ఈరోజు భాగంలో అనుభవాలు:
- బాబా ఆశీస్సులతో రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చాయి
- బాబా నా ప్రేమను గెలిపించారు
బాబా ఆశీస్సులతో రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చాయి
యు.ఎస్. నుండి పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను బాబాకు చాలా సాధారణ భక్తురాలిని. ఎప్పుడూ నా సంతోషం కోసం, ప్రాపంచికమైన కోరికల కోసం బాబాను సతాయిస్తూ ఉంటాను. అలా ఉండకూడదని తెలిసినా నేను అడగకుండా ఉండలేకపోతున్నాను. "ప్లీజ్.. ప్లీజ్ బాబా, నన్ను క్షమించండి!"
గత రెండు సంవత్సరాల్లో నేను తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చాలా బాధపడ్డాను. నాతోపాటు నా కుటుంబసభ్యులు కూడా ఇబ్బందిపడ్డారు. ఇక్కడ యు.ఎస్.లో డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరకడం అంత సులువు కాదు. అందువలన నేను చికిత్స కోసం ఇండియా వెళ్ళాను. కొన్నిరోజుల పాటు అక్కడ ఉన్నాక నా ఆరోగ్యం కుదుటపడటంతో నేను తిరిగి యు.ఎస్. వచ్చాను. తీరా ఇక్కడకు వచ్చాక మళ్లీ వ్యాధి లక్షణాలు కనిపించటం మొదలయ్యాయి. దాంతో డాక్టర్ వద్దకు వెళితే ఆయన, "వ్యాధి మళ్లీ మొదలైంది. మంచి నైపుణ్యవంతుడైన స్పెషలిస్టుని సంప్రదించండ"ని చాలా భయపెట్టాడు. కొన్నిరకాల బ్లడ్ టెస్టులు చేయించి, మందులిచ్చి పంపించారు. ఇక నేను భయంతో, "బాబా! ఈ మందులతో అంతా నయమైపోయి నా ఆరోగ్యం మామూలు స్థితికి వచ్చేలా చూడండి. ఇంక ఎటువంటి టెస్టులు లేకుండా కూడా చూడండి" అని ప్రార్థించాను. కొన్నిరోజుల తర్వాత హాస్పిటల్ నుండి డాక్టర్ని కలవమని ఫోన్ వచ్చింది. ఏం చెప్తారో ఏమిటోనని టెన్షన్‌తో బాబాను తలచుకుంటూ హాస్పిటల్‌కి వెళ్ళాము. మేము ఆశ్చర్యపోయేలా డాక్టర్, "రిపోర్టులలో అంతా నార్మల్‌గా ఉంది. స్పెషలిస్టుని సంప్రదించాల్సిన అవసరం లేదు" అని చెప్పారు. ఇది నాకు మిరాకిల్ కన్నా తక్కువేం కాదు. ఇదంతా బాబా ఆశీర్వాదాలతోనే సాధ్యమైంది. "బాబా! ఎప్పుడూ మీకు ఋణపడి ఉంటాం. ఇకపై ఏ మందులు అవసరం లేకుండా నా ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చూడండి. రిపోర్టులు ఎలా అయితే నార్మల్ అని వచ్చాయో అలాగే నా శరీరం కూడా నార్మల్‌గా ఉండేలా చూడండి. మా ఫ్రెండ్స్ మధ్య కాస్త ఇబ్బందులు ఉన్నాయి. వాటిని తొలగించి వాళ్ళందరూ సంతోషంగా ఉండేలా చూస్తారని ఆశిస్తున్నాను. దయచేసి నా తల్లిదండ్రులకు ఒక స్వంత ఇంటిని అనుగ్రహించండి. నా కోరికలు కూడా మీకు తెలుసు, వాటిని కూడా నెరవేర్చండి. బాబా! మా కష్టాలు, సుఖాలు, పాపం, పుణ్యం, గర్వం, అహంకారం, కామం, క్రోధం సమస్తం మీ పాదాల చెంత సమర్పిస్తున్నాను. మీ పాదాలే మాకు శరణం.
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా నా ప్రేమను గెలిపించారు
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నేను బాబాకు చాలా చిన్న భక్తురాలిని. బాబా తప్ప ఇతర దేవతల గురించి నాకంతగా తెలీదు. నేనెప్పుడూ బాబా పాదాల చెంతనే ఉండాలని ఆశిస్తున్నాను. ఎన్నో సందర్భాలలో ఆయన ఆశీస్సులు అనుభూతి చెందాను. బాబా కృపవలన మా తల్లిదండ్రుల ఆశీస్సులతో నేను ప్రేమించిన వ్యక్తితో నా పెళ్లి జరిగింది. అయితే మా ప్రేమ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. పన్నెండు సంవత్సరాలు మేమిద్దరం ఎంతో క్షోభను అనుభవించాము. అసలు నా ప్రేమ గెలుస్తుందని నేను అనుకోలేదు. కానీ, బాబా నా ప్రేమని గెలిపించారు. బాబా ఉంటే ఏదైనా సాధ్యమే. ఆయన మనల్ని ఎప్పుడూ క్రుంగిపోనివ్వరు.
12 ఏళ్ల క్రితం నేను మొదటిసారిగా మా వారిని ఆఫీసులో చూశాను. నేను తన వైపుకి ఎంతగానో ఆకర్షింపబడ్డాను. అయితే మావాళ్లు నా ప్రేమకు సమ్మతించరని నాకు మొదట్లోనే తెలుసు. కానీ వాళ్ళని ఎలాగైనా ఒప్పించగలననే నమ్మకంతో నా ప్రేమను ముందుకు కొనసాగించాను. తన తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ఇష్టపడి మా పెళ్ళికి అంగీకరించారు. కానీ నా తల్లిదండ్రులు నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే మా పెళ్లిని వ్యతిరేకించారు. వాళ్ల వ్యతిరేకత ఒకటికాదు, రెండుకాదు, 12 సంవత్సరాలపాటు కొనసాగింది. ఆ కాలంలో మేము చాలా కష్టాలు ఎదుర్కున్నాం. మా పెళ్ళికి పెద్ద అండ అయిన తన నాన్నగారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. వ్యక్తిగత కారణాలు మరియు ఉద్యోగ సంబంధమైన నిబద్ధతల కారణంగా నాలుగైదు సంవత్సరాలు మేము ఒకరికొకరు దూరంగా వేరు వేరు దేశాలలో/నగరాలలో ఉండాల్సి వచ్చింది. మా ఇద్దరి వయస్సు దాదాపు 35 సంవత్సరాలు సమీపిస్తుండటంతో అటు సమాజపరంగా, ఇటు తల్లిదండ్రుల వైపునుండి మేమిద్దరం చాలా ఒత్తిడి ఎదుర్కోవలసి వచ్చింది. నేను ఎందరో దేవతలను, "మాకు సహాయం చేయమ"ని ప్రార్థించాను. కానీ, ఎటువైపునుండీ కూడా సానుకూలమైన స్పందన రాలేదు. ఎన్నో సమస్యలతో 3 నుండి 4 సంవత్సరాల పాటు తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను. కానీ భగవంతుని కృపవలన మావారు ఏ ఒక్క క్షణమూ వెనకడుగు వేయలేదు. తను చాలా నిబద్ధతగా ఉన్నారు.
అటువంటి పరిస్థితుల నడుమ ఒక మిరాకిల్ లా బాబా నా జీవితంలోకి ప్రవేశించారు. ఒకరోజు నేను పనిచేసుకుంటూ టి.వి.లో ఛానల్స్ మారుస్తున్నాను. అనుకోకుండా ఒక చోట నాకు తెలియకుండానే నేను ఆగిపోయాను. ఆ ఛానల్లో సాయిబాబా సీరియల్ ప్రసారమవుతోంది. చేస్తున్న పనిని పక్కన పెట్టి ఆ సీరియల్ లోని సన్నివేశాలు చూస్తూ ఉండిపోయాను. నాకు తెలియకుండానే బాబా వైపుకు నేను ఆకర్షింపబడ్డాను. ఆ క్షణంనుండి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. మరుసటిరోజు బాబా ఫోటో కూడా లభించింది. వెంటనే ఆయనను పూజించడం మొదలుపెట్టాను. పిచ్చుక కాలికి దారం కట్టి తన దగ్గరికి లాక్కున్నట్లు తనంతట తానుగా బాబా నన్ను తమ దగ్గరికి తీసుకున్నారు. అప్పటినుండి బాబాను పూజిస్తూ, సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఆయన చెప్పినట్లు నడుచుకుంటూ ఉన్నా కూడా రెండు మూడేళ్లు చాలా కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. చివరికి నేను అనుకున్నది పొందుతానో లేదోనని చాలాసార్లు నిరాశపడ్డాను కూడా. కానీ బాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైటు ద్వారా సానుకూలమైన సమాధానాలిస్తూ నన్ను సరైన మార్గంలో నడిపిస్తూ ఉండేవారు.
అలా దాదాపు 11 సంవత్సరాలు దాటిన తర్వాత హఠాత్తుగా పరిస్థితుల్లో మార్పు కనిపించింది. నా తల్లిదండ్రులు నా పెళ్లి విషయంలో వ్యతిరేకించడం మానుకుని, అయిష్టంగానే వివాహానికి సమ్మతి తెలిపారు. ఆ నిర్ణయం వలన కుటుంబసభ్యుల మధ్య గొడవలు చోటుచేసుకుని ఇంటిలో విషాదం అలుముకుంది. కానీ ముహూర్తం దగ్గరపడుతున్నకొద్దీ పరిస్థితులు చక్కబడుతూ వచ్చాయి. చివరికి సుదీర్ఘమైన నిరీక్షణ తరువాత మా రెండు కుటుంబసభ్యులందరి సమక్షంలో మా కులాంతర వివాహం ఆర్భాటంగా జరిగింది. నెలరోజుల తర్వాత జరిగిన రిసెప్షన్‌లో ఇరువైపుల కుటుంబసభ్యులంతా కలిసి మెలిసి ఆడిపాడారు. అస్సలు ఇష్టం లేని మా అమ్మ కూడా ఇతర కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆడిపాడింది. మా ఈ వివాహం నిజంగా బాబా మిరాకిలే. నిజంగా అటువంటి రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు కానీ, బాబా ఆశీస్సులతో అది సాధ్యమైంది.
కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న భక్తులంతా శ్రద్ధ, సబూరితో బాబా ఇష్టానికనుగుణంగా జీవితాన్ని సాగించండి, తప్పక మీ ప్రార్థనలను బాబా నెరవేరుస్తారు. "బాబా! నా ప్రేమను గెలిపించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ మీ దివ్యపాదాల చెంత నాకు స్థానాన్ని కల్పించండి. మీ బిడ్డలందరినీ చల్లగా ఆశీర్వదించి, వాళ్ల బాధలను తీర్చండి".