ఈ భాగంలో అనుభవాలు:
- సాయిబాబా ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు
- భారమంతా బాబాపై వేసి చూడు... తప్పక లభించు అనుగ్రహం
సాయిబాబా ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు
యు.కె నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నేను సాయిభక్తురాలిని. సాయే నా దైవం, గురువు, సంరక్షకుడు. ఆయనే నాకు మంచి స్నేహితుడు. సాయి మన జీవితంలోకి వచ్చాక ప్రతీదీ మంచిగా మారుతుంది. అపారమైన విశ్వాసం, సహనం భక్తులను సరైన మార్గంలో నడిపిస్తాయి. "బాబా! ఈ అనుభవాన్ని వివరించడంలో ఏవైనా తప్పులు దొర్లితే దయచేసి నన్ను క్షమించండి".
గత కొంతకాలంగా నేను, నా భర్త కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని చాలా తీవ్రమైనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను నా భర్తకు సంబంధించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.
ఒకరోజు రాత్రి నా భర్తకు కడుపునొప్పి తీవ్రంగా వచ్చింది. నొప్పితో ఆయనకు బాగా చెమటలు పడుతున్నాయి. ఆయన మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఆయనెప్పుడూ ఏడవటం అన్నది ఎరుగరు. అలాంటి తను బాధ తట్టుకోలేక ఏడవడానికి సిద్ధంగా ఉంటే చూసి ఆయనకు చాలా బాధ ఉందని నేను గ్రహించి వెంటనే డాక్టరుకి ఫోన్ చేశాను. డాక్టర్ వెంటనే అంబులెన్స్ పంపించారు. అంబులెన్సులో హాస్పిటల్‌కి చేరుకున్నాక పరీక్షలు చేసి మూత్రంలో రక్తం ఉందని చెప్పారు. మేము చాలా భయపడి, "ఏ చెడూ జరగకుండా చూడమ"ని సాయిని ఆర్తిగా ప్రార్థించాము. తరువాత డాక్టర్ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయని ధృవీకరిస్తూ, ఆ రాళ్ళూ చిన్నగానే ఉన్నాయి కాబట్టి మూత్రం ద్వారా బయటకు పోయేవరకు వేచి చూద్దామని చెప్పారు.
వారం తరువాత నా భర్తకు వెన్నునొప్పి తీవ్రంగా రావడం మొదలైంది. "రాయి బయటకు వచ్చే క్రమంలో వెన్నులో సంకోచం ఏర్పడుతుంది, అది నొప్పికి కారణం కావచ్చ"ని చెప్పి, నొప్పి ఉపశమనం కోసం డాక్టర్ మందులిచ్చారు. నా భర్త నడవలేని స్థితిలో ఆఫీసుకి సెలవు పెట్టారు. కొన్నిరోజులు గడిచాక నా భర్త రోజంతా ఇంట్లో ఉండలేక తిరిగి ఆఫీసుకి వెళ్లాలని అనుకున్నారు. ఆ విషయమై డాక్టర్ని అడిగితే, మరోవారం వేచి ఉండమని చెప్పారు.
తరువాత వచ్చిన గురువారంనాడు నేను నా సాయి వ్రతాన్ని ప్రారంభించబోతున్నాను. నేను, నా భర్త, మా అబ్బాయి వంటగదిలో ఉన్నాము. ఆయన కుర్చీలో కూర్చుని మా అబ్బాయికి తినిపిస్తున్నారు. అకస్మాత్తుగా ఆయనకు మూర్ఛ వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్ళాము. డాక్టర్ పరీక్షించి, "అపాయమేమీ లేదు, తలపై ఏదో తగిలినందున అతనికి మూర్ఛ వచ్చింద"ని చెప్పారు. ఇంత జరిగినా నాకు సాయిబాబాపై కోపం లేదు. ఎందుకంటే, జరిగిన దాంట్లో ఆయన ఆశీర్వాదం ఉంది. నా భర్త కిందపడిపోయినప్పుడు అందరం అక్కడే ఉండటం వలన పెద్ద ప్రమాదం తప్పింది. పైగా ఆ సంఘటన జరిగిన తరువాత నా భర్త ఆఫీసుకి వెళ్ళవచ్చని, డ్రైవింగ్ చేయవచ్చని, మెట్లు దిగి ఎక్కవచ్చని, మా అబ్బాయిని ఎత్తుకోవచ్చని డాక్టర్ చెప్పారు. జరిగింది ప్రమాదమే అయినా బాబా ఆశీస్సులతో అంతా మంచే జరిగింది.
ఇటీవల నా భర్త బాత్రూముకి వెళ్ళినప్పుడు రక్తం కనిపించింది. అదేరోజు ఆయన హాస్పిటల్‌కి వెళ్లారు. వాళ్ళు స్కానింగ్, రక్తపరీక్షలు, మరికొన్ని ఇతర పరీక్షలు చేసి మరుసటిరోజు రమ్మని చెప్పారు. మరుసటిరోజు మేము డాక్టర్ని సంప్రదిస్తే, 'సమస్య చిన్నదే కానీ, క్యాన్సర్ కూడా కావచ్చు' అని చెప్పారు. మేము చాలా భయపడ్డాము. అయితే ఆ సమయంలో కూడా సాయిబాబాపై నా విశ్వాసం చెదరలేదు. ఎందుకంటే సాయిబాబా ముందునుండి మాతో ఉన్నారు, కాబట్టి ఈ స్థితిలో మమ్మల్ని విడిచిపెట్టరు. నా భర్త ఊదీ నీళ్లు త్రాగి, తన కడుపు మీద కొంత ఊదీ రాసుకున్నారు. తరువాత స్కానింగ్ చేయాల్సిన రోజు ఉదయం మేము ముందుగా సాయిబాబా మందిరాన్ని సందర్శించాము. తరువాత జరిగిన పరీక్షల్లో ఆందోళన చెందాల్సిందేమీ లేదని నిర్ధారణ అయ్యింది. అంతా బాబా కృప.
నేను చెప్పేది నమ్మండి, అనారోగ్యానికి గురైనప్పుడు, బాధలో ఉన్నప్పుడు సాయి మాతో ఉన్నారని మేము ఆయనపై విశ్వాసం ఉంచాము. ఈ పరీక్షలు మన కర్మల వల్లనే. ప్రతీదీ ఒక కారణం చేత జరుగుతుందని మేము నిజంగా నమ్మాము. కాబట్టి సాయిబాబా యందు విశ్వాసం, సహనం చెదరకుండా ఉంచుకోవాలి. మనం మంచి కర్మలు చేయటంలో దృష్టి పెడితే తదుపరి జన్మలో ఇలాంటి పరీక్షలు ఎదుర్కోకుండా ఉంటాము. మనం అంతటా సాయిని చూడాలి, మంచి జరగడం కోసం ఆయన బోధలను ఆచరించాలి. ఏ పని చేస్తున్నా సాయిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. "బాబా! భక్తులందరినీ ఆశీర్వదించండి. మా సమస్యలకు ముగింపు ఇవ్వండి. దయచేసి ఎప్పుడూ మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని వదిలి పెట్టకండి".
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2576.html

భారమంతా బాబాపై వేసి చూడు... తప్పక లభించు అనుగ్రహం
ఓం సాయిరామ్! నేను బళ్ళారిలో నివాసముంటున్న ఒక చిన్న సాయిభక్తురాలిని. ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలను చదివే అవకాశం కలిపిస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులందరికీ చాలా కృతజ్ఞతలు. సాయికుటుంబంలోని ప్రతి భక్తుణ్ణీ బాబా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
నాకు చాలా సంవత్సరాలుగా గ్యాస్ట్రిక్ సమస్య (కడుపులో మంట) ఉంది. ఎన్ని మందులు వాడుతున్నా తగ్గేది కాదు. చివరికి బాబా ఆశీస్సులతో ఆ సమస్య తగ్గితే నా అనుభవాన్ని మన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని బాబాకు మొక్కుకొని, అప్పటివరకు నేను వాడుతున్న మాత్రలను విరిచి పారేసి, భారమంతా బాబా మీద వేశాను. బాబా అనుగ్రహంతో ఇప్పుడు నా గ్యాస్ట్రిక్ సమస్య పూర్తిగా తగ్గిపోయింది.
బ్లాగులో నా అనుభవాన్ని పంచుకోవాలంటే ఏ విధంగా వ్రాయాలో ముందు నాకు అసలు తెలియలేదు. అలాంటిది బాబానే నాకు దారి చూపించారు. అలా నేను ఈరోజు మీ ముందు నా అనుభవాన్ని వ్రాయగలిగాను. ఇంకా రెండు కోరికలు తీర్చమని బాబాకి మొక్కుకొని ఉన్నాను. అవి నెరవేరిన తరువాత మరలా బ్లాగులో కలుసుకుంటాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. చాలా సంవత్సరాలనాటి నా బాధను ఇట్టే తీసేసారు. మీ ఆశీస్సులు మీ భక్తులందరిపై ఉండాలని కోరుకుంటున్నాను". ఓం సాయిరామ్!
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
om sairam
ReplyDeletealways be with me
Om samarda sadguru sai Nath Maharaj ki jai
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDelete