ఈరోజు భాగంలో అనుభవాలు:
- నాలోని దుర్బుద్ధిని అణచివేసి కొత్త గుణపాఠం నేర్పారు బాబా
- మనసులో ఉన్న కలతకు వెంటనే బదులిచ్చిన శ్రీసాయి
నాలోని దుర్బుద్ధిని అణచివేసి కొత్త గుణపాఠం నేర్పారు బాబా
పేరు వెల్లడించని ఒక సాయిబంధువు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సద్గురు సాయిమహారాజుకు నా పాదాభివందనాలు. సాయిబంధువులకు నా నమస్కారములు. అందరిలో బాబా ఉన్నారని తెలిసినా అదెప్పుడూ ఏమరుపాటుగానే ఉంటుంది. కానీ తోటి సాయిబంధువుల హృదయాలలో కొలువైవుండే సాయి చిత్ జ్యోతి ప్రకాశం ఆయా భక్తుల అనుభవాల ద్వారా నాలాంటి వారికి వెలుగు చూపుతూ ఉంటుంది. ముఖ్యంగా 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు', 'వాట్సాప్ గ్రూపు' భక్తి పెంపొందింపజేయడంలో నాకు ఆదర్శనీయులు. ఒకానొక సమయంలో నేను సత్సంగాన్ని ప్రసాదించమని బాబాను అడిగినప్పుడు బాబా నాకు చూపిన ఆ 'వాట్సాప్ గ్రూపు సత్సంగం' నాకొక వరం అయితే, 'బ్లాగు శిరిడీలో సత్సంగం లాంటిది'. ఇకపోతే నాకు ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఆ 'వాట్సాప్ గ్రూపు సభ్యులైన' ఒక సాయి తోబుట్టువు నాకు మనోధైర్యాన్ని కలిగిస్తూ, బాబా అనుగ్రహానికి దగ్గరయ్యే విధంగా సలహాలు ఇస్తున్నారు. వారి మేలు నేను ఎన్నటికీ మరువలేను.
ఇక కొన్ని కారణాలరీత్యా నా పరిచయం లేకుండా నా అనుభవాన్ని చెప్పవలసి వచ్చింది. అందుకు ఏమీ అనుకోకండి. నా సమస్య తీరగానే బ్లాగులో పోస్ట్ చేస్తానని బాబాకి మొక్కుకున్నాను. అందుకే నా అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇక నా అనుభవానికి వస్తే....
రెండవ కాన్పుకని పుట్టింటికి వెళ్ళిన నా భార్య కొన్ని అనూహ్య కారణాలవల్ల బాబుకు ఆరు నెలలు వచ్చినా పుట్టింటిలోనే ఉండిపోయింది. మొదటి కాన్పుకి వెళ్ళినప్పుడు కూడా ఒక సంవత్సరం పైనే తను అక్కడ ఉండిపోయింది. అందువల్ల అన్ని కార్యక్రమాలు ఆలస్యం అయిపోయాయి. ఇప్పుడు కూడా అలాగే అవుతుందేమోనని నేను చాలా భయపడ్డాను. ఈ సమస్యలవల్ల నా తల్లిదండ్రులు కూడా మానసికంగాను, శారీరకంగాను చాలా కృంగిపోయారు. "ఈసారి మనవడు పుట్టాడు, వాడిని ఎత్తుకుని, ముద్దాడగలమో లేదో?" అని వాళ్ళు బెంగపెట్టుకున్నారు. వాళ్ళకి ఏమీ చెప్పలేని స్థితిలో నేను ఉండిపోయాను. మా అందరి దిగులుతో ఇల్లంతా శూన్యం అయిపోయింది. నేను జీవచ్ఛవంలా నా ఉద్యోగానికి వెళ్లివస్తున్నానే గాని, నా విధులు ఏవీ సక్రమంగా చేసుకోలేకపోయాను. అప్పటివరకూ నేను అడిగీ అడగకముందే అన్నీ ఇచ్చేసే బాబా ఈసారి ఎందుకు మౌనంగా ఉన్నారో, అసలు ఏం నిర్ణయించారో అర్థంకాక నేను చాలా దిగులుపడ్డాను. సహనంతో ఉండలేక, 'సమస్యను పరిష్కరించమ'ని బాబాని చాలా చాలా ప్రార్థించాను. అప్పుడు బాబా ప్రేరణతో నా అహాన్ని వదలి నా భార్యతో మాట్లాడాను. తను వచ్చేయడానికి సిద్ధపడింది. కానీ ఒక్కక్షణం నా బుద్ధి తప్పటడుగు వేసి, 'ఇందులో బాబా ప్రేమయమేమీ లేకుండానే నేనే సాధించుకున్నాను' అని అనుకున్నాను. చీమ అలికిడిని కూడా వినగలిగే బాబాకి ఆ క్షణంలో నా మదిలో రేగిన చెడు తలంపు ఇట్టే తెలిసిపోయింది. బాబా నాకు తగిన పాఠం నేర్పే లీల మొదలుపెట్టారు.
ఏం జరిగిందో తెలియదుకానీ వాళ్ళు మళ్లీ ఎదురుతిరిగారు. ఇక నా మాటల తంత్రం ఏమీ ఫలించలేదు. సాయి ప్రశ్నలు - జవాబుల ఆన్లైన్ సైట్‌లో నా సమస్య గురించి చాలాసార్లు బాబాని అడిగాను. బాబా నాకు ధైర్యం చెప్తున్నట్లు, 'ధైర్యంగా ఉండమంటూ' సమాధానాలు వచ్చేవి. ఒకసారి 'కొబ్బరికాయ సమర్పించమ'ని వచ్చింది. బాబా చెప్పినట్లుగానే ధునిలో కొబ్బరికాయ, నవధాన్యాలు సమర్పించాను. తరువాత అష్టోత్తర శతనామావళి చదివి, "నా సమస్య తీరితే బ్లాగు ద్వారా నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. ఇలా ఉండగా ఒకసారి సాయి తోబుట్టువు నా బాధ విని, "బాబా నామం చేసుకో" అని చెప్పారు. నేను అలాగే చేస్తూ ఒకరోజు నా భార్యతో మాట్లాడాను. అయితే ఈసారి కాస్త కటువుగా మాట్లాడాను. తరువాత బాబా దయవల్ల నా మామగారితో సయోధ్య కుదిరి, నా భార్యను సగౌరవంగా ఇంటికి పంపించారు. ఇది చిన్న సమస్యగానే అనిపించవచ్చు. కానీ నాకు, నా కుటుంబానికి చాలా ఆవశ్యకమైనది. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే, బాబా సహాయాన్ని అర్థించాక, ఆయన చేసిన సహాయాన్ని అవహేళన చేసేలా తలెత్తిన నా దుర్బుద్ధిని అణచివేసి నాకు కొత్త గుణపాఠం నేర్పారు బాబా. నిజానికి ఇదివరకు బాబా చేసిన సహాయంవల్ల మంచి పొజిషన్‌లో ఉన్న నేను, అన్నీ బాబా ఆజ్ఞ వల్లే జరుగుతాయనే అనుభవాలను పొందిన నేను బాబా పెట్టిన పరీక్షలో ఓడిపోయి ఈ అనుభవం ద్వారా మంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాను.
జై సాయిరాం! సాయి శరణం.

మనసులో ఉన్న కలతకు వెంటనే బదులిచ్చిన శ్రీసాయి
సదాశివపేటనుండి పురం రమాదేవిగారు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను బాబా సేవకురాలిని. 2018లో నేను మా కోడలి డెలివరీకి అమెరికా వెళ్ళాను. మా అబ్బాయి ప్రతి గురువారం రాత్రి మమ్మల్ని అక్కడి బాబా మందిరానికి తీసుకుని వెళ్ళేవాడు. డెలివరీకి ముందువారం మందిరానికి వెళ్ళినప్పుడు దర్శనానికి లైన్లో ఉన్నంతసేపు నా మనసులో ఏదో తెలియని ఆందోళన. ఆ విషయాన్ని గమనించిన మా మనవడు, 'ఎందుకలా ఉన్నావ'ని అడిగాడు. అప్పుడు మావారు, "మీ నాన్నమ్మ ప్రతి గురువారం సదాశివపేటలోని బాబా మందిరంలో సేవ చేసుకుంటుంది. ఇక్కడ ఆ అవకాశం లేదని బాధపడుతోంది" అని చెప్పారు. కొద్దిసేపటికి మేము బాబా దగ్గరకు రాగానే, మందిర నిర్వాహకులు నా దగ్గరకు వచ్చి, "మేడం! మీరు దయచేసి పవళింపుసేవలో పాల్గొనండి" అని అడిగారు. బాబా కరుణ చూడండి, మనసులో ఉన్న కలతకు వెంటనే బదులిచ్చారు. తలచినంతనే పలికే తండ్రి. పవళింపుసేవ పూర్తయ్యేవరకు ఉన్న పనులన్నింటిలో మా అందరికీ అవకాశం ఇచ్చారు. బాబాకు అతి సమీపంలో ఉండి సేవించుకునే భాగ్యాన్నిచ్చారు. తరువాత మాకు బాబా పూలమాలలు, ప్రసాదాలు ఇచ్చారు. నేను, మా కొడుకు, కోడలు, మావారు చాలా చాలా సంతోషించాము. 'బాబాని మనసారా తలుచుకుంటే కానిదంటూ ఏమీలేదు' అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. బాబా మమ్మల్ని అలా ఆశీర్వదించిన మరుసటివారంలోనే మా కోడలికి బాబు పుట్టాడు.
🕉 sai Ram
ReplyDelete