సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 357వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కరుణతో బాబా చేసిన అద్భుతం
  2. బాబా ఉనికిని అనుభూతి చెందాను

కరుణతో బాబా చేసిన అద్భుతం

ఓం సాయిరాం. నా పేరు సుజిత్ కుమార్. ముందుగా సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను బాబా బిడ్డని. నాకు తల్లి, తండ్రి, గురువు అన్నీ బాబానే. ఇదివరకు ఒకసారి నేను నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవంతో మీ ముందుకు వచ్చాను. ఇటీవల నేను కోరుకున్నట్టుగా నా కోరికను బాబా ఎలా నెరవేర్చారో ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.

రెండు వారాల క్రితం మా కుటుంబమంతా శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలని అనుకుని దర్శనం టికెట్లు మరియు సాయి వ్రతం టికెట్లు బుక్ చేసుకున్నాము. శిరిడీకి వెళ్ళడానికి నాలుగు రోజుల ముందు వరంగల్‌లో జరగబోయే ఒక ఫంక్షన్‌కు వెళ్ళాలనుకుని నా భార్య తను ఉద్యోగం చేసే స్కూల్లో సెలవు అడిగింది. కానీ స్కూలు వాళ్ళు ఆమెకు సెలవు ఇవ్వలేదు సరికదా, ఒక నెలరోజుల వరకు ఎవరూ సెలవు అడగవద్దనీ, అడిగితే ఉద్యోగంలోంచి తీసేస్తామని తీవ్రంగా హెచ్చరించారు కూడా. దాంతో మేము వరంగల్ వెళ్ళే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాము. 

తరువాత శిరిడీ వెళ్ళాల్సిన రోజు దగ్గరకు వచ్చింది. మరో నాలుగు రోజుల్లో శిరిడీ ప్రయాణం. ఏం చేయాలో అర్థం కాక మాకు ఒకటే టెన్షన్. ఆ సమయంలో మేము,  “తండ్రీ! నువ్వు పిలిపించుకుంటే శిరిడీకి వస్తాము. నీవే మాకు దిక్కు. నీ దర్శన భాగ్యం కలిగేలా అనుగ్రహించు బాబా!” అని బాబాని మనసారా వేడుకొని భారమంతా ఆయన మీదే వేశాము. మా కోరిక నెరవేరితే మా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా పంచుకుంటానని అనుకున్నాను. ఆశ్చర్యకరంగా ఆ మరుసటిరోజు స్కూల్ ప్రిన్సిపాల్ నా భార్యను పిలిచి తనంతట తానే,నీకు సెలవు కావాలన్నావుగా, తీసుకో!” అన్నారు. ఆ మాట వినగానే బాబా చూపిన అనుగ్రహానికి మాకు కన్నీళ్ళు వచ్చేశాయి. ఆనందంతో బాబాకు కృతఙ్ఞతలు తెలుపుకున్నాం. నిజంగా ఇది బాబా చూపిన కరుణే కదా! ప్రతి విషయంలోనూ బాబా మా వెన్నంటి వుండి మమ్మల్ని కన్నబిడ్డల్లా ఆదుకుంటూ మా కోరికలను నెరవేరుస్తున్నాడు. బాబా చల్లని చూపులు ఎప్పుడూ అందరిమీదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఓం సాయినాథాయ నమః

బాబా ఉనికిని అనుభూతి చెందాను

సాయిభక్తురాలు శిల్ప తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! ఇప్పుడు నేను పంచుకోబోయే అనుభవం కొన్ని రోజుల క్రిందట జరిగింది. ఒకరోజు నేను పూజగది శుభ్రపరుస్తుండగా బాబా విగ్రహం క్రింద పడి మూడు ముక్కలుగా విడిపోయింది. నేను చాలా బాధపడ్డాను. నా శ్రేయోభిలాషులంతా, "దిగులుపడకు, క్రొత్త విగ్రహం తీసుకో" అని చెప్పారు. నేను వాళ్లతో, "బాబా నా బిడ్డ, తనకి గాయమైతే, నేను తనకి నయమయ్యేలా ప్రయత్నిస్తాను, అంతేకానీ తనని విడిచిపెట్టను" అని అన్నాను. తరువాత నేను బాబా విగ్రహాన్ని అతికించి పెట్టాను. కానీ నా మనస్సులో ఎక్కడో 'ఇలా ఎందుకు జరిగింది?' అని ఆందోళనపడుతూ 'దీని ద్వారా బాబా నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారో?' అని ఆ రోజంతా ఆలోచిస్తూ ఉన్నాను.

తరువాత వచ్చిన గురువారంరోజు నేను బాబాకి ఆరతి ఇస్తున్నాను. హఠాత్తుగా బాబా ముందు వెలిగించి ఉన్న దీపంలో బాబా రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాను. (ఫోటో కింద జతపరుస్తున్నాను.) వెంటనే నేను అక్కడ కూర్చుని పరిశీలనగా చూశాను. బాబా మల్లెపువ్వుల మాల ధరించి నవ్వుతున్నట్లుగా కనిపించారు. స్పష్టంగా బాబా ఉనికిని నేను అనుభూతి చెంది, "బాబా! మీరు ఎల్లప్పుడూ నాతో ఉండండి. అదే నేను మిమ్మల్ని కోరుకునేది" అని బాబాను మొదటిసారి అడిగాను. నిజానికి నేను బాబాని దేనికోసమూ ప్రార్థించను. ఆయనయందు నమ్మకంతో ఆయనను ప్రేమిస్తూ ఉంటాను.

ఓం సాయిరామ్!!!
- శిల్ప కావ్య.



source: http://experiences.mahaparayan.com/2019/11/i-saw-baba-in-my-lamp.html


3 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai ram ����������

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo