కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 33వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 53
శ్రీ సదాశివ్ ఘుండిరాజ్ ఉరఫ్ సాధుభయ్యానాయక్ గారు, హార్ధా నివాసి.
6-8-15న వ్రాసిన ఉత్తరం
ఆదివారం బాబాకు నైవేద్యం చేయడం జరిగింది. మరుసటి రోజు అంటే సోమవారం, ఫిబ్రవరి 15వ తారీఖున శ్రీమంత్ చోటూభయ్యా సాహెబ్ పరూళ్ కర్ గారి ఇంట్లో ఇద్దరు సోదరులతో కలిసి బాబా ప్రసాదం సేవించి, తరువాత శ్రీ బాళక్ రామ్ గారు, శ్రీ సాధూభయ్యా మరియు శ్రీ శంకర్ భయ్యా (చోటూభయ్యా గారి చిన్న సోదరుడు) సహితంగా బాబా దగ్గరకు బయలుదేరారు. శ్రీ ముక్తారామ్ గారు మా గ్రామానికి (బ్రాహ్మణ్ గావ్) శ్రీ ఛోటూభయ్యాపారూళ్ కర్ , శ్రీ నారాయణరావ్ పారూళ్ కర్ సహితంగా బయలుదేరారు. మా గ్రామానికి నేను, శ్రీ ముక్తరామ్ గారితో కలిసి మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు చేరాము. శ్రీ ముక్తారామ్ గారు గ్రామానికి చేరగానే దర్శనం కోసం చాలా మంది వచ్చారు. మూడు, మూడున్నర గంటల వరకు దర్శనం చేసుకోని వెళ్ళారు. సరిగ్గా నాలుగు గంటలకు నేను, శ్రీ ముక్తరామ్ జీ మరియు శ్రీ నారాయ రావ్ పారూళ్కర్ గారు మాట్లాడుతూ కూర్చొనియుండగా ఉన్నట్టుండి నా చేతిలోకి తోముకునే కర్ర పుల్ల రాగానే గురుబంధువులందరికీ చూపించాను. బాబా యొక్క లీల మరియు మహత్యం చూసి మనసుకు ఎంతో ఆనందం వేసింది.
మరుసటిరోజు అందరితో కలిసి అంటే సోమవారం ఏడు గంటల ప్రాంతంలో శ్రీ పారుల్కర్ గారి తోట నుండి ఇంటికి వెళ్ళగానే, ఇంట్లో వారు "శిరిడీ నుండి శ్రీ మాధవరావు దేశ్ పాండే గారి ఉత్తరం వచ్చింది” అని చెప్పారు. నేను వెంటనే ఉత్తరం తీసుకొని పైకి వెళ్ళి బాబా (ఫోటో) చరణాల వద్ద కూర్చొని ఉత్తరం చదివాను. తరువాత ముక్తారామ్ జీ మరియు అందరికీ ఉత్తరం చదివి వినిపించాను. శ్రీ మాధవరావు వ్రాసిన ఉతరంలోని సారాంశం క్రింది విధంగా ఉంది. “మీకు ఉత్తరం వ్రాసి శ్రీ సాయి మహారాజ్ పిలిపించమని చెప్పారు. టెలిగ్రాం మాదిరిగా ఉత్తరం వెంటనే పంపించమని చెప్పారు. ఉత్తరం చేరిన వెంటనే మీరు బయలుదేరి రండి. ఇక్కడకు వచ్చి, ఏదైనా పని ఉంటే వెంటనే బయలుదేరి వెళ్ళండి. కాని ఉత్తరం చేరిన వెంటనే బయలుదేరి రండి!” ఉత్తరం చేరిన వెంటనే ఆరతి, అల్పాహారం వంటివి పూర్తి చేసుకుని 12 గంటలకు శ్రీ ముక్తారామ్ తో కలిసి స్టేషన్ కు వెళ్ళాము. మన్మాడ్ వరకు నేను, ముక్తరామ్ కలిసి వచ్చాము. మన్మాడ్ చేరుకున్నాక శ్రీ ముక్తారామ్ “నేను హార్ధాకు తిరిగి వెళతాను, ఇక్కడి నుండి ముందుకు రావడానికి బాబా ఆజ్ఞ లేదు, మీరు ఒక్కరే వెళ్ళండి” అని అన్నారు. తరువాత హార్ధాలోని పారూళ్కర్ గారికి టెలిగ్రాం ఇచ్చి, నేను శిరిడీ బయలుదేరాను. సుమారు 3 గంటల ప్రాంతంలో శిరిడీ చేరి, వాడాలో సామాను పెట్టాను. శ్రీమంత్ బూటీ అప్పుడు నిద్రపోతున్నారు. అక్కడ 5 నిముషాల విశ్రాంతి తరువాత, బాబా కోసం పూలహారం తీసుకొని శ్రీ మాధవరావ్ దేశపాండేను కలవడానికి వెళ్ళాను. ఆ సమయంలో ప్రియసోదరుడు మాధవరావ్ విష్ణుసహస్రనామం పారాయణ చేస్తున్నారు. వెంటనే ఆయన నన్ను తోడ్కొని బాబా దర్శనం కోసమై ద్వారకామాయికి తీసుకు వెళ్ళారు. నేను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసుకుని, బాబా మెడలో పూలమాల వేసి, బాబా చరణ సేవ చేసుకుంటూ కూర్చొన్నాను. ఐదు నిముషాలకు - కొబ్బరి మరియు ఒక పేడా ఇచ్చి తినమని చెప్పారు. తరువాత నన్ను వాడాకు తీసుకువెళ్ళమని మాధవరావు కి చెప్పారు. వాడాకు వచ్చిన తరువాత స్నానం చేసి, భోజనం చేసాను. భోజనం పూర్తి అయిన తరువాత శ్రీ బాపూసాహెబ్ బాబా లీలలను ముచ్చటిస్తూ కూర్చొన్నాను. మరుసటి రోజు బడేబాబా, డాక్టర్ పిళ్ళై మొదలైనవారు నన్ను బాబా లీలలను వివరించమని చెప్పారు. మొత్తం జరిగిన విషయమంతా మీ ఉత్తరం వ్రాసినప్పటి నుండి శిరిడీకి చేరినంత వరకు వివరించాను. తరువాత ఆ లీలలను బాబా మన హృదయంలో ఎటువంటి మార్పు తీసుకువస్తారోననే విషయం మాధవరావు వివిధ ఉదాహరణలతో వివరించారు. బాబా నన్ను పదిరోజులు తమ వద్దే ఉంచుకున్నారు. తరువాత సెలవు ప్రసాదించారు. ఇక్కడ బాబా మఠంలో 8 రోజులు పూర్తయ్యాయి. శ్రీ ముక్తారామ్ జీ మరియు బాలక్ రామ్ జీ ఇద్దరు సోదరులు ఇక్కడే ఉన్నారు. నిత్యనియమంగా బాబా యొక్క ఉదయం, సాయంత్రం ఆరతులు మరియు కాకడ ఆరతి జరుగుతూ ఉన్నాయి. ఆరతికి చాలామంది జనం వస్తారు. ఇద్దరు సోదరులు మా ఇంట్లో ఉండేందుకు బాబా ఆజ్ఞ అయింది. ఆ విధంగా హార్ధాను బాబా పుణ్యక్షేత్రం శిరిడీగా మార్చారు.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
I could not resist commenting. Perfectly written! I could not resist commenting.
ReplyDeleteExceptionally well written! I really love your website.. Pleasant colors & theme.
Did you develop this website yourself? Please reply back
as I'm planning to create my own website and would like to find out where you got this from or just what the theme is named.
Thank you! http://alienware.com
yes with baba's guidence id developed this blog, inspite i don't have any knowledge in that field. it was purely baba's grace.
DeleteHi there! Would you mind if I share your blog with
ReplyDeletemy facebook group? There's a lot of folks that I think would really appreciate your content.
Please let me know. Cheers
సంతోషంగా షేరు చేసుకోండి. మన సాయి భక్తులందరికీ ఈ బ్లాగు చేరువకావాలి. తద్వారా అందరూ బాబా ప్రేమలో ఓలలాడాలి.
Delete