సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 38వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 38వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.


అనుభవం - 61 

గోఖలే అనే ఇంటి పేరు కలిగిన స్త్రీ బాబా యొక్క కీర్తిప్రతిష్టల గురించి విని బాబా దర్శనానికై వచ్చింది. ఆమె శ్రీమతి కాశీబాయి కణీత్కర్ కు ఆప్తురాలు కావడం వలన ఆమెను దాదాకేల్కర్ కు పరిచయం చేస్తూ శ్రీమతి కణీత్కర్ ఉత్తరం పంపించింది. శ్రీమతి గోఖలే బాబా వద్ద మూడు రోజులు అన్నం, నీళ్ళు ముట్టకుండా ఉపవాసం చేయాలని నిర్ణయించుకొని వచ్చింది. ఆమె రావడానికి ముందురోజు బాబా, దాదాకేల్కర్తో “హోలీ పండుగ వచ్చింది. నా పిల్లలు ఎలా ఉపవాసం ఉంటారు? నేను వాళ్ళను ఎలా ఉపవాసం ఉండనిస్తాను?” అని అన్నారు. ఆమె రాగానే దాదాకేల్కర్ వద్దకు వెళ్ళి సామాను పెట్టి, వెంటనే బాబా దర్శనానికి వెళ్ళింది. ఆమె దర్శనం చేసుకొని కూర్చొన్న కొంచెం సేపటి తరువాత బాబా తమకు తామే స్వయంగా “మనకు ఉపవాసం, తపవాసంతో ఏమి అవసరం? మనం మన దాదా ఇంటికి వెళ్ళి పూరణ్ పోళీలు చేసుకొని తిందాం మరియు దాదాకు, తన కుటుంబానికి తినిపించుదాం” అని అన్నారు. శ్రీ దాదాకేల్కర్ శ్రీమతి బయట చేరి ఉండటం వలన “వంట సంగతి ఎలా చేయాలి?” అనే సందిగ్ధంలో దాదాకేల్కర్ కుటుంబీకులు ఉన్నారు. ఇంతలో బాబా పైవిధంగా ఆజ్ఞాపించారు. అప్పుడు గోఖలేబాయి తన నిశ్చయాన్ని వదిలేసి, ఎంతో ప్రేమతో దాదా ఇంట్లో వంట చేసింది. దాదా కుటుంబ సభ్యులందరికీ ఎంతో సంతోషంగా తినిపించి, తాను కూడా భుజించింది.

అనుభవం - 62 


అనంతరావు పాటణీకర్ అనే పేరు కలిగిన దాదాకేల్కర్ స్నేహితుడు పూనాలో ఉంటాడు. తనకు వేదాంత విషయాల పట్ల మక్కువ ఎక్కువ. ఆయన వేదాంత విషయాలకు సంబంధించి వ్యాసాలు కూడా వ్రాసేవాడు. తాను ఒకసారి బాబా దర్శనానికి వచ్చాడు. దర్శనం చేసుకొని కూర్చొన్న తరువాత, అనంతరావు “బాబా, నేను ఎన్నో పుస్తకాలు చదివాను. కానీ మనసుకు స్థిరత్వం రావడం లేదు. మనసు సమాధానం చెందడం లేదు" అని బాబాను ప్రార్థించాడు. అప్పుడు బాబా “ఒకసారి ఇక్కడకు ఒక గుఱ్ఱం వ్యాపారి వచ్చాడు. అప్పుడు ఒక గుఱ్ఱం తొమ్మిది లద్దెలను వేసింది. అప్పుడు ఆ వ్యాపారి ఆ లద్దెలను మూట కట్టుకొని తీసుకువెళ్ళాడు” అని అన్నారు. బాబా మాటలలోని అర్థం అనంతరావుకి బోధపడలేదు. తాను వాడాకు వచ్చిన తరువాత దాదాకు విషయం చెప్పి “బాబా మాటలకు అర్ధం  ఏమిటి” అని అడిగాడు. అప్పుడు దాదా “నాకు మాత్రం ఏం తెలుసు. కానీ తొమ్మిది లద్దెలంటే బహుశః నవవిధ భక్తులు కావచ్చు. వాటిని మూట కట్టుకొని పోవడం అంటే బాబా ఇచ్చిన ఉపదేశాన్ని తీసుకోవడం కావచ్చు" అని సమాధానం ఇచ్చాడు. మరుసటిరోజు అనంతరావు బాబా దర్శనానికి  వెళ్ళాడు. అప్పుడు బాబా తననుతొమ్మిది లద్దెలను మూట కట్టుకున్నావా లేదా?", అని అడిగారు. అప్పుడు అనంతరావు బాబా చరణాలకు నమస్కరించి “మీ కృప ఉంటే ఆ తొమ్మిది లద్దెలు హస్తగతమవుతాయి” అని ప్రార్థించాడు. అప్పుడు బాబా అనంతరావుని ఆశీర్వదించి, అభయం ప్రసాదించారు. సారాంశమేమిటంటే భక్తి లేనిదే చిత్తానికి స్థిరత్వం మరియు సమాధానం లభించవు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo