సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 32వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 32వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.


అనుభవం - 52

కృష్ణారావ్ నారాయణ్ పారూళ్ కర్ గారు శ్రీ హరిసీతారాం దీక్షిత్ గారికి వ్రాసిన ఉత్తరంలోని సారాంశం.

మకాం: హర్దా 
తారీఖు: 17, ఫిబ్రవరి 1915.

శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారికి స్వామివారి సేవకుడి శిరఃసాష్టాంగ నమస్కారములు. మీ వద్ద నుండి మరియు సాధూభయ్యాగారి వద్దనుండి ఉత్తరాలు వచ్చాయి. ఆ తరువాత బాబా గారి ఫోటో తీసుకొని శ్రీ బాళక్ రామ్ జీ మరియు శ్రీ ముక్తారామ్ జీ వచ్చారు. వారి ఆజ్ఞప్రకారమే లఘురుద్రం వంటివి పూర్తయిన తరువాత శ్రీ బాబా ఫోటో స్థాపన శ్రీ సాధూభయ్యాగారి ఇంట జరిగింది. ఆ తరువాత బాబా ప్రసాద వినియోగం తరువాత ఉత్సవం సమాప్తం అయింది. ఏరోజైతే బాబా ఫోటో స్థాపన జరిగిందో, ఆరోజు రాత్రి నా భార్య మరియు నా పినసోదరుడైన శ్రీ నారాయణ్ దాదా జిజ్ గావ్  వాలే ఇద్దరికీ క్రింద వ్రాసిన విధంగా దృష్టాంతం వచ్చింది. నారాయణ్ దాదాకు ఏ విధమైన దృష్టాంతం వచ్చిందంటే తాను శిరిడీలో బాబా వద్ద నిలబడి ఉన్నాడు. అప్పుడు బాబా "నేను హార్ధా వెళుతున్నాను కూడా నాతో పద” అని అన్నారు. అప్పుడు ఇద్దరూ కలిసి కోపర్గాంలోని గోదావరి తీరానికి వచ్చారు. ఒడ్డు మీద నిలబడియున్నారు. గోదావరిలో నీరు ఎప్పటికంటే ఎక్కువగా ఉన్నాయి. ఒడ్డుపై వాళ్ళు ఎక్కడ నిలబడి ఉన్నారో, అక్కడే రెండు బస్తాల గోధుమలు పై భాగంలో తెరవబడి ఉన్నాయి. తరువాత బాబా నారాయణరావుతో “ఇప్పుడు ఎలా వెళతావు?” అని అన్నారు. బాబా అలా అన్నారో లేదో, చుట్టుప్రక్కల వీపుపై సామాను కట్టబడిన పది ఎద్దులు నిలబడి ఉన్నాయి. ముందర నీరు తొలిగిపోయి దారి ఏర్పడినట్టు కనిపించింది. తరువాత హార్థాలో మా ఇంటి నుండి సాధూభయ్యా ఇంటి వరకు ఎక్కడైతే బాబా ఫోటోను ఉంచారో, అక్కడి వరకు శ్రీ సాయిబాబా ఆ మొత్తం ఎద్దులతో సహా వెళ్ళి, అదృశ్యమయ్యారు.

రెండవది: నా భార్యకు ఎటువంటి దృష్టాంతం వచ్చిందంటే, మాధవరావు చేతిలో ఒక పళ్ళెం తీసుకొని, ఆ పళ్ళెంలో ఒక టెంకాయ మరియు కుంకుమపొడి వంటివి తీసుకొని వచ్చారు. ఆ పళ్ళాన్ని నా భార్యకు ఇస్తూ “బాబా నీ కోసం సారె పంపించారు” అని చెప్పారు. ఈ రెండు దృష్టాంతాలు మీకు తెలియపరుచుకుంటున్నాను. శ్రీ బాలక్ రామ్ జీ  మరియు శ్రీ ముక్తారామ్ జీ  ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు పూజా, ఆరతి రెండు పూటలా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము. మీ దయ వలన బాబా యొక్క దర్శనం, దృష్టాంతం మరియు ప్రసాదం లభించాయి. ఆ సమయంలో మీరు ఇక్కడకు రావాలని ఎంతో ఆశగా ఉంది. కానీ మీ ఉత్తరం చదివాక మీరు రాలేకపోవడానికి గల కారణం తెలిసింది. ఏదో ఒకరోజు బాబా మిమ్మల్ని హార్దాకు పంపిస్తారని మా ప్రగాఢవిశ్వాసం! బాబా వారి ఆజ్ఞ లభించడంతో శ్రీ సాధూభయ్యా శిరిడీ బయలుదేరి వెళ్ళారు. ఆయన శిరిడీ వెళ్ళి నేటికి పది రోజులయింది. ఇక్కడ అందరూ బాబా కృప వలన క్షేమంగా, సంతోషంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉత్తరం వ్రాసి సమాచారం తెలియచేస్తుంటాను. మా ప్రేమను తెలియ చేయాలని వినతి. సౌ|| వదిన గారికి మా నమస్కారాలు తెలియచేయగలరు.

మీ 
కృష్ణారావ్ నారాయణ్ పారూళ్ కర్

తరువాయి భాగం రేపు 

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo