కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ - 34వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 54
శ్రీ శాంతారాం బల్వంత్ నాచ్నే, దహణూకర్ గారి అనుభవం
1909వ సంవత్సరంలో ముంబాయిలో నా పెద్ద సోదరునికి గొంతుకు ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ సమయంలో నాడి పూర్తిగా బలహీనమవడంతో మా అందరికీ ఎంతో ఆందోళన కలుగసాగింది. ఆ విధంగా దహణులో నేను ఆందోళన చెందుతుండగా శ్రీ హరిభావు మోరేశ్వర్ ఫణ్సే నావద్దకువచ్చి తనకు తానే నాతో “సాయి దయవలన కష్టం గట్టెక్కిపోయింది, ఆపరేషన్ విజయవంతం అయిందని నా మనసు చెపుతోంది” అని చెప్పారు. శ్రీ సాయిబాబా గురించి శ్రీ ఫణ్సే నోటి ద్వారా మొదటిసారి వినడం, ఆయన చెప్పిన విధంగానే సోదరుని ఆపరేషన్ పూర్తిగా విజయవంతం కావడం వంటి వాటి వలన శ్రీ సాయిపై నాకు పూర్ణశ్రద్ధ కలిగింది. తరువాత 1911వ సంవత్సరంలో ఉద్యోగ నిమిత్తంగా బాంద్రాలోని శ్రీఅన్నాసాహెబ్ దాభోళ్కర్ వద్దకు వెళ్ళడం జరిగింది. వారింట్లోనే శ్రీ సాయిబాబా చిత్రపటాన్ని మొదటిసారి చూసాను. ఆ చిత్రపటంపై నా దృష్టి పడగానే వెంటనున్న వ్యక్తిని విచారించగా ఆ చిత్రపటం శ్రీ సాయిబాబాదని నాకు చెప్పారు. నేను కూడా శ్రీ సాయిబాబా యొక్క ఫోటోను ఒకదానిని లభింపచేసుకుని, ఆ ఫోటోకు అగరుబత్తీలు వెలిగించి ఉపాసన చేయడం మొదలు పెట్టాను. తరువాత ఒక సంవత్సరానికి అనాయాసంగా యోగం ప్రాప్తించి శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్నాను. 1912వ సం|| లో రెవిన్యూ సబార్డినేట్ పరీక్షాసమయంలో నేను, శ్రీ శంకర్ బాలకృష్ణ వైద్య మరియు శ్రీ అచ్యుత దాతే గార్లతో కలిసి ఠాణే వెళ్ళాను. పరీక్ష పూర్తి అయ్యాక నేరుగా శిరిడీ వెళ్ళాను. కోపర్గామ్ స్టేషన్లో దిగాక టాంగా విషయమై స్టేషన్ మాస్టారును విచారిస్తుండగా ఆ స్టేషను మాస్టారు మా ప్రశ్నకు బదులివ్వకుండా శ్రీ సాయిబాబాను నిందించడం మొదలుపెట్టాడు. కానీ, ఆ మాటలను లక్ష్యపెట్టకుండా టాంగా మాట్లాడుకుని శిరిడీకైతే వెళ్ళాము. కానీ, ఎంతో శ్రద్దాయుతమైన నా మనసు పాపపుటాలోచనలతో చంచలమవసాగింది. తెరలు, తెరలుగా చెడు ఆలోచనలు మనసులో రాసాగాయి. స్టేషన్ మాస్టర్ చెప్పింది నిజమేనా? మనం ఇంత దూరం నుండి కేవలం గుడ్డి నమ్మకంతో వచ్చామా? ఆ ఆలోచనలు నా మనసులో సాగుతుండగా శ్రీ సాయిబాబా భక్తమండలి సహితంగా లెండీ నుండి తిరిగి వస్తున్నారు. మేము బాలాభావు ఇంటి వెనుక నిలబడి ఉన్నాము. అక్కడ బాబా దృష్టి పడగానే, ఇతర భక్తుల మాదిరిగానే నేను కూడా బాబాకు సాష్టాంగనమస్కారం చేసుకున్నాను. నన్ను చూసి బాబా “అరే,! మమళ్తాదర్ వద్ద సెలవు తీసుకోకుండా వచ్చావా?” అని అడిగారు. నేను “అవును” అని సమాధానం చెప్పగానే, “అలా చేయకూడదు” అని బాబా చెప్పారు. బాబా ఆ విధంగా తమ మహిమను తెలియజేయడంతో నా మనసులో ఆయన పట్ల గౌరవం పెరిగి, శ్రద్ద కలగసాగింది. ఆ సమయంలో దహణలో శ్రీ బి.వి. దేవ్ మామ్లేదార్ గా ఉండేవారు. నేను ఎక్కువ రోజులు గడపడంతో "మరలా అలా జరిగితే, చర్య తప్పదు” అని తాఖీదు ఇచ్చారు.
మేము శిరిడీకి వెళ్ళకముందు ముంబాయికి వెళ్ళాము. అక్కడ శ్రీ హరిభావు ఫణ్సే గారు మోహన్ బిల్డింగ్ లోని చౌబల్ ఇంటికి వచ్చారు. ఆయనకు ఒక పోలీసు కేసులో ఆరు నెలలు శిక్ష పడింది. తాను జామీనుపై విడుదలై అప్పీలు చేసుకోవడం కోసం వచ్చాడు. నేను శిరిడీకి వెళుతున్నాననే విషయం తనకు తెలిసి, ఆయన నాకే నమస్కారం చేసుకుని “నా ఈ పరిస్థితిని శ్రీ గురుమావులికి చెప్పండి. నేను నిరపరాధిని, కాని నాకు అకారణంగా శిక్ష పడింది” అని చెప్పాడు. ఆ విషయాన్ని మరుసటిరోజు ఉదయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. కానీ, తెల్లవారుఝామున కాకడ ఆరతి పూర్తయ్యాక బాబా అతిభయంకరమైన కోపంలో ఉంటూనే నాతో “ఆందోళన చెందవద్దని చెప్పు” అని అన్నారు. ఆ సమాధానాన్ని నేను శ్రీ ఫణ్సేకు చేరవేసాను. తరువాత బాబా చెప్పిన ప్రకారమే తాను అప్పీలు ద్వారా విడుదలై బయటపడ్డాడు.
మేము శిరిడీ నుండి వచ్చిన తరువాత మా సమ వయసుగల స్నేహితులలో గోపాల్ కేశవ్ వైద్య ఇదివరకు శిరిడీ వచ్చి వెళ్ళారు. తాను తన జ్యేష్ఠ సోదరుడు ఆత్మారామ్ కేశవ్ వైద్యకు శిరిడీకి బాబా దర్శనానికై వెళ్ళి రమ్మని చెప్పాడు. శిరిడి వెళ్ళేటప్పటికి శ్రీ వైద్యగారి వయస్సు సుమారు 42 సంవత్సరాలు, ఆయన భార్య యొక్క వయస్సు 38 సంవత్సరాలు. ఏదో దోషం వలన పెళ్ళి అయినప్పటినుండి ఆమె భర్త ముఖం చూడలేదు. తనను కాపురానికి తీసుకురావాలని ఇరుపక్షాలవారు చాలా ప్రయత్నం చేసారు. కానీ, ఆమె పుట్టింటిని వదలలేదు. కానీ, శిరిడీ ప్రసాదాన్ని శ్రీ వైద్య ఆమెకు ఇచ్చాక అదే రోజు ఆమె కాపురానికి వచ్చింది. ఆమె తన చిన్న మరిదితో (గోపాల్రావుతో), “ఇదే నా ఇల్లు, పుట్టింట్లో ఉంటే ఏ విధమైన సుఖం ఉండదు” అని అన్నది. అప్పుడు గోపాల్రావ్ కు కూడా తన వదిన అన్న మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటూ, వారికి పిల్లలు కూడా కలిగారు.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
Thanks a lօt for sharing this with all people you really recognize what you are talking
ReplyDeleteabout! Boоkmarked. Pleаse also talk over with myy web site =).
We will have a link alternate contract among
us
i can't understand what you are saying. what is bookmarak. which contract are you telling. i don't know. please tell me in understandble way.
Delete🕉 sai Ram
ReplyDelete