కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 21 వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
మనసుకు అనిపిస్తే శ్రీసాయిబాబా తమ దర్బారులో కూర్చొన్న భక్తులకు ఎంతో ఆనందంగా, అనేక విషయాలను చెప్పేవారు. వాటిలో కొన్నింటిని క్రింద ఇవ్వడం జరిగింది.
అనుభవం - 22
ఒక రైతు కుమారుడు ఉండేవాడు. తాను వాడాకు వచ్చాడు. తాను ఇక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. పన్నెండు సంవత్సరాలు ఉన్నాక రోదించసాగాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడానికి ఏడ్వసాగాడు. అప్పుడు బాదుషా తనతో “మనకు చాలా వాడాలు ఉన్నాయి, వాటిలోని ఒక వాడాలో ఉండు” అని చెప్పారు. ఒక వాడాను తనకు ఇచ్చారు. తాను మరలా ఏడ్వసాగాడు. అప్పుడు బాదుషా తన కూతురినిచ్చి వివాహం చేసాడు. తనకు పిల్లలు పుట్టలేదని మరలా ఒక రైతు కుమార్తెనిచ్చి వివాహం చేసాడు. అయినాసరే మరలా రోదించసాగాడు. బాదుషా తనకు ఎంతో చెప్పి చూసాడు. అయినా సరే తాను వెళ్ళిపోయాడు. అప్పుడు బాదుషా తనకు కొంత డబ్బును ఇచ్చాడు. కారణం బాదుషా ఎంతో గొప్పవాడు. ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది.
(పై గోష్ఠికి కాకాసాహెబ్ క్రిందివిధంగా తాత్పర్యం ఇచ్చారు.)
తాత్పర్యం:- బాదుషా ఇంత జీవనం ఇచ్చాడు. వాడాను ఇచ్చాడు. తన కూతురిని ఇచ్చాడు. అయినప్పటికీ తల్లితండ్రుల వద్దకు వెళ్ళే అంటే సంసారంలో పడే కోరిక నశించలేదు. బాద్షా ఎంతో గొప్పవాడు కాబట్టి తనకు కొంత ద్రవ్యాన్ని ప్రసాదించారు. ఆ బాదుషా మాట విని ఉంటే, అక్కడే ఉండి ఉంటే తనకు రాజ్యం దక్కేది.
అనుభవం - 23
నలుగురు సోదరులు ఉండేవారు. వారిలో ఇద్దరు ఒక గ్రామానికి వెళ్ళారు. వారు రైతులు. అక్కడ ఒక తెలివైన అమ్మాయి ఉంది. ఆమె కబీర్ పంక్తికి చెందినది. అక్కడ వారు కొన్ని సామానులు తీసుకున్నారు. తరువాత వారు ఆ అమ్మాయికి సైగ చేసారు. ఆ అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయిని తీసుకొని వారు మా గ్రామానికి వెళ్ళారు. నేను చిన్నవాడిని. నేను కూడా వెంటవెళ్ళాను. గ్రామానికి వెళ్ళాక గ్రామస్థులు అందరూ విచారణ చేసి భయపెట్టారు. అప్పుడు వారిద్దరూ ఆ అమ్మాయిని తీసుకొని ఒక పర్వతానికి వెళ్ళారు. నేను కూడ వెనకాలే వెళ్ళాను. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టారు. తరువాత తన తల్లిదండ్రులను వెదకసాగారు. అమ్మాయిని తీసుకువెళ్ళు మరియు ఈ పిల్లలను చంపేయ్ అని కొందరన్నారు. అప్పుడు “అమ్మాయికి పిల్లలు పుట్టారు, ఇక ఉండనీ” అని తల్లిదండ్రులన్నారు.
అనుభవం - 24
ఒక వ్యాపారస్థుడు ఉండేవాడు. తాను నెయ్యితో మూడు పెద్ద గిన్నెలను నింపాడు. నా ముసలివాడు దగ్గరే ఉన్నాడు. తాను ఏమన్నాడంటే “నా ముందర ఆ పాత్రలను పెట్టినట్లయితే నేను నేతినంతా ఒక్కడినే తింటాను” అని! ఇంతలో వ్యాపారస్తుని సోదరుడు తనను భోజనానికి పిలిచాడు. వ్యాపారస్తుడు ఆ నెయ్యి పాత్రలను దుకాణంలో పెట్టి తాళం వేసాడు. నా ముసలివానితో ఆ వ్యాపారస్థుడు “నేను భోజనం చేసి వచ్చానంటే నీకు శనగలను ఇస్తాను” అని అన్నాడు. నేను వృద్దుని దగ్గరే ఉన్నాను. ఇంకో ఇద్దరు కుర్రవాళ్ళు ఉన్నారు. వెనుకవైపు గోడ కొంచెం పడిపోయి ఉంది. వారిద్దరిలో ఒకరు ఆ గోడను విపరీతంగా కొట్టడంతో ఆ గోడ పడిపోయింది. ఏ అడ్డు లేకుండా అంతా ఖాళీ అయిపోయింది. అప్పుడు ఆ ఇద్దరు కుర్రాళ్ళు రెండు పాత్రలలోని నెయ్యిని త్రాగేస్తారు. వృద్దుడు సైగ చేయడంతో మూడవ పాత్రలోని నేతిని నేను త్రాగేసాను. దుకాణదారుడు తిరిగి రాగానే నేను నేతి విషయం చెప్పాను. దుకాణదారుడు చూస్తే బంగారం వంటివి కూడా అదృశ్యమయ్యాయి. అప్పుడు మమ్మల్నందరినీ చావడి వద్దకు తీసుకువెళ్ళాడు. అసలు దొంగ దొరకగానే మమ్మలు వదిలేస్తారు. తరువాత మాకు విరోచనాలు కాసాగాయి. ఆ మొత్తం నేతిని విరోచనం చేసుకోసాగాము. అప్పుడు నా వృద్దుడు నన్ను శుభ్రం చేసాడు. ఆ వ్యాపారస్థు తరువాత రెండు సంవత్సరాలు నాకు అన్నం పెట్టాడు.
(గమనిక: బాబా పలుకులు నిగూఢంగా ఉంటాయని మనకు తెలుసు. కానీ అవి ఎవరికి అర్ధం కావాలో వాళ్ళకి అర్ధం అవుతాయి. ఈరోజు దీక్షిత్ డైరీలో అనుభవాలు ఇంకా లోతైన అర్ధంతో కూడుకున్నవి. అయితే అవి ఎవరికి ఏ రీతిన సమాధానపరచబోతాయో మనం ఊహించలేం. ఆ దృష్ట్యా వాటిని ఉన్నది ఉన్నట్టు ప్రచురించాము. రేపటి భాగంలో నార్మల్ గానే ఉంటుంది.)
(గమనిక: బాబా పలుకులు నిగూఢంగా ఉంటాయని మనకు తెలుసు. కానీ అవి ఎవరికి అర్ధం కావాలో వాళ్ళకి అర్ధం అవుతాయి. ఈరోజు దీక్షిత్ డైరీలో అనుభవాలు ఇంకా లోతైన అర్ధంతో కూడుకున్నవి. అయితే అవి ఎవరికి ఏ రీతిన సమాధానపరచబోతాయో మనం ఊహించలేం. ఆ దృష్ట్యా వాటిని ఉన్నది ఉన్నట్టు ప్రచురించాము. రేపటి భాగంలో నార్మల్ గానే ఉంటుంది.)
తరువాయి భాగం రేపు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.