సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 343వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. భక్తుల మనసు తెలిసిన బాబా
  2. ఆటంకాన్ని తొలగించి శిరిడీయాత్ర చేయించారు బాబా

భక్తుల మనసు తెలిసిన బాబా

ఓం సాయిరామ్! శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాటి సాయిబంధువులకి నా నమస్కారములు. నా పేరు సంధ్య. ఇంతకుముందు బాబా ప్రేమను పొందిన నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. సాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ మరోసారి నా అనుభవాలను పంచుకోబోతున్నాను.

మొదటి అనుభవం :

ఒకరోజు ఇంట్లో పని చేస్తూ బాబా ప్రేమను నెమరువేసుకుంటూ, "బాబా! మీరు నాపై చూపిన ప్రేమను సాటి సాయిబంధువులతో పంచుకుందామంటే పని ఒత్తిడి వల్ల నా అనుభవాలని టైప్ చెయ్యలేకపోతున్నాను. అందులోనూ తెలుగు టైపింగ్ అంటే చాలా సమయం పడుతుంది కదా బాబా! అందుకే ఒక పేపర్ పైన నా అనుభవాన్ని వ్రాసి ఫోటో తీసి వాట్సాప్‌లో పంపిస్తే ఎలా ఉంటుంది?" అని బాబాతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలోనే నాకు వచ్చిన ఆలోచన సరైనది కాదేమోనని అనిపించి, "వీలుచూసుకొని స్వయంగా నేనే టైపు చేస్తాను బాబా" అనుకున్నాను. ఆ రోజంతా పనివత్తిడిలో బ్లాగ్ చూడలేకపోయాను. తరువాత భక్తుల అనుభవాలు చదువుదామని "భక్తుల అనుభవాలు వాట్సాప్ గ్రూపు" తెరిచి చూసి ఆశ్చర్యపోయాను. “సాయిభక్తులు తమకు బాబా ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను టైపు చేయడానికి కుదరని పక్షంలో స్పష్టంగా పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి పంపండి” అన్న ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వహిస్తున్న మన సాయి పంపిన సందేశం కనబడింది. సర్వం తెలిసిన బాబా నా మనసు తెలుసుకుని నా అనుభవాలను, ఆయన నాపై చూపిన ప్రేమను చక్కగా సాయిబంధువులతో పంచుకోవడానికి సులువైన మార్గం చూపించారని ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "దయగల తండ్రీ! సాయీ! ప్రేమస్వరూపా! మీ పాదాలకు నమస్కరిస్తూ శరణు వేడుతున్నాను". 

మరొక అనుభవం :

వారం రోజుల క్రితం ఉదయం లేవగానే నా చేతిపై దురదగా అనిపించింది. చేతిపైన సన్నటి దద్దుర్లు వచ్చి తరువాత కురుపులాగా కనిపించింది. అది చేయంతా వ్యాపిస్తుందేమోనని భయపడి, "రక్షించండి బాబా!" అని ప్రార్థించి బాబా ఊదీని ఆ దద్దుర్లపై రాశాను. దాంతో దద్దుర్లు వ్యాపించకుండా అక్కడికే ఆగిపోయాయి. రెండు రోజుల తరువాత డాక్టరుని సంప్రదించాను. అయితే డాక్టర్ “ఆ దద్దుర్లు ఒక్కచోటే ఉన్నాయా, మరి ఇంకెక్కడైనా ఉన్నాయా?” అని అడిగారు. “ఇంకెక్కడా లేవు” అని బదులిచ్చాను. కొన్ని మందులు రాసి ఇచ్చారు. అవి వేసుకుంటున్నానే కానీ నా మనసు మన సద్గురు సాయి ఊదీ పైనే ఉంది. 'సాయీ! నన్ను రక్షించండి" అని బాబాను ప్రార్థించి మరోసారి ఊదీని ఆ దద్దుర్లపై రాశాను. బాబా దయతో క్రమంగా దద్దుర్లు తగ్గుముఖం పట్టి, మునుపటిలా ఆరోగ్యమైన చర్మంలా మారిపోయింది. సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాకి మాట ఇచ్చిన ప్రకారం నా అనుభవాన్ని ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో సాటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను.

నాలుగు రోజుల వ్యవధిలో మావారికి  కూడా ఇదే సమస్య వచ్చింది. అప్పుడు కూడా బాబాని ప్రార్థించి బాబా ఊదీని రాయడం జరిగింది. బాబా అనుగ్రహంతో మావారి చర్మం ఎప్పటిలా ఆరోగ్యవంతంగా మారింది. "బాబా! దయగల తండ్రీ! మీకు జయమగుగాక!".

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి!

ఆటంకాన్ని తొలగించి శిరిడీయాత్ర చేయించారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! సాయిబాబా భక్తురాలినైనందుకు నేను ఎంతో ధన్యురాలిగా భావిస్తున్నాను. బాబా చాలా క్లిష్ట పరిస్థితులలో నాకు సహాయాన్ని అందించి మార్గనిర్దేశం చేశారు. "చాలా ధన్యవాదాలు బాబా!" నా శిరిడీయాత్ర ఆటంకాలు లేకుండా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

మేము తమిళనాడులోని పల్లికరనైలో ఉన్న బాబా మందిరానికి వెళ్తూ ఉన్నాము. ఆ మందిరం వారు 2019, జూలై 27 నుండి జూలై 30 వరకు శిరిడీ పర్యటన ఏర్పాటు చేశారు. చాలా ఉత్సాహంగా నేను, మావారు శిరిడీ వెళ్లేందుకు సిద్ధమయ్యాము. అయితే ప్రయాణతేదీ నాకు సమస్య అయ్యింది. ఎందుకంటే, అదేరోజు నా నెలసరి వచ్చే సమయం. అది నా ప్రయాణానికి ఎక్కడ ఆటంకం అవుతుందోనని నేను చాలా భయపడి, "బాబా! నా పర్యటనకు ముందుగానీ లేదా తర్వాతగానీ నెలసరి వచ్చేలా చేయమ"ని బాబాను ప్రార్థించాను. అకస్మాత్తుగా ప్రయాణానికి కొన్నిరోజుల ముందు నాకు జ్వరం వచ్చింది. నేను హాస్పిటల్‌కి వెళ్లి మందులు వాడుతున్నా జ్వరం తగ్గుముఖం పట్టలేదు. నాలుగురోజుల తరువాత నేను మళ్ళీ హాస్పిటల్‌కి వెళితే, డాక్టర్ రక్తపరీక్షలు చేయించమని చెప్పారు. నేను ఆందోళన చెంది, "రిపోర్టులు నార్మల్‌గా ఉండేలా చూడమ"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన, "సమస్య ఏమీలేదు, ఇది సాధారణ జ్వరమే, త్వరలోనే నయం అవుతుంది. కాస్త బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంద"ని డాక్టర్ చెప్పారు. నేను ఆఫీసులో సెలవు తీసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాను. అదే సమయంలో సరిగ్గా నా ప్రయాణానికి 5 రోజుల ముందు, అంటే జూలై 22న నాకు నెలసరి వచ్చింది. బాబా చూపిన అనుగ్రహానికి నేను తదేకంగా ఆయనను చూస్తూ ఉండిపోయాను. తరువాత మేము ఎటువంటి ఆటంకాలు లేకుండా శిరిడీ వెళ్లి, అద్భుతమైన బాబా దర్శనంతో ఇంటికి తిరిగి వచ్చాము. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2561.html


3 comments:

  1. ఓం సాయిరాం🌷🙏🌷 బాబా మా అమ్మాయి 10వ తరగతి పరీక్షలు వ్రాసింది తనకి 1 క్లాసు లో పాస్ అయితే నిను కూడా ఈ బ్లాగు ద్వారా న అనుభవాన్ని సాటి సాయి భక్తులకు పంచుకుంటాను ఓం సాయిరాం🌷🌷🌷🌷🌷

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo