ఈ భాగంలో అనుభవాలు:
- బోర్డు పరీక్షలలో అద్భుతం!
- బాబా తన లీలలతో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు
నిన్నటి భక్తురాలి మరికొన్ని అనుభవాలు:
బోర్డు పరీక్షలలో అద్భుతం!
దాదాపు 21 సంవత్సరాల క్రితం నేను పదవ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైనప్పుడు జరిగిన మరో అనుభవాన్ని కూడా పంచుకుంటాను. సోషల్ సైన్సెస్ మినహాయిస్తే మిగిలిన అన్ని సబ్జెక్టులలో నాకు మంచి పట్టు ఉంది. సోషల్ సైన్సెస్ పరీక్షకు ప్రిపేర్ కావడానికి 7 రోజుల సెలవు వచ్చినప్పటికీ నేను ఆ సబ్జెక్టుపై పట్టు సాధించలేకపోయాను. ముఖ్యంగా జియోగ్రఫీ, సివిక్స్ మరియు ఎకనామిక్స్ లలో నేను సరిగా ప్రిపేర్ కాలేకపోయాను. పరీక్ష సమయంలో కూడా నేను హిస్టరీపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. కేవలం చరిత్రపైనే రెండుగంటల సమయం గడిపాను. చెప్పాలంటే అది కేవలం 40% మార్కులకు మాత్రమే. నా మూర్ఖత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక మిగిలింది కేవలం ఒక గంట సమయం మాత్రమే. ఆ గంటలో 60% మార్కులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం వ్రాయడం అసాధ్యమైన పని. నేను సరిగా వ్రాయలేదని ఖచ్చితంగా నాకు తెలుసు. కాబట్టి నేను సోషల్ సైన్సెస్‌లో ఫెయిల్ అవుతానని చాలా భయపడ్డాను. అందువల్ల కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించేలా చూడమని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చివరికి ఫలితాలు ప్రకటించినప్పుడు, బాబా ఎల్లప్పుడూ తన బిడ్డలను రక్షిస్తారనే విషయం నాకు స్పష్టమైంది. నేను ఆశ్చర్యపోయేలా సోషల్ సైన్సెస్‌లో నాకు 77 మార్కులు వచ్చాయి. ఇది చాలామందికి పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ నా దుర్భరమైన ప్రేపరేషన్‌కి, పరీక్ష సమయంలో నేను ప్రదర్శించిన అద్భుతమైన మూర్ఖత్వానికి ఇది అద్భుతానికేమీ తక్కువ కాదు. "నా కెరీర్ యొక్క కీలకమైన దశలో నాకు సహాయం చేసినందుకు, నా కెరీర్‌లోని ప్రతిదశలో అద్భుతాలు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు బాబా!"

బాబా తన లీలలతో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు
మేము ఆస్ట్రేలియాకు వెళ్లిన కొన్ని వారాల్లో సిడ్నీలోని వివిధ దేవాలయాలను సందర్శించే అవకాశం మాకు లభించింది. అయితే, సాయిబాబా ఆలయాన్ని సందర్శించే అవకాశం నాకింకా రాలేదని నేను కొంచెం బాధపడ్డాను. ఒక శనివారంనాడు నేను నా భర్తతో, "నేను ఇక్కడకు దగ్గరలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నాను" అని చెప్పాను. నా భర్త అలాగే వెళదామని అంగీకరించారు కానీ, ఇతర పనులలో బిజీగా గడిపి తిరిగి వస్తున్నప్పుడు, "ఈరోజు ఆలయాన్ని సందర్శించే ఓపిక తనకు లేద"ని చెప్పారు. నాకు కూడా చాలా ఆకలిగా ఉన్నందున ఇంటికి వెళ్లిపోదామన్నాను. అయితే బాబా ప్రణాళిక వేరుగా ఉంది. హఠాత్తుగా నా భర్త మా ఇంటికి వెళ్ళే మార్గం కాకుండా వేరే మార్గంలోకి ప్రవేశించారు. దాంతో నా భర్త, "ఈ ఏరియాలోనే బాబా ఆలయం ఉంది, కాబట్టి ఆలయానికి వెళదామ"ని అన్నారు. గూగుల్ మ్యాప్స్‌లో మార్గాన్ని చూస్తూ కొన్ని నిమిషాల్లో మేము బాబా ఆలయానికి చేరుకున్నాము. మేము ఆలయం లోపలికి వెళ్తున్నప్పుడు, "నాకు బాగా ఆకలిగా ఉంది, దర్శనం అయిన తరువాత ఏదైనా సూపర్ మార్కెట్‌కు వెళ్లి తిందామ"ని నా భర్తకు చెప్పాను. ధూప్ ఆరతి అప్పుడే ప్రారంభమైంది. స్వయంగా నా చేతులతో బాబాకు ఆరతి ఇచ్చే అవకాశం నాకు లభించింది. అప్పటివరకు ఏ దేవాలయంలోనూ నేరుగా ఆరతి చేసే అవకాశం నాకు రానందున నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. ఆరతి సమయంలో బాబా దర్శనం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆరతి తరువాత మేము బయలుదేరబోతుండగా భక్తులు మమ్మల్ని ఆపి, ప్రసాదం తీసుకుని వెళ్ళమని చెప్పారు. ప్రసాదం అంటే కొంచెం కాదు, దాదాపు పూర్తి భోజనంలాంటిది. మేము ఆశ్చర్యపోయాము. ఆవిధంగా నేను కోరుకున్నరోజున బాబా తన దర్శనం నాకు ప్రసాదించడమే కాకుండా నా ఆకలిని కూడా తీర్చారు. ఆయన తన పిల్లలని ఎల్లవేళలా జాగ్రత్తగా చూసుకుంటారు. "మీ ఉనికిని, మాయాజాలాన్ని నాకు చూపించినందుకు ధన్యవాదాలు బాబా!".

Om sai
ReplyDeleteSri sai
Jaya jaya sai
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete