ఖపర్డే డైరీ - ఐదవ భాగం
12-12-1910
ఉదయ ప్రార్థనానంతరం సాయి మహారాజు మామూలు అలవాటు ప్రకారం బయటకి వెళుతున్నప్పుడు దర్శనం చేసుకున్నాం. మేమంతా అలవాటు ప్రకారం మాలో మేము మాట్లాడుకుంటూ కూచున్నాం. దీక్షిత్ పూర్తిగా మారిపోయాడు. అతను తన సమయంలో ఎక్కువ భాగం ప్రార్థనలోనే గడుపుతున్నాడు. అసలే ఎంతో సాత్వికమైన ఆయన స్వభావం విశిష్టమైన మాధుర్యాన్ని సంతరించుకుంది. అదంతా లోపలి ప్రశాంతత వల్లనే. పూల్‌గాఁవ్ నుంచి రావుబహద్దూర్ రాజారామ్ పంత్ దీక్షిత్ వచ్చాడు. నాగపూర్‌లో బయలుదేరినప్పుడు శిరిడి రావాలన్న కోరికే లేదట అతనికి. అయితే పూల్‌గాఁవ్ వద్ద తన మనసుని మార్చుకుని వెంటనే శిరిడీ వెళ్ళాలనుకొని మరుక్షణం తన ప్రయాణం కొనసాగించాడు. అతన్ని చూడటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
తరువాత మేమందరం సాయిబాబా దర్శనానికి వెళ్ళాం. నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళటం వల్ల వారు చెప్పిన ఒక మంచి కథను వినలేకపోయాను. వారి బోధ నీతికథలతో ఉండేది. ఆ కథ ఒకతనికి ఉన్న ఒక అందమైన గుఱ్ఱం గురించినది. అది తను అనుకున్నదే చేసేదట కానీ దాని జంటతో కలిసేది కాదట. దానిక్కావలసిన శిక్షణ ఇచ్చేందుకు దానిని అన్నిచోట్లకి తిప్పినా ప్రయోజనం కలగలేదు. చివరికి దానిని ఎక్కడనుంచి తెచ్చారో ఆ చోటుకి తీసుకువెళ్ళమని ఒక పండితుడు చెప్పాడు. అలా చేశాక అప్పుడు ఆ గుఱ్ఱం సరిగ్గా స్వాధీనంలోకి వచ్చి చాలా ఉపయోగపడిందట. ఈ నీతికథ సారాంశాన్ని విన్నాన్నేను.
నేనెప్పుడు వెళుతున్నానని అడిగారు బాబా. వారంతట వారు నాకెప్పుడు అనుమతిస్తే అప్పుడు వెళతానని సమాధానం చెప్పాను. "నీ భోజనమయాక ఈరోజే నీవు వెళ్ళొచ్చు" అన్నారు బాబా. తరువాత మాధవరావు దేశ్‌పాండే చేత పెరుగును నాకు ప్రసాదంగా పంపారు. దాన్ని భోజనంలో తిని ఆ తరువాత సాయిసాహెబ్ దగ్గరకు వెళ్ళాను. నేను వెళ్ళగానే తమ అనుమతిని ధృవీకరించారు బాబా. మా అబ్బాయి ఈ అనుమతిని నమ్మకపోవటం వల్ల మళ్ళీ ఖచ్చితంగా అడిగితే బాబా స్పష్టమైన మాటల్లో తమ అనుమతినిచ్చారు. ఈరోజు సాయి మహారాజు ఇతరులని దక్షిణ అడిగారు, కానీ నన్ను, మా అబ్బాయినీ అసలు అడగలేదు. నా దగ్గర డబ్బు లేదన్న విషయం వారికి తెలుసు కాబోలు. నూల్కర్, దీక్షిత్, బాపూసాపాబ్ జోగ్, బాబాసాహెబ్ సహస్రబుద్ధే, మాధవరావు దేశ్‌పాండే, బాలాసాహెబ్ భాటే, వాసుదేవరావు తదితరుల వద్ద సెలవు పుచ్చుకొని పట్వర్ధన్, ప్రధాన్, కాకామహాజని, తర్ఖడ్, ఈరోజే వచ్చిన భిడేలతో కలసి శిరిడీ నుంచి బయలుదేరాం. కోపర్‌గాఁవ్‌లో సాయంత్రం 6.30 గంటలకి రైలెక్కి మన్మాడ్ వెళ్ళాం. భిడే యవలా దగ్గర దిగిపోయాడు. నేను, మా అబ్బాయి వెంటనే పంజాబ్ మెయిల్లో మన్మాడ్ నుండి వెళ్ళిపోతాం.
తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai🙏
Om sai sri sai Jaya Jaya sai,om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏
ReplyDelete