ఈ భాగంలో అనుభవాలు:
- సదా సాయి రక్షణ
- ఎం.ఆర్.ఐ. స్కాన్ విషయంలో బాబా చూపిన కృప
సదా సాయి రక్షణ
నా పేరు శ్రీనివాసరావు. మా జీవితంలో ప్రతిక్షణం నా తండ్రిసాయి మాకు తోడుగా ఉంటూ మా అందరినీ రక్షిస్తూ ఉన్నారు. ఒకసారి ఇంటర్మీడియట్ పరీక్షలకు మార్టూరులోని జి.జె.సి కళాశాలలో నాకు డిపార్ట్‌మెంటల్ ఆఫీసరుగా డ్యూటీ వేశారు. నా విధులననుసరించి నేను ఉదయం గం. 8.15 ని.లకి మార్టూరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని గం. 8.30 ని.ల కల్లా కాలేజీకి వెళ్ళాలి. 9.00 గంటలకు విద్యార్థులకు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి, వాళ్ళు పరీక్ష వ్రాసే విధంగానూ మరియు పరీక్ష జరిగే సమయంలో ఎటువంటి అవాంతరాలు జరగకుండానూ చూడవలసిన బాధ్యత నామీద ఉన్నది. ఇదంతా చాలా కాన్ఫిడెన్షియల్ వర్క్. అంతా టైం ప్రకారం జరగాలి. అందులో ఏ చిన్న పొరపాటు జరిగినా పైఅధికారులు మాపై చర్యలు తీసుకుంటారు. మూడవ పరీక్ష జరగాల్సిన రోజు ఉదయం నేను ఇంటినుండి సరైన వేళకే బయలుదేరాను. కానీ బస్సు ఆలస్యంగా అందింది. నేను చిలకలూరిపేటలో దిగి, వేరే బస్సు ఎక్కి మార్టూరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి అరగంట సమయం పడుతుంది. అందువలన గం. 8.15 ని.ల కల్లా నేను పోలీస్ స్టేషన్లో ఉండగలనా అని చాలా కంగారుపడుతూ, "బస్సు దిగిన వెంటనే మార్టూరు వెళ్ళే బస్సు దొరికేటట్లు చేయమ"ని బాబాను ప్రార్థిస్తూ వెళ్లాను. నేను చిలకలూరిపేట చేరుకునేసరికి సరిగ్గా 7.45 అయ్యింది. విచిత్రంగా, రోజూ 7.30కే వెళ్లిపోయే మార్టూరు బస్సు ఆరోజు నేను బస్సు దిగేవరకు అక్కడే ఉండి, నేను బస్సెక్కాక బయలుదేరింది. ఇదంతా నా సాయి ఏర్పాటు. సమయానికి నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లగలిగేటట్లు చేసి నాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా బాబా చూశారు. బాబా చేసిన సహాయానికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఒకసారి నాకు జలుబు చేసి, కఫం పట్టి రెండు, మూడు రోజులు గొంతు చాలా ఇబ్బందిపెట్టింది. అప్పుడు నేను, "ఊదీతో నాకు నయమయ్యేలా చేయమ"ని బాబాను ప్రార్థించి బాబా ఊదీని నోటిలో వేసుకున్నాను. పరమౌషధమైన ఊదీ ప్రభావం వల్ల మరుసటిరోజుకే నా సమస్య తగ్గిపోయింది. ఈవిధంగా బాబా ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటూ రక్షిస్తున్నారు. ఆయన చూపే ప్రేమకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలుపుకునేది, ప్రతిక్షణం మనసారా ఆయనను ప్రార్థించడం తప్ప?
శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కీ జై!
(మునపటి నా అనుభవాలు చదవాలనే వారికోసం:
బాబా నా జీవితాన్ని మార్చిన ఘటన - https://saimaharajsannidhi.blogspot.com/2019/07/120.html

మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన శ్రీసాయి - https://saimaharajsannidhi.blogspot.com/2019/01/blog-post_2.html)
ఎం.ఆర్.ఐ. స్కాన్ విషయంలో బాబా చూపిన కృప
నా పేరు విజయ. నేను సింగపూరులో ఉంటున్న ఒక చిన్న సాయిభక్తురాలిని. ఒకసారి నా భర్తకు వెన్నునొప్పి వచ్చింది. డాక్టర్లు ఎం.ఆర్.ఐ. స్కాన్ చేయించమని సూచించారు. కానీ మావారు ఒక క్లాస్ట్రోఫోబిక్(హాస్పిటల్ అన్నా, ట్రీట్మెంట్స్ అన్నా భయపడే వ్యక్తి). ఎలాగో ధైర్యం చేసి తను రెండుసార్లు ఎం.ఆర్.ఐ. కోసం వెళ్ళారు. కానీ రెండుసార్లూ భయంతో మెషీన్ నుండి బయటకు వచ్చేశారు. మరుసటిరోజు తను మళ్ళీ వెళ్లినప్పుడు నేను కూడా తనతోపాటు వెళ్ళాను. బాబా దయవల్ల ఈసారి స్కానింగ్ పూర్తయింది, కానీ రిపోర్ట్స్ ప్రతికూలంగా వచ్చాయి. డాక్టర్స్ రెండు సమస్యలను గుర్తించారు. ఒకటి డిస్కు గురించి అనుమానించదగినది. మరొకటి అస్సలు ఊహించనిది, తల వెనుక భాగంలో ఒక గడ్డ ఉండటం. దాంతో డాక్టర్ మళ్ళీ ఎం.ఆర్.ఐ. చేయించమన్నారు. అయితే ఈసారి క్లోజ్డ్ ఎం.ఆర్.ఐ. అనటంతో మళ్ళీ మేము కష్టంలో పడ్డాము. ధైర్యాన్ని కూడగట్టుకుని స్కానింగ్ కోసం మేము లోపలికి వెళ్ళాము. నేను రెండు విషయాల కోసం తీవ్రంగా సాయిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఒకటి - మొత్తం స్కానింగ్ పూర్తయ్యేవరకు మావారు భయపడకుండా ఉండాలి. రెండు - రిపోర్టులో గడ్డ ఉన్నట్లు చూపించకుండా నార్మల్‌గా ఉండాలి. బాబా కృప చూపించారు. రిపోర్టులో గడ్డ లేదని తేలింది. బాబా నా ప్రార్థనలు విన్నారు. "థాంక్యూ సో మచ్ బాబా!".

om sairam
ReplyDeletesai always be with me
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete