ఈ భాగంలో అనుభవాలు:
- సదా మా వెన్నంటే ఉన్నారని తెలియజేసిన బాబా
- బాబా సందేశం అక్షర సత్యమైంది
సదా మా వెన్నంటే ఉన్నారని తెలియజేసిన బాబా
సాయిభక్తురాలు అహిళ తనకి బాబా ప్రసాదించిన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
అందరికి నమస్తే! నేను, మావారు ఇద్దరం మహాపారాయణలో భాగస్వాములం. బాబా మాతో ఉండగా మాకు ఏ చెడూ జరగదని నాకు తెలుసు. ఇప్పుడు బాబా మాకు ప్రసాదించిన రెండు అద్భుతమైన అనుభవాలను మీ అందరితో పంచుకుంటాను. ఈ అనుభవాల ద్వారా బాబా సదా మా వెన్నంటే ఉన్నారని తెలియజేశారు. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఇవి ఇటీవల జరిగినవి.
గత సంవత్సరం ఉద్యోగరీత్యా మావారు అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నారు. దాదాపు ఆ ఉద్యోగంలో కొనసాగే ఆశ కోల్పోయాము. ఉద్యోగం గనక పోతే స్కూలుకి వెళ్లే మా పాప అవసరాలు, ఇంకా ఇతరత్రా అవసరాలు ఎలా తీరుతాయని తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాము. ఆ పరిస్థితి నుండి బయటపడటానికి మావారు ఎన్నో విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ వృధా అయ్యాయి. అలాంటి స్థితిలో నేను నవగురువార వ్రతం మొదలుపెట్టాను. ఒకరోజు నేను వాట్సాప్ చూస్తుండగా, నా స్నేహితులొకరు సాయి ఫోటోతోపాటు ఒక సందేశాన్ని పంపారు. అది చూసి నిజంగా నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ మెసేజ్ ఇలా ఉంది, “చింతించకు! నిన్ను రక్షించడానికి నేనున్నాను. త్వరలోనే మీరు ఈ పరిస్థితి నుండి బయటపడటానికి నేను సహాయం చేస్తాను” అని. అది బాబా నాకే పంపిన సందేశం అనిపించింది.
తరువాత వచ్చిన గురువారంనాడు, "మీ సమస్యను పరిష్కరించడానికి నేనొక దారి కనుగొన్నాను. ముందుకు సాగుతూ ఉండండి. మీ జీవితాలకి ఒక మార్గాన్ని ఏర్పరచాను" అని బాబా మరో సందేశాన్ని ఇచ్చారు. అది సాయిబాబా ఇస్తున్న ముందస్తు సూచనలని నాకు ఖచ్చితంగా తెలుసు. మేము ఆశ్చర్యపోయేలా మరుసటి గురువారంనాడు మావారి స్నేహితుడు బెంగళూరు నుండి ఫోన్ చేసి, మరుసటిరోజే చెన్నై వచ్చి ఉద్యోగంలో చేరమని, ఆ మరుసటిరోజు నుండి బెంగళూరు ప్రాజెక్టులో వర్క్ చేయమని చెప్పాడు. ఆ క్షణంలో మా ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఆనందంతో బాబా ముందర ఏడ్చేశాను కూడా.
కష్టకాలంలో ఉన్నప్పుడు నేను, "మా సమస్యలు తీరితే మేము శిరిడీ వస్తామ"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో సమస్య తీరిన తరువాత మేము శిరిడీ ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో బాబా మమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లుగా, "నా పిల్లల రాకకోసం నేను ఎదురుచూస్తున్నాను” అని ఒక సందేశాన్ని పంపారు. దీని గురించి నేను ఏమి చెప్పను? మేము సరిగ్గా బాబా మహాసమాధి రోజుకు 3 రోజుల ముందు, అంటే 2019, అక్టోబర్ 12న శిరిడీ వెళ్ళాము. బాబా మాకు అద్భుతమైన దర్శనాలు అనుగ్రహించారు.
రెండవ అనుభవం:
ఇది కొద్ది రోజుల క్రితం జరిగింది. సాధారణంగా మావారు చేయించుకునే ఆరోగ్యపరీక్షల్లో తన ఊపిరితిత్తిలో కొన్ని సమస్యలున్నాయని బయటపడింది. దాంతో వాళ్ళు సి.టి.స్కాన్ చేయించమని సూచించారు. నేను ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి, డాక్టర్స్ అనుమానిస్తున్నట్టు ఏదైనా ఉంటే మావారికి ఊపిరితిత్తుల మార్పిడి చెయ్యాల్సి వస్తుందని చాలా భయపడ్డాను. ఎప్పటిలానే నేను బాబాను ప్రార్థించి, ఊదీని నీళ్లలో కలిపి మావారికిచ్చాను. తరువాత మేము సి.టి.స్కాన్ చేయించడానికి వెళ్ళాం. స్కానింగ్ మొదలైనప్పటినుండి రిపోర్టులు వచ్చేవరకు నేను పూర్తి విశ్వాసంతో బాబా స్మరణ చేశాను. బాబా అనుగ్రహించారు, రిపోర్టులలో ఏ సమస్యా లేదని వచ్చింది. ఇంతకన్నా నేనేమి ఆశించగలను? "బాబా! మీరు మాపై కురిపిస్తున్న అనుగ్రహానికి చాలా చాలా కృతజ్ఞతలు".
ఓం సాయిరామ్!!!
అహిళ షణ్ముగం
source:http://experiences.mahaparayan.com/2019/12/sai-showered-his-blessings.html

బాబా సందేశం అక్షర సత్యమైంది
బెంగుళూరు నుండి సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నా పేరు లక్ష్మి. మేము బెంగుళూరులో ఉంటాము. ముందుగా సాయినాథునికి నా నమస్కారాలు సమర్పించుకుంటూ నా చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను ఈమధ్య హైదరాబాదు వెళ్ళినప్పుడు బెంగుళూరులో ఉన్న మా మనవరాలికి హఠాత్తుగా 104 డిగ్రీల జ్వరం వచ్చింది. దాంతో కంగారుపడి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నాకు ఫోన్ చేశాడు మా అబ్బాయి. నాకు చాలా భయమేసి సాయిబాబా దగ్గర కూర్చుని చాలా బాధపడుతూ ఆయనను ప్రార్థించాను. తరువాత 'క్వశ్చన్& ఆన్సర్' వెబ్‌సైట్(https://www.yoursaibaba.com/)లో బాబాని అడిగితే, "మీ ప్రయాణం పూర్తయి ఇంటికి వచ్చేటప్పటికి అంతా బాగవుతుంది" అని వచ్చింది. దాంతో నేను భారమంతా బాబా మీదనే వేసి నిశ్చింతగా ఉన్నాను. 5 రోజుల తరువాత బెంగుళూరు వెళదామని హైదరాబాదులో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా మా అబ్బాయి ఫోన్ చేసి, "పాప ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. తనని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వస్తున్నాను" అని చెప్పాడు. ఆ మాట వినగానే ఎంతో ఆనందంతో మనస్పూర్తిగా బాబాకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకున్నాను. ఊరు చేరిన తరువాత గురువారంనాడు మా ఇంటి దగ్గర ఉండే సాయిబాబా మందిరంలో ప్రసాదం పంచి బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఆయన దయ వర్ణనాతీతము. ఇప్పుడు మా మనవరాలు ఆరోగ్యంగా ఉంది, హాయిగా కాలేజీకి వెళ్ళి వస్తోంది. ఇంకా కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయి. బాబా అనుగ్రహంతో అవి తీరగానే మీతో పంచుకుంటాను.
ఓం సచ్చిదానంద సద్గురు సాయినాథాయనమః.

No comments:
Post a Comment