సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 40వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 40వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.


అనుభవం - 66

ఒకసారి కొందరు వాడాలో కూర్చొని ఉండగా, వారిలో ఒకరు అక్కడ లేని వ్యక్తి గురించి నిందాపూర్వకసంభాషణ జరుపసాగారు. ఆ నిందాపూర్వకసంభాషణ చాలా మందికి రుచించలేదు. కొంచెం సమయం తరువాత ఆ నిందారోపణ చేసిన గృహస్థు శౌచవిధి కోసమై బయటకు వెళ్ళాడు. అంతలో బాబా లెండీకి బయలుదేరారు. అప్పుడు బాబా ఆ నిందారోపణ చేసిన గృహస్థు విషయమై నన్ను అడిగారు. బాబా “ఫలానా, ఫలానా వాళ్లు ఎక్కడ?” అని నన్ను అడిగారు. “బాబా, తాను శౌచవిధి కోసం వెళ్ళాడు” అని సమాధానం చెప్పాను. ఆ గృహస్థు వచ్చిన తరువాత బాబా, మీ గురించి అడిగారు” అని చెప్పాను. అప్పుడు ఆ గృహస్తు బాబాకు ఎదురు పడ్డాను. అప్పుడు బాబా నాకు ఒక వరాహాన్ని చూపించారు. దాని నోరంతా అశుద్ధంతో నిండి ఉంది. “చూసావా, అది ఎంత ఆనందంగా అశుద్దాన్ని తింటుందో. కానీ మనం ఆ అశుద్దాన్ని అసహ్యించుకుంటాము. మనం ఎవరినీ నిందించకూడదు. అది చాలా చెడ్డ అలవాటు” అని బాబా అన్నారు".


అనుభవం - 67

దక్షిణ కర్ణాటకలోని ముల్కి అనే గ్రామంలో వెంకట్రావు అనే నామధేయం కలిగిన గృహస్తు ఉన్నాడు. తనకు బాబా ఫోటో 1916లో క్రిస్మస్ సెలవులలో లభించింది. ఊదీ కూడా అదే సంవత్సరం లభించింది. ఆయన అల్లుడు హైకోర్టులో వకీలుగా పనిచేసేవారు. తాను ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. అంతేకాదు తాను మరణించినట్లుగా వెంకట్రావుకి వార్త అందింది. సరిగ్గా ఆ రోజులలోనే తన స్నేహితుడు ఒకరు తనకు బాబా గురించి చెప్పారు. బాబా ఆశీర్వాదం తీసుకొని అల్లుడి ఆచూకి కోసం వెతికే పని ప్రారంభించమని ఆ స్నేహితుడు చెప్పాడు. కానీ ఆ సమయంలో దర్శనానికి వెళ్ళేందుకు సమయం లేదు. కానీ అదృష్టవశాత్తు తనకు బాబా ఊది మరియు ఫోటో లభించాయి. ఆ ఊదీని తాను నుదిటిపై పెట్టుకుని బాబాకు సాష్టాంగనమస్కారం చేసుకున్నాడు. ఇదంతా ముంబాయిలో జరిగింది. కాని  అదే సమయంలో ముల్కీ గ్రామంలో నున్న తన కూతురికి సాత్వికభావనలు రాసాగాయి. అప్పుడు తాను తన తండ్రికి ఉత్తరం వ్రాసి “నువ్వు ఫలానా రోజు పూజ సమయంలో నా గురించి ఎవరైనా మహాత్మునిగాని లేదా భగవంతున్ని గాని ఆశీర్వాదం అడిగావా?” అని అడిగింది. అప్పుడు వెంకట్రావు ఆమెకు జరిగిన విషయం తెలియచేసాడు. అప్పటి నుండి ఆమెకు బాబాపై శ్రద్ధ కుదిరింది. అల్లుడి ఆచూకీ లభ్యం కాలేదు కానీ, ఆ తరువాత ఎప్పుడైన, ఏదైనా దుఃఖం కలిగితే అప్పుడు బాబాను స్మరించుకునేవాడు బాబా ఊదీని సేవించేవాడు. కొన్ని రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చింది. దాంతో తాను స్పృహ తప్పిపోయాడు. అటువంటి అవస్థలో తనకు బాబా దర్శనం కలిగింది. అప్పుడు బాబాతో పాటుగా ఇద్దరు సేవకులు ఉన్నారు. ఆ సేవకులు వెంకట్రావు వద్దు, వద్దు అంటున్నా తన పాదాలను మర్దన చేసారు. ఆ తరువాత బాబా మరియు సేవకులు అదృశ్యమయ్యారు. ఆ తరువాత 1918వ సంవత్సరం ఈస్టర్ సెలవులలో వెంకట్రావు శిరిడీకి బాబా దర్శనానికై వెళ్ళారు. అప్పుడు ఆ సేవకులు ఇద్దరు తనకు కనిపించారు. వెంకట్రావు వారిద్దరినీ గుర్తుపట్టారు. వెంకట్రావు యొక్క పెద్ద కుమారుడు మొదట నాస్తికుడు. తన తండ్రిని చూసి నవ్వుకునేవాడు. తరువాత ఆ అబ్బాయే బాబా భక్తుడయ్యాడు. సమస్య వచ్చిన ప్రతిసారి శిరిడీకి ఉత్తరం వ్రాసి, బాబా ఆశీర్వాదాన్ని అర్థించేవాడు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆ సమస్య తీరిపోయినట్లు తన వద్ద నుండి ఉత్తరం వస్తుండేది.

అనుభవం - 68 

ఒకరోజు రెండవ ప్రహరిలో బాబా నాతో “కుశాల్ భావు వచ్చి చాలారోజులైంది. నీవు టాంగా తీసుకొని రహతాకు వెళ్ళి తనను తీసుకురా. బాబా నిన్ను రమ్మంటున్నారని తనకు చెప్పు” అని చెప్పారు. ఆ విధంగానే నేను టాంగా తీసుకొని రహతాకు వెళ్ళి కుశాల్ భావును కలిశాను. అప్పుడు కుశాల్ భావు నాతో క్రింది విధంగా అన్నారు. "మధ్యాహ్నం భోజనంచేసి పడుకున్నాను. నాకు అలా నిద్రపట్టిందో లేదో బాబా స్వప్నంలోకి వచ్చారు. "శిరిడీకి పద అని నాతో అన్నారు. అందువలన నాకు శిరిడీకి రావాలని తీవ్రంగా అనిపించింది. కాని కానీ ఈరోజు నా గుఱ్ఱం ఇక్కడ లేకపోవడం వలన రావడానికి వీలుకాలేదు. అందువలననే ఇప్పుడే మా అబ్బాయిని అక్కడికి పంపించాను” అని చెప్పారు. అందుకు నేను “అందుకోసమే బాబా టాంగా ఇచ్చి నన్ను పంపించారు. మీరు వచ్చేటట్లేతే టాంగా సిద్ధంగా ఉంది” అని చెప్పాను. తాను ఎంతో ఆనందంగా నాతో కలిసి శిరిడీకి వచ్చారు.

తరువాయి భాగం రేపు... 

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

3 comments:

  1. Hello jᥙst wanted to give yoou a qսick heads up and let you
    know a ffew of the images aren't l᧐ading correctly.
    I'm not sure why bᥙt I think its a linking issue. I've triеd it inn twߋ different internet browsers and both show
    the same outcome.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo