ఈ భాగంలో అనుభవాలు:
- బాబాకి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో!
- సాయి కృప
బాబాకి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో!
ఖమ్మం నుండి సాయిభక్తురాలు శ్రీమతి పద్మ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం శ్రీ సాయిరాం! నా పేరు పద్మ. నేను ఖమ్మం నివాసిని. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. బాబా మనపై చూపించే ప్రేమను, ఆయన మనకు ప్రసాదించే లీలలను ఈ బ్లాగ్ ద్వారా ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాము. నేను రెండవసారి ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2005 నుండి నేను బాబా గురించి ఎక్కువ తెలుసుకోగలిగాను. నేను సొంత ఇల్లు నిర్మించుకోవాలని కలలు కనేదాన్ని. అసలెప్పటికైనా నా కల నెరవేరుతుందా అని అనుకునేదాన్ని. 2009లో బాబా నా సొంతింటి కలను నెరవేర్చారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లు 8వ తరగతి చదువుతున్నప్పటినుంచి బాబానే నమ్ముకున్నారు. ఇద్దరూ ప్రతిరోజూ బాబాని ప్రార్థిస్తారు. అన్ని పరీక్షలలోనూ బాబా వాళ్ళని ముందుండేలా అనుగ్రహించారు. ఇప్పుడు మా పెద్దమ్మాయి బి.టెక్ పూర్తిచేసింది. చిన్నమ్మాయి బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సెప్టెంబరులో చిన్నమ్మాయికి బాబా ఆశీస్సులతో ఉద్యోగం వచ్చింది. అందరం చాలా సంతోషించాము. కానీ పెద్దమ్మాయికి కూడా త్వరగా ఉద్యోగం వస్తే బాగుండని అనుకున్నాను. అన్నీ బాబాకి తెలుసు, బాబా అనుగ్రహం ఎప్పుడు ఉంటే అప్పుడే ఉద్యోగం వస్తుందని అనుకుని బాబాపైనే భారం వేశాను. తనకు ఉద్యోగం వస్తే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాటిచ్చాను. బాబా అనుగ్రహంతో ఈ ఫిబ్రవరిలో పెద్దమ్మాయికి ఉద్యోగం వచ్చింది.
ఒక్కోసారి అనిపిస్తుంది, బాబా నన్ను పట్టించుకోవట్లేదు అని. కానీ బాబాకి తెలుసు మనకు ఎప్పుడు ఏది ఏ సమయంలో ఇవ్వాలి అని. సరైన సమయంలో మనకు శ్రేయోదాయకమైన దానిని బాబా ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మనం చేయాల్సినదల్లా ఆయనపై భారం వేసి ఓర్పుతో వేచి ఉండటం. అన్నీ బాబానే చూసుకుంటారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో బాబా పాదాల వద్దకు వచ్చాము. "ప్రాణం ఉన్నంత వరకు మీరే మా దిక్కు తండ్రీ, మమ్మల్ని మీరే కాపాడాలి బాబా!"

సాయి కృప
USA నుండి సాయిభక్తుడు హరీష్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను సాయికి సాధారణ భక్తుడిని. ఎప్పుడూ ఆయనను గుర్తుంచుకుంటాను. అందరినీ సాయి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సాయి శివుని గురించి పంచుకోవడానికి నాకు ఒక అందమైన అనుభవం ఉంది. వారిద్దరూ ఒకటే.
ఆగష్టు 24, 25 తేదీలలో తమిళంలో శైవ సిద్ధాంతం గురించి ఉపన్యసించడానికి దైవాంశ సంభూతుడైన శివనడియార్ క్లీవ్‌ల్యాండ్ వచ్చారు. నేను ఆ ఆధ్యాత్మిక ఉపన్యాసం వినడానికి మొదటిరోజు వెళ్ళాను. అది ఒక ఆసక్తికరమైన, ఆనందకరమైన చర్చ. ప్రతి ఒక్కరూ సదా గుర్తుంచుకుని, మననం చేసుకోదగ్గది. ఆ హాల్లోని ప్రవేశద్వారానికి దగ్గరగా ఒక మూలలో ఎవరికీ కనిపించని విధంగా ఒక శివుని నాట్య చిత్రం(నటరాజు) ఉంది. నేను ఉపన్యాసాన్ని వింటూ నా మనస్సులో, 'ఆ చిత్రాన్ని ఎవరికీ కనపడకుండా అక్కడ పెట్టారు. ఉపన్యాసం జరుగుతున్న వేదిక మధ్యలో ఉంచితే ఎంత బాగుండేదో?' అని అనుకున్నాను. అలా నేను ఆలోచించుకుంటూ దానిని సాయికి వదిలేశాను.
మరుసటిరోజు ఉపన్యాసానికి బయలుదేరడానికి గంట ముందు నాకు తలనొప్పి మొదలైంది. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే, నేను నిజంగా ఉపన్యాసం వినాలని ఆరాటపడ్డాను. నేను సాయిశివునితో, "నేను ఉపన్యాసానికి వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి అరగంటలో నాకు నయం అయ్యేలా సహాయం చెయ్యండి" అని చెప్పుకున్నాను. తరువాత నేను కొన్ని ఇంటి చిట్కాలు ప్రయత్నించాను. కానీ అవేమీ నాకు సహాయపడలేదు. ఇంకా అరగంటే మిగిలివుంది. నేను వెళ్లి మంచం మీద ఎడమవైపుకు తిరిగి పడుకున్నాను. నేను సాయిని ఊహించుకుంటూ, "నిజంగా నేను ఉపన్యాసానికి వెళ్లాలనుకుంటున్నాను, దయచేసి నా బాధను తీసివేయండి" అని ఆయనతో చెప్పుకుంటూ నొప్పిని సాయి పాదాలకు బదలాయిస్తున్నట్లుగా ఊహించుకున్నాను. తరువాత సుమారు 20 నిమిషాల్లో నేను మేల్కొన్నాను. ఆశ్చర్యం! నొప్పి పూర్తిగా మాయమైంది. నేను హృదయపూర్వకంగా ఉపన్యాసానికి వెళ్లాలని, తలనొప్పి కారణంగా మధ్యలో ఇంటికి రాకూడదని అనుకున్నాను. సాయి దయ చూపారు. ఆయన ఆశీస్సులతో నేను ఉపన్యాసానికి వెళ్ళగలిగాను. నేను కూర్చుని ప్రసంగం వినబోతూ నటరాజ చిత్రాన్ని వేదిక మధ్యలో చూసి ఆశ్చర్యపోయాను. ముందురోజు నేను అనుకున్న విధంగా ఆ చిత్రాన్ని వేదిక మధ్యలో పెట్టారు. నేను కేవలం అదంతా నా మనసులో అనుకున్నాను గానీ, ఎవరికీ చెప్పలేదు. కానీ నా అంతర్యామి సాయికి ఈ చిన్న కోరిక తెలుసు, ఆయన దాన్ని నెరవేర్చారు. నేను చాలా సంతోషించాను. ఆ ఆనందంలో నా కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. "చాలా చాలా కృతజ్ఞతలు సాయీ!"
అది అక్కడితో ఆగలేదు. నేను అక్కడినుండి ఇంటికి వచ్చాక నా కుటుంబ వాట్సాప్ గ్రూపులో ఇంచుమించు అలాంటి నటరాజు ఫోటో షేర్ చేసారు. సాధారణంగా శివలింగం లేదా శివుని ఫోటోలు పంపుతారు. అలాంటిది నటరాజు ఫోటో షేర్ చేయడం శ్రీసాయి అనుగ్రహమే. వారిద్దరూ ఒకటే. కొంతకాలం క్రితం క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో, "శ్రీసాయిబాబాను గుర్తుంచుకో. ఆయన ఆశీస్సులు నీతో ఉన్నాయని నువ్వు గ్రహిస్తావు" అని వచ్చింది. ఇప్పుడు అదే నిజం అయ్యింది. సాయే ఆ శివుడు, ఈ సృష్టికి మూలకారణం. ఈ అనుభవం చదివిన ప్రతి భక్తుని కోరికలు నెరవేరాలని, వాళ్లతో సాయి ఏదో ఒక రూపాన ప్రతిక్షణం ఉంటూ వారి విశ్వాసాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాను.
source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2580.html

Sai ram
ReplyDeleteOM SAIRAM
ReplyDeleteALWAYS BE WITH ME
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteSri Sairam🙏🌺🙏🌺🙏🌺
ReplyDelete