సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 68వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా కృపతో వచ్చిన వీసా
  2. ఫలితాలు వచ్చే ప్రతిసారీ సాయి నా ఎదురుగా ఉన్నారు.

బాబా కృపతో వచ్చిన వీసా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను, నా భర్త, మా పాప ముగ్గురం 2018 నవంబరులో ఇండియా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. ఆర్డినరీ వీసా అయితే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని ఎలక్ట్రానిక్ వీసాకి ప్రయత్నిస్తే, అది కేవలం మూడురోజుల్లోనే వచ్చేసింది. తర్వాత ఇండియా బయలుదేరడానికి 10 రోజుల ముందు ఆన్‌లైన్‌లో వీసా సబ్మిట్ చేసాను. ఇక్కడే సమస్య మొదలైంది. మా పాప వీసా వేలిడిటీ ఆరునెలలే ఉండటంతో తిరస్కరించబడింది. దాంతో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మరుసటిరోజు గురువారంనాడు మావారు ఖర్చు ఎక్కువైనా గానీ ఆర్డినరీ వీసాకి ప్రయత్నిద్దామన్నారు. సరేనని ఫారం నింపి కార్యాలయంలో సబ్మిట్ చేసి, "మేము  నవంబర్ 16న ఇండియా వెళ్తున్నాము, ఆలోగా వచ్చేలా చూడమ"ని అభ్యర్ధించాము. వాళ్ళు, "నాలుగు పనిదినాలు పడుతుంద"ని చెప్పారు. తరువాత నేను నవంబర్ 13న ఫోన్ చేసి అడిగితే, "మీ డాక్యుమెంట్స్ విదేశీ రాయబార కార్యాలయంలో సబ్మిట్ చేసాము. ఒక వారంరోజులు పడుతుంద"ని చెప్పారు. ఇక నేను ఏడుస్తూ, "సహాయం చేయండి బాబా" అని ప్రార్థించి రాత్రిపగలు బాబాని స్మరిస్తూ ఉన్నాను. మరుసటిరోజు మళ్ళీ ఫోన్ చేస్తే అదే సమాధానం వినిపించింది. మావారు కూడా తన ఆఫీసునుండి ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక నేను బాబా ముందు కూర్చుని, "బాబా! మీకు తెలుసు, నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. మీరేం చేస్తారో ఏమో! మేము నవంబర్ 16న ఫ్లైట్ ఎక్కేలా చూడండి" అని ప్రార్థించాను. మా పాప కూడా "బాబా ప్లీజ్! పాసుపోర్టు, వీసా నాకు ఇవ్వండి. నేను ఇండియా వెళ్లాలి" అని ప్రార్థించింది. తర్వాత ఆరోజు మధ్యాహ్నం మావారు వీసా వచ్చిందో, లేదో కనుక్కోవడానికి ఆఫీసుకి వెళ్లారు. ఇంట్లో ఉన్న నేను మావారితో పాటు బాబా వెళ్తున్నట్లు ఉహించుకున్నాను. బాబా అద్భుతం చేసారు. ఆఫీసు వాళ్ళు వీసా, పాసుపోర్టు మావారి చేతిలో పెట్టారు. ఆ వార్త వింటూనే ఆనందంతో నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. "బాబా! మీ గొప్పతనాన్ని పొగడటానికి నా దగ్గర పదాలు లేవు. బాబా! ఐ లవ్ యు! మీకా విషయం తెలుసు. నేను మీ వలనే జీవిస్తున్నాను. మీరు మాకోసం ఉన్నారు. అది చాలు మాకు".

ఫలితాలు వచ్చే ప్రతిసారీ సాయి నా ఎదురుగా ఉన్నారు.

తమిళనాడునుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ హాయ్! నేను మెడిసిన్ చదువుతున్నాను. బాబా ఆశీస్సులతో నా మొదటి సంవత్సరం పరీక్షలు బాగా వ్రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఫలితాలు వచ్చే తేదీ ముందుగా తెలియకపోవడంతో నేను చాలా ఒత్తిడికి లోనవుతుండేవాడిని. కానీ బాబాపై ఉన్న విశ్వాసంతో రోజులు సాఫీగా సాగుతుండేవి. నేను ఇంట్లో ఉండగా ఒకరోజు హఠాత్తుగా నా స్నేహితుడు వచ్చి, సాయి మందిరానికి వెళదామని  పిలిచాడు. సరేనని ఇద్దరం మందిరానికి వెళ్ళాం. అక్కడ బాబా నాకు అద్భుతమైన అనుభవమిచ్చారు. నేను, నా స్నేహితుడు బాబా దర్శనం చేసుకుని, బాబాకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాము. హఠాత్తుగా నా స్నేహితుడికి ఫోన్ వచ్చింది. తనకి తెలిసినవాళ్ళు ఫలితాలు వెలువడ్డాయని చెప్పారు. మేమిద్దరం ఆతృతగా సాయిని స్మరించుకుంటూ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసాం. ఆయన కృపవలన మేమిద్దరం చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణులమయ్యాము. కళ్ళెత్తి చూస్తే ఎదురుగా బాబా. బాబాను చూస్తూనే కళ్ళనుండి ఆనందభాష్పాలు జలజలా రాలిపోయాయి. అంతలో ఒక మహిళ మావద్దకు వచ్చి మా చేతుల్లో స్వీట్ పెట్టింది. పరీక్షలో పాసయినందుకు సాయి స్వీట్ ఇవ్వడం మమ్మల్ని ఆనందసాగరంలో ముంచేసింది. ఈ సంఘటన బాబాపట్ల నాకున్న విశ్వాసాన్ని దృఢం చేసింది. ఆరోజుని నేనెప్పటికీ మర్చిపోలేను.

మరో అనుభవం:

ఒకసారి నేను NEET UG పరీక్ష వ్రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సాయివ్రతం మొదలుపెట్టాను. వ్రతంలో చివరిరోజు పూజ రేపనగా మా బంధువులు ఫోన్ చేసి, "ఫలితాలు వచ్చాయ"ని చెప్పారు. ఆత్రంగా సైట్ ఓపెన్ చేసి చూస్తే బాబా కృపవలన నేను పాసయ్యాను. అప్పుడు కూడా కళ్ళెత్తి చూస్తే, 'నేనెప్పుడూ నిన్ను మర్చిపోను' అన్నట్లుగా ఎదురుగా నా సాయి ఉన్నారు. "థాంక్యూ సో మచ్ బాబా!" బాబా ఆశీస్సులు మనపై సదా ఉంటాయి.

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2353.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo