ఈరోజు భాగంలో అనుభవం:
- బాబా ఏర్పాటు చేసిన నా శిరిడీ ప్రయాణం
నిరుపమగారు మరొక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ నమస్కారం.
నేనిప్పుడు 2019 ఏప్రిల్ లో బాబా నాకిచ్చిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా పుట్టినరోజునాడు నేను శిరిడీలో ఉండేలా బాబా నన్ను ఆశీర్వదించారు. ముందుగా బాబాకి తమ ప్రార్థనలు పంపిన సాయిభక్తులందరికీ నా ధన్యవాదములు. మీ వల్లనే నాకు తరచూ శిరిడీ వెళ్లే భాగ్యం దక్కుతుంది. మీ అందరికీ నేను చాలా ఋణపడి ఉన్నాను. "బాబా! భక్తుల అభ్యర్థనలను మీకు చేరవేసే పోస్టుమ్యాన్ ఉద్యోగాన్ని నాకిచ్చి నన్నెంతగానో అనుగ్రహిస్తున్నారు. మీకు చాలా ధన్యవాదాలు".
మార్చి నెల మధ్యలో నాకు కొన్ని కలలు వచ్చాయి. వాటిలో రెండింటిలో నేను మా బంధువులతో కలిసి శిరిడీ వెళ్తున్నాను. వేరొక స్వప్నంలో నేను ఊదీ ప్యాకెట్లను చూస్తూ, నాకు ఇంకా ఎక్కువ ఊదీ ప్యాకెట్లు కావాలని ఆందోళపడుతున్నాను(బాబాకి విన్నవించమని తమ ప్రార్థనలు పంపిన సాయిబంధువులకు సరిపడా ఊదీ ప్యాకెట్లు సంపాదించడం ప్రతీసారి నాకొక సవాలుగా ఉంది). సరిగ్గా అదేసమయంలో ఒక వాట్సాప్ గ్రూపులో ఈ క్రింది మెసేజ్ వచ్చింది:
"మిమ్మల్ని ఎవరైనా శిరిడీకి తీసుకురాగలిగారంటే, అది నేనే! కేవలం నేను మాత్రమే!"
- సాయిబాబా
ఆ స్వప్నాల ద్వారా, ఈ మెసేజ్ ద్వారా బాబా నా శిరిడీ ప్రయాణం గురించి, ఊదీ ప్యాకెట్ల గురించి ఆందోళన చెందనవసరం లేదని సూచనలిస్తున్నారని నాకు అర్థమైన వెంటనే, "నేను నా పుట్టినరోజునాడు శిరిడీలో ఉండొచ్చా?" అని బాబాను అడిగాను. అందుకు బాబా నుండి అనుమతి లభించడంతో 'పుట్టినరోజునాడు నేను శిరిడీలో ఉండబోతున్నాన'ని నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ 'శిరిడీ ఎలా వెళ్లాలన్నది' నాకు సమస్య అయ్యింది. ఎందుకంటే, నేనుండే చోటునుండి శిరిడీకి బస్సులు లేవు. ఇక ట్రైన్ ఒక్కటే నాకున్న అవకాశం. కానీ, ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ నేను బాబాపై విశ్వాసంతో తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడానికి నిర్ణయించుకుని, భక్తులనుండి బాబాకు ప్రార్థనలను స్వీకరించడం మొదలుపెట్టాను. తరువాత ఒకరోజు ట్రైన్ టికెట్ గురించి ఆందోళనపడుతూ, 'భక్తులనుండి ప్రార్థనలను బాబాకి సమర్పించగలనా, లేదా?' అని చాలా కలత చెందాను. ఆ సమయంలో నేను శిరిడీకి వెళ్ళలేనేమో అని చాలా దిగులుగా కూడా అనిపించింది. మరుక్షణమే ఒక వాట్సాప్ గ్రూపులో ఈ క్రింది మెసేజ్ వచ్చింది:
"నా పిలుపుకోసం ఎదురుచూడవద్దు. నేను నీకోసం ఎదురుచూస్తున్నాను. నా దగ్గరకి త్వరగా రా! నువ్వు రావడానికి అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను." - సాయిబాబా
ఆ మెసేజ్ నా శిరిడీ ప్రయాణానికి బాబా ఇచ్చిన హామీగా భావించి ఎంతో ఊరట పొందాను. ఏప్రిల్ 10న రాత్రి తొమ్మిది గంటలకి ఉన్న ట్రైన్‌కి తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నాను. అదేరోజు నా స్నేహితురాలు ఒకరు, "నేను చాలా పెద్ద మొత్తాన్ని శిరిడీలో డొనేషన్ కట్టడానికి ఇస్తాను. దాని ద్వారా వచ్చే ఊదీ ప్యాకెట్లను నువ్వు వాడుకోవచ్చు" అని మెసేజ్ పెట్టారు. నేను తనకి కృతజ్ఞురాలినై ఉంటాను. బాబా తనని, తన కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ముందుగా స్వప్నం ద్వారా సూచించినట్లుగానే ఊదీ ప్యాకెట్ల సమస్యని బాబా పరిష్కరించేసారు. "థాంక్యూ సో మచ్ బాబా!"
నేనుండే చోటునుండి రైల్వేస్టేషనుకి చేరుకోవాలంటే గంట సమయం పడుతుంది. నేను ఎక్కాల్సిన ట్రైన్ మూడుగంటలు ఆలస్యమై అర్థరాత్రి ఒంటిగంటకి వస్తుందని తెలిసింది. అయినా అర్థరాత్రి వేళ స్టేషన్ చేరుకోవడానికి సమస్య అవుతుందని నేను ముందుగానే బయలుదేరాను. తీరా నేను 9.45 కి స్టేషన్ చేరుకున్నాక, ట్రైన్ వేకువఝామున 4 గంటలకి వస్తుందని తెలిసింది. ఇక చేసేదిలేక రాత్రంతా స్టేషన్లోనే గడిపాను. ఆ సమయంలో, 'శిరిడీలో ఎక్కువ సమయం గడపలేన'ని నాకు చాలా బాధగా అనిపించింది. అయితే అప్పటికి నేను నా తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోలేదు. 4 గంటలకి ట్రైన్ వస్తే ఎక్కి పడుకున్నాను. ఉదయం 8 గంటల సమయంలో మెలకువ వచ్చి చూస్తే మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. "ఇలా అయితే సరిగ్గా 10 గంటలకి మొదలయ్యే ఏసీ తత్కాల్ టికెట్ (రిటర్న్ టికెట్) నేనెలా బుక్ చేసుకోగలను?" అని ఆందోళన మొదలైంది. బాబా అద్భుతం చూడండి! సరిగ్గా 10 గంటలకి ట్రైన్ ఒక స్టేషనులో ఆగింది. అక్కడ నెట్ కనెక్టివిటీ చాలా బాగుంది. నేను ఏ ఇబ్బంది లేకుండా రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోగలిగాను. మొత్తానికి ఉదయం 11 - 11.30 మధ్య శిరిడీ చేరుకోవాల్సిన ట్రైన్ సాయంత్రం 4.30 గంటలకి చేరుకుంది. అనేక రకాల మానసిక ఆందోళనలతో చివరికి బాబా దయవల్ల శిరిడీ చేరుకోగలిగాను.
ముందుగా సమాధిమందిరానికి వెళ్లి బాబా ఇచ్చిన చక్కటి దర్శనంతో ఆనందంలో మునిగిపోయాను. ఆరోజు గురువారం కావడంతో పల్లకి ఉత్సవాన్ని చూసే అవకాశం కూడా నాకు దక్కింది. ముఖదర్శనం చేసుకునే చోట కూర్చుని పల్లకి సేవ అంతా చూసాను. మొదటిసారి పల్లకి సేవ చూసి నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. తరువాత శేజ్ ఆరతికి వెళ్ళాను. కాషాయవస్త్రాలలో బాబాని చూసి మనసుకెంతో ఆనందంగా అనిపించింది.
నేను సాధారణంగా కాకడ ఆరతిలో పాల్గొనడానికి ఎంతగానో ఇష్టపడతాను. అలాంటిది మరుసటిరోజు నా పుట్టినరోజుని కాకడ ఆరతితో మొదలుపెట్టడం నాకెంతో ఆనందంగా అనిపించింది. పైగా ఆరోజునుండే శ్రీరామనవమి ఉత్సవాలు మొదలవుతుండటంతో ఎంతో ఆహ్లాదకరమైన క్షణాలవి. తరువాత 3 దర్శనాలు చేసుకున్నాను. మధ్యాహ్న ఆరతికి, సాయంత్రం ధూప్ ఆరతికి హాజరయ్యాను. సాయిభక్తుల ప్రార్థనలను బాబా పాదాలవద్ద సమర్పించుకున్నాను. ఆవిధంగా పుట్టినరోజునాడు ఎక్కువభాగం సమాధిమందిరంలోనే గడిపాను. ఆరోజు ఉదయం ఒక బాబా గ్రూపులో ఈ క్రింది మెసేజ్ వచ్చింది:
“నా భక్తుల శ్రేయస్సుకోసం నేను ఊదీ పంచిపెడతాను. ఇంకా వేరువేరు రూపాల్లో కూడా వారికి ఊదీ చేరుస్తాను." -సాయిబాబా.
బాబా చేసిన లీల చూడండి. ఆశ్చర్యకరంగా మధ్యాహ్నం డొనేషన్ కౌంటర్ బయట ఒక ఊదీ ప్యాకెట్, సాయంత్రం గురుస్థాన్ దగ్గర మరొక ఊదీ పాకెట్ దొరికేలా ఏర్పాటు చేసి బాబా నన్ను ఊదీ పాకెట్లతో ఆశీర్వదించారు. సమాధిమందిరానికి దగ్గరలో కుర్చునివున్న పెద్దవారికి నేను పండ్లు, పానీయాలు పంచిపెట్టాను. శిరిడీ వెళ్ళేటప్పుడు ట్రైన్ ఆలస్యం అయినందుకు నేను చాలా చిరాకు పడ్డాను. కానీ, ఆ ట్రైన్ సరైన సమయానికి శిరిడీ వచ్చి ఉంటే నేను పుట్టినరోజునాడు పూర్తి సమయాన్ని శిరిడీలో గడపలేకపోయేదాన్ని. బాబా ప్రణాళికలు మనకెప్పటికీ అర్థంకావు.
నేను బాబాని గ్రీన్ డ్రెస్సులో దర్శనం ఇమ్మని అడిగాను. ఆ రెండురోజుల్లో బాబా పూర్తిగా గ్రీన్ డ్రెస్సులో లేకపోయినప్పటికీ, ఉదయం, మధ్యాహ్నం గ్రీన్ కండువా ధరించి ఉన్నారు. అలా బాబా నేను సమర్పించిన ప్రార్థనలు స్వీకరించారని నాకనిపించింది. మొదట బాబా పూర్తిగా గ్రీన్ డ్రెస్సులో లేకపోవడంతో కొంచెం కలత చెందినా, నన్ను వేర్వేరు విధాలుగా ఆశీర్వదించారని తరువాత తెలుసుకుని ఆనందపడ్డాను.
ఇక నేను తిరుగు ప్రయాణానికి ట్రైన్ ఎక్కాలంటే కోపర్గాఁవ్ స్టేషన్‌కి వెళ్ళాలి. నేను 8 గంటలకి బయలుదేరాను గానీ కొంతసమయం వరకు ఒక్క ఆటో కూడా దొరకలేదు. నేను ఒంటరిగా, నిస్సహాయస్థితిలో ఉన్నానని నాలో ఆందోళన మొదలయింది. ఇంతలో ఒక ఆటో వచ్చి నా ముందు ఆగింది. కానీ అందులో పూర్తిగా మగవాళ్ళు ఉన్నారు, నేను కూర్చునేందుకు చోటు కూడా లేదు. అయినా ఆటోడ్రైవర్ నన్ను ఆటో ఎక్కమని బలవంతపెట్టాడు. కానీ నేను అంగీకరించలేదు. మరికొంతసేపు ఎదురుచూడగా ఒక ఖాళీ ఆటో వచ్చింది. అయితే నేను ఒంటరిగా వెళ్లడానికి సందేహించాను. ఇంతలో ఒకతను వచ్చి ఆటో అతన్ని 'కోపర్గాఁవ్ స్టేషన్‌కి వెళ్తారా?' అని అడిగి, తన కుటుంబంతో పాటు ఆటోలో ఎక్కి కూర్చున్నారు. పైగా వాళ్ళు కూడా నేను వెళ్లే ప్రాంతానికే వెళ్తున్నారు అని తెలియడంతో నా మనసు కొంచెం తేలికపడి బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
అలా బాబా నా ప్రయాణం గురించి ముందుగా సూచించి, ఆయనే నా ప్రయాణాన్ని చక్కగా ప్లాన్ చేసి, ట్రిప్ అంతా జాగ్రత్తగా చూసుకున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ట్రిప్ తో బాబా నన్ను ఆశీర్వదించారు. "థాంక్యూ సో మచ్ బాబా!"