స్ చేయగలుగుతుందా లేదా అని ఆందోళనపడ్డాను. తన వంతు వచ్చేలోపు తనకి కొన్నిసార్లు వాంతులు అవటంతో తను చాలా భయపడిపోయింది. నేను తన టీచర్ వద్దకు వెళ్లి, "తన గ్రూప్ రిహార్సల్స్ త్వరగా ముగించేస్తే తను కాస్త విశ్రాంతి తీసుకుని సాయంత్రం కచేరీకి తిరిగి వస్తుంద"ని చెప్పాను. అంతలో నా స్నేహితురాలు తన వద్దనున్న 'హైడ్రోలైట్ ఐస్ పాప్స్' మా పాపకివ్వమని, దానివలన కాస్త ఉపశమనంగా ఉంటుందని చెప్పి, డాక్టర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకుంది. తనకి 'హైడ్రోలైట్ ఐస్ పాప్స్' ఇచ్చాక కాస్త ఉపశమనం కలిగింది. తరువాత డాక్టర్ వద్దకు వెళితే ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పారు. ఇంటికి చేరిన తర్వాత బాబా ఊదీ నీళ్లలో కలిపి తనకిచ్చి, "బాబా! నాకు ఉపశమనం కలిగించండి" అని ప్రార్థించి త్రాగమన్నాను. తను అలాగే చేసి రెండు గంటల పాటు నిద్రపోయింది. బాబా కృపవలన తను నిద్రలేచేసరికి పూర్తిగా కోలుకుంది. సాయంత్రం తన కచేరీ చాలా బాగా జరిగింది. "మాకు సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! నా వ్యక్తిగత సమస్యలు కూడా మీకు తెలుసు. వాటినుండి బయటకు రావటానికి నాకు సహాయం చెయ్యండి. వాటిని చెప్పుకోవడానికి నాకెవ్వరూ లేరు. నేను మీతో మాత్రమే చెప్పుకోగలను. దయచేసి నాకు సహాయం చెయ్యండి బాబా!"

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2351.html

3 comments:

  1. నా వ్యక్తిగత సమస్యలు కూడా మీకు తెలుసు. వాటినుండి బయటకు రావటానికి నాకు సహాయం చెయ్యండి. వాటిని చెప్పుకోవడానికి నాకెవ్వరూ లేరు. నేను మీతో మాత్రమే చెప్పుకోగలను. దయచేసి నాకు సహాయం చెయ్యండి బాబా!"

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo