సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 175వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. మూర్ఖపు ఆలోచన - బాబా నేర్పిన పాఠం
  2. బాబా కృపతో ప్రెగ్నెన్సీ

మూర్ఖపు ఆలోచన - బాబా నేర్పిన పాఠం

సాయిభక్తురాలు విశాలాక్షి తనకు జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ఒకసారి మేము శిరిడీ వెళ్ళాము. మాతోపాటు మా చెల్లెలు కూడా వచ్చింది. తను చాలా మంచి సాయిభక్తురాలు. ప్రయాణసమయమంతా తను బాబా గురించి, ఆయన జీవనవిధానం గురించి, ఆయన చేసిన లీలల గురించి, ఆయన తన భక్తులపై చూపే శ్రద్ధ గురించి వివరంగా చెప్పింది. బాబా గురించి అంత వివరంగా తెలుసుకోవడం నాకదే మొదటిసారి. ఆ వివరణలో భాగంగా సాయిబాబా శిరిడీలో నివసించినంతకాలం కాళ్లకు పాదరక్షలు అస్సలు ధరించలేదని చెప్పింది. కొన్నిసార్లు అజ్ఞానంకొద్దీ మనలో కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ కోవకు చెందిన ప్రశ్నే నా మదిలో మెదిలింది. "బాబా పాదరక్షలు ధరించరు. అయితే అందులో అంత గొప్పేముంది?" అని మూర్ఖంగా అనుకున్నాను.

శిరిడీ చేరుకున్నాక ట్రైన్ దిగే సమయంలో నా చెప్పు ఒకటి పట్టాలమీద పడిపోయింది. మిగిలిన ఒక చెప్పుతో మాత్రం ఏమి చేస్తానని దాన్ని కూడా అక్కడే వదిలేశాను. దర్శనాలన్నీ బాగా జరిగాయి కానీ బాబా నాకు మంచి పాఠం నేర్పారు. "బాబా పాదరక్షలు ధరించకపోవడంలో అంత గొప్పతనం ఏముంది?" అని అనుకున్నందుకో ఏమోగానీ, నేను చెప్పులు కొనడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఏ షాపులోకి వెళ్లి అడిగినా నాకు సరిపడా నెంబర్ చెప్పులు లేవనే సమాధానమే ఎదురైంది. అసలే ఎండాకాలం, ఆ ఎండకి నా కాళ్లు కాలిపోతుంటే నేను చేసిన నా మూర్ఖపు ఆలోచన గుర్తుకొచ్చింది. అప్పుడు నేను ఎంత అవివేకంగా ఆలోచించానో అర్థమై, "నేను చేసిన పొరపాటును క్షమించమ"ని బాబాను వేడుకున్నాను.

తరువాత బాబా పాదుకలను పల్లకిలో పెట్టి పల్లకి ఉత్సవం చేస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ దర్శనభాగ్యంతో నా మనసులోని ఆలోచనలన్నిటికీ ఏదో సమాధానం దొరికినట్లయింది. బాబా భగవంతుడి అవతారమని, శిరిడీ క్షేత్రం ఆ మహారాజు పవిత్ర పాదస్పర్శతో పునీతం అయ్యిందని, ఆ మహాత్ముడు తాకిన పవిత్ర నేలను నా పాదరక్షలతో అపవిత్రం చేయకుండా నాకు సరైన శాస్తి చేశారని నాకనిపించింది. నాలో వచ్చిన ఆ చెడు ఆలోచన వలన కూడా నాకు మంచే జరిగింది. శిరిడీలో ఉన్నన్ని రోజులూ పాదరక్షలు లేకుండా బాబా నన్ను ఉంచటం తలుచుకుంటుంటే నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది.

బాబా కృపతో ప్రెగ్నెన్సీ

సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. ముందుగా సాయిభక్తులందరితో మా భావాలను పంచుకునేందుకు మంచి వేదికను అందించినందుకు మీకు, మీ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నా అనుభవాన్ని పంచుకోవడం ఇదే మొదటిసారి. 

నాకు 2010లో వివాహం అయ్యింది. 2011 నుండి మేము పిల్లలకోసం ప్రయత్నిస్తున్నాము. అయితే దాదాపు 7 సంవత్సరాల వరకు మాకు అదృష్టం కలిసి రాలేదు. నేను బాబాను ఎంతగానో ప్రార్థించాను. నవగురువార వ్రతం, సచ్చరిత్ర పారాయణ చేశాను. కానీ బాబా మమ్మల్ని ఆశీర్వదించడానికి తగినంత సమయాన్ని తీసుకున్నారు. ఆ కాలంలో మేము వైద్యులను సంప్రదిస్తుండేవాళ్ళం. వైద్యులు నన్ను, మావారిని క్షుణ్ణంగా పరిశీలించి అంతా నార్మల్ గా ఉందని చెప్తుండేవారు. మేము ఫెర్టిలిటీ స్పెషలిస్టులను కూడా సంప్రదించాము. వాళ్ళు మరికొన్ని పరీక్షలను కూడా చేసి, వాళ్ళు కూడా అంతా నార్మల్ గా ఉందని చెప్పి IUI (ఇంట్రా యుటెరిన్ ఇన్‌సెమినేషన్) (కృత్రిమ గర్భధారణ) పద్ధతి ద్వారా ప్రయత్నించమని సూచించారు. సరేనని ఆ పద్ధతి ద్వారా 4 సార్లు ప్రయత్నించినప్పటికీ నేను గర్భం దాల్చలేదు. వైద్యులు మరొకసారి IUI చేయడం వల్ల ఉపయోగంలేదని, IVF(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియ ద్వారా ప్రయత్నించమని చెప్పారు. సరేనని ఆ ప్రయత్నం కూడా చేశాము. కానీ మాకు నిరాశే మిగిలింది. అవి మా జీవితాలలో చాలా బాధాకరమైన రోజులు. "నన్ను ఎందుకిలా శిక్షిస్తున్నారు బాబా?" అని చాలా ఏడ్చాను. చివరికి నాకింకా సమయం రాలేదని నన్ను నేను ఓదార్చుకున్నాను.

ఇక మేము మా ప్రయత్నాలకు విరామం ఇచ్చి, సహజ పద్ధతిలో గర్భధారణకోసం రెండేళ్ళు ప్రయత్నించాము. అప్పటికీ మాకు అదృష్టం కలిసి రాలేదు. ఆ సమయంలో కూడా నేను, "గర్భవతిని అయ్యేలా నన్ను ఆశీర్వదించండి బాబా" అని ప్రార్థిస్తూ, ప్రతి 6 నెలలకొకసారి నేను, నా భర్త అన్ని పరీక్షలు చేయించుకుంటూ ఉండేవాళ్ళం. ఇద్దరి రిపోర్టులు నార్మల్ గానే వచ్చేవి గాని, ప్రతి సంవత్సరం నా AMH స్థాయిలు తగ్గిపోతూ ఉండేవి. 2 సంవత్సరాలు గడిచాక మరొకసారి IVF ప్రక్రియకి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. IVF కు వెళ్లడానికి రెండునెలల ముందు ఒక గురువారంనాటి తెల్లవారుఝామున నేను ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు కల వచ్చింది. అప్పుడు నేను క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో బాబాని అడిగితే, "మీ కలలు నెరవేరుతాయి" అని వచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. తరువాత మేము రెండవసారి IVF కోసం వెళ్ళాము. కానీ ప్రతికూల ఫలితమే మళ్ళీ ఎదురైంది. AMH స్థాయి తగ్గిపోతుంది కాబట్టి 'డోనర్ ఎగ్' కోసం ప్రయత్నించమని డాక్టర్ సూచించారు. మేము బాగా విసుగుచెందిన కారణంగా రెండునెలల తర్వాత బిడ్డని దత్తత తీసుకోవడంగాని, 'డోనర్ ఎగ్' కోసం ప్రయత్నించడంగాని చేద్దామని నిర్ణయించుకున్నాము. కానీ బాబా దయవల్ల నేను మరుసటి నెలలోనే సహజంగా గర్భం దాల్చాను. అన్ని సంవత్సరాల నా కల బాబా నెరవేర్చారు. ఆ కాలమంతా ఎంతో బాధతో కూడుకున్నదైనప్పటికీ చివరికి బాబా మాకు సంతోషాన్నిచ్చారు. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రెగ్నెన్సీ కాలమంతా సాఫీగా సాగి చక్కటి బిడ్డకి జన్మనిచ్చేలా అనుగ్రహించండి. నన్ను, నా బిడ్డని, మా తల్లిదండ్రులని ఆశీర్వదించండి బాబా". 

sourcehttp://www.shirdisaibabaexperiences.org/2019/07/shirdi-sai-baba-miracles-part-2413.html

7 comments:

  1. Sri sachchidananda sadguru sainath maharaj ki jai subam bavat

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం జీ 🙏

    ReplyDelete
  3. 💐💐 Om Sairam💐💐

    ReplyDelete
  4. Om sai ram, amma nannalani Ammamma tataya ni anni velala kshamam ga ayur arogyalatho kapadandi tandri vaalla purti badyata meede tandri, Nenu Kedarnath vellataniki ye atankam rakunda chusukondi baba pls, naaku manchi arogyanni echi, ofce lo ye problem lekunda chusukondi baba, naaku unna anni problems ki neeve ma dikku tandri.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo