ఈ భాగంలో అనుభవాలు:
- బాబా పరిచయం - ఏర్పరిచిన జీవనాధారం
- ఊదీ లీల
బాబా పరిచయం - ఏర్పరిచిన జీవనాధారం
నా పేరు అంజలి. నేను బాబా భక్తురాలిని. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటినన్నిటినీ ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి శతకోటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ బ్లాగ్ లేకపోతే ఇంతమంది భక్తులకు బాబా ప్రసాదించిన అనుభవాలు తెలిసే అవకాశం లేదు కదా! నేనిప్పుడు బాబాకి భక్తురాలిని ఎలా అయ్యానో చెబుతాను.
నా ఆరాధ్యదైవం వేంకటేశ్వరస్వామి. మాది చాలా పేద కుటుంబం. మా నాన్న రోజూ కూలిపని చేస్తే గానీ మాకు ఇల్లు గడిచేది కాదు. నాకు చదువంటే బాగా ఇష్టం. అందువలన నా తల్లిదండ్రులు చాలా కష్టపడి నన్ను చదివించారు. నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు స్కూలుకి వెళ్ళేదారిలో వేంకటేశ్వరస్వామి గుడి ఉండేది. నేను ప్రతిరోజూ ఆ గుడికి వెళ్తూ బాధైనా, సంతోషమైనా ఆ స్వామితోనే చెప్పుకునేదాన్ని.
నేను కర్ణాటక NIT లో ఎం.టెక్ చదువుతున్న రోజుల్లో(2003) నా రూములో నాతోపాటు పద్మజ అనే స్నేహితురాలు ఉండేది. తను బాబాకి చాలా మంచి భక్తురాలు. తను రోజూ బాబా చరిత్ర పారాయణ చేసేది. నాకు అప్పటివరకు ‘సాయిబాబా’ అనే దేవుడున్నాడని కూడా తెలియదు. మొదటిసారి నా స్నేహితురాలు చెప్తే విన్నాను. బాబా చరిత్ర పారాయణ చేస్తే మంచి జరుగుతుందని తను చెప్పేది. ఆ సమయంలో క్యాంపస్ ఉద్యోగ నియామకాల కోసం చాలా శ్రమపడేవాళ్ళం. మా కుటుంబ పరిస్థితి బట్టి నాకు ఉద్యోగం తప్పనిసరిగా కావాలి. నా స్నేహితురాలు అంతగా చెప్తోంది కదా, సరే చూద్దామని మొదటిసారి కాలేజీలో సాయిసచ్చరిత్ర పారాయణ చేశాను. అంతే! ఇంక అప్పటినుండి నాకు తెలియకుండానే బాబాను ఆరాధించడం మొదలుపెట్టాను. అక్కడినుండి నా జీవితంలో మార్పు రావడం మొదలైంది. క్యాంపస్ ఉద్యోగ నియామకాల్లో నాకు ఉద్యోగం రాలేదుగాని జీవితంలో బాబా నాకు తోడై నిలిచారు.
ఎం.టెక్ పూర్తి చేసి 2003 ఫిబ్రవరిలో ఇంటికి వచ్చాను. “నా చదువు పూర్తయింది బాబా. నన్ను ఖాళీగా ఉంచవద్దు, నాకు వెంటనే ఉద్యోగం ప్రసాదించండి” అని బాబాతో చెప్పుకొని ఇంటికి వచ్చిన వెంటనే మా ఊరిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో నా రెజ్యూమ్ ఇద్దామని వెళ్లాను. కానీ వాళ్లు, “ఇప్పుడు కాదు, సమ్మర్ తరువాత ఇంటర్వ్యూకి కాల్ చేస్తాము” అని చెప్పారు. అంటే, నేను జూన్, జులై వరకు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండాలి. సాధారణంగా ఎక్కడైనా ఆ నెలల్లోనే ఉద్యోగ నియామకాలు జరుగుతుంటాయి. ఇక బాబా చేసిన అద్భుతం చూడండి. నేను ఇంటికి వచ్చిన రెండు గంటల్లో కాలేజీ వాళ్లు ఫోన్ చేసి, మరునాడే ఇంటర్వ్యూ ఉంది, రమ్మన్నారు. మరుసటిరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. బాబా అనుగ్రహంతో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. మరుసటిరోజు నుండే నన్ను ఉద్యోగంలో చేరమన్నారు. నిజానికి నాకు ఉపాధ్యాయ వృత్తి పట్ల అంతగా ఆసక్తి లేదు. నా వాయిస్ చాలా చిన్నగా ఉంటుంది. బోధనా వృత్తికి అది అంతగా సరిపోదని నా అభిప్రాయం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యోగంలో చేరాను. బాబా దయవల్ల ఇంటికి వచ్చిన రెండు రోజుల్లోనే నేను ఉద్యోగంలో ఉన్నాను. అలా నా మొదటి కోరిక తీర్చారు నా సాయి. ఇక అప్పటినుండి బాబాను ఇంకా శ్రద్ధగా ఆరాధించడం మొదలుపెట్టాను. మా ఊరికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా గుడికి ప్రతి గురువారం వెళ్ళేదాన్ని.
నాకు ఉపాధ్యాయవృత్తి కంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చెయ్యాలని కోరిక. పెళ్ళయిన తర్వాత సాఫ్ట్ వేర్ రంగానికి మారాలని అనుకునేదాన్ని. ఉపాధ్యాయవృత్తిలో మూడు సంవత్సరాలు ఉన్న తరువాత నాకు వివాహం జరిగింది. వివాహం విషయంలో భారం బాబా మీదే వేసి, “మీకు ఇష్టమైన వ్యక్తితోనే నా వివాహం జరిపించండి బాబా!” అని ఆయనను ప్రార్థించి నిర్ణయం ఆయనకే వదిలేశాను. బాబా చాలా అద్భుతంగా అనుగ్రహించారు. నా భర్త చాలా మంచి వ్యక్తి. నన్ను, నా తల్లిదండ్రులను కూడా చాలా బాగా చూసుకుంటారు.
వివాహమైన ఒక సంవత్సరానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం నేను, నా భర్త బెంగుళూరు వెళ్ళాము. అప్పుడు నేను బాబా అనుమతి కోరలేదు. ఒక ఆరు నెలల పాటు నరకం చూశాము. కానీ బాబా మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఉద్యోగం లేనప్పటికీ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకున్నారు. ఆ సమయంలో మా ఫ్రెండ్ మాకు వాళ్ళింట్లో ఆశ్రయమిచ్చారు. మేము ఇబ్బందిపడకుండా బాబానే వాళ్ళ రూపంలో మాకు సహాయం చేశారు. మా ఫ్రెండ్ భార్య పేరు భవాని. తను కూడా చాలా మంచి సాయిభక్తురాలు. వాళ్లు చేసిన సహాయానికి మేము జీవితాంతం వాళ్ళకి ఋణపడివుంటాము. ఆ తరువాత నాకు కొన్ని ఆరోగ్యసమస్యలు తలెత్తాయి. నా పరిస్థితి గమనించిన నా భర్త, “ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగం నీకు కరెక్ట్ కాదు, మనం ఊరికి వెళ్ళిపోదాం” అన్నారు. దాంతో బాబా మీద భారం వేసి మేము గుంటూరు వచ్చేశాము. అక్కడైతే అందరికీ దగ్గరలో ఉంటామని భావించాము. అయితే ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. అప్పటికే ఉద్యోగం లేకుండా ఆరు నెలలు గడిచిపోయాయి.
అది 2007 నవంబరు నెల. ఒకరోజు గుంటూరులోని RVR&JC ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం ఖాళీగా ఉందని నా స్నేహితురాలు సరయు చెప్పింది. సాధారణంగా విద్యాసంవత్సరం మధ్యలో ఉద్యోగ నియామకాలు ఉండవు. అయినప్పటికీ బాబా మీద భారం వేసి నా రెజ్యూమ్ ఇద్దామని కాలేజీకి వెళ్లాను. అక్కడ కూడా బాబా అద్భుతాన్ని చేశారు. నేను రెజ్యూమ్ ఇచ్చిన వెంటనే వాళ్లు నన్ను ఇంటర్వ్యూ చేసి వెంటనే ఉద్యోగంలోకి తీసుకున్నారు. నా భర్త బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. అలా బాబా మా జీవితాలకు ఆధారాన్ని ఏర్పరిచారు. జీవితంలో బాబా, ఆయన చల్లని దయ ఉంటే చాలు, ఏ కొరతా ఉండదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు మీ బిడ్డలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను"

ఊదీ లీల
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ప్రియమైన సాయిభక్తులకు సాయిరామ్! నేను ప్రస్తుతం మా అమ్మాయితో సింగపూర్‌లో నివాసముంటున్నాను. అయితే అది సుమారు మూడు నెలల స్వల్పకాలం మాత్రమే. నేను మన ప్రియమైన సాయికి ఒక చిన్న భక్తురాలిని. ఈ వెబ్‌సైట్ నిజంగా బాబా పట్ల విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఒకరోజు అకస్మాత్తుగా నాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చి చాలా బాధపడ్డాను. ఎప్పుడూ పనిలో బిజీగా ఉండే మా అమ్మాయికి ఈ విషయం చెప్పి తనని ఇబ్బందిపెట్టడం నాకు ఇష్టం లేదు. పైగా సింగపూర్‌లో డాక్టర్ అపాయింట్‌మెంట్ పొందడం చాలా కష్టం. అందువలన నేను, "బాబా! ఈ నొప్పి తగ్గేలా చేసి, ఈ బాధనుండి విముక్తిని ప్రసాదించమ"ని సాయిని ప్రార్థించాను. తరువాత నేను పూజగది లోపలికి వెళ్లి ఊదీ తీసుకుని నా పొట్టంతా పూసుకుని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగాను. మరుసటిరోజు ఉదయం లేచేసరికి నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. కానీ, రాత్రికి మళ్ళీ నొప్పి మొదలైంది. మళ్ళీ పూజగదికి వెళ్లి ఊదీ రాసుకుని, నీళ్ళల్లో కలుపుకుని త్రాగాను. దాంతో నొప్పి మళ్ళీ రాలేదు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" నేను బాబాకు వాగ్దానం చేసినట్లుగా ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.
బాధ ఏదైనా మనం పూర్తిగా సాయికి శరణాగతి చెంది, హృదయపూర్వకంగా ఆయనను ప్రార్థించి, ఊదీ రాసుకుని, కొద్దిగా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగితే మనకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. రక్షణనిచ్చే ఆయన పాదకమలాలకు నా నమస్కారములు. ఆయన మాత్రమే చేయగలిగే లీలకు నా నమస్కారములు. శ్రద్ధ, సబూరీ లోని సత్యాన్ని నేనిప్పుడు అర్థం చేసుకోగలిగాను.
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
source: http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2576.html

ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
ఓం సాయిరాం🌷🙏🌷
ReplyDelete