ఈ భాగంలో అనుభవాలు:
- బాబా అనుగ్రహించి ఇచ్చిన సంతోషం
- బాబా తల్లిప్రేమ
బాబా అనుగ్రహించి ఇచ్చిన సంతోషం
నా పేరు అంజలి. నేను బాబా భక్తురాలిని. నాకు ఎప్పుడూ బాబా నాతోనే వున్నట్లు అనిపిస్తుంది. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఇటీవల బాబా మాపై చూపిన దయను నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య నా భర్తకి గొంతు దగ్గర నొప్పి వచ్చింది. ఆ నొప్పి కొద్ది రోజులు అలాగే వుంది. మేము సాధారణంగా ఆయుర్వేద మందులు వాడతాము. హాస్పిటల్‌కి వెళ్ళాలంటే చాలా దూరం. అందువల్ల డాక్టర్ గారిని ఫోన్లో సంప్రదించాము. డాక్టర్ గారు అన్ని వివరాలూ అడిగి ఒక మెడిసిన్ పేరు చెప్పి క్రమంతప్పకుండా వేసుకోమన్నారు. "నా భర్తకు నొప్పి తగ్గించమ"ని ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ, "డాక్టర్ ఇచ్చిన మెడిసిన్‌తో మావారి నొప్పి తగ్గితే 'సాయిమహరాజ్ సన్నిధి బ్లాగు'లో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని నేను బాబాకు మ్రొక్కుకున్నాను. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్‌తో పాటు బాబా ఊదీని కూడా ప్రతిరోజూ నా భర్త గొంతుకు రాస్తూ ఉన్నాను. ఇప్పుడు తన నొప్పి చాలావరకు తగ్గింది. అంతా బాబా దయ. బాబా దయ ఎప్పుడూ ఇలాగే మనందరి మీద వుండాలని కోరుకుంటున్నాను.
మరో అనుభవం:
ఫిబ్రవరి 16వ తారీఖున నా పుట్టినరోజు. మేమెప్పుడూ ఆరోజు దగ్గరలో ఉన్న వాడపల్లి శివాలయం మరియు లక్ష్మీనరసింహస్వామి మందిరానికి వెళ్తాము. తరువాత నకిరేకల్‌లోని బాబా మందిరానికి వెళ్తాము. ఎందుకంటే బాబా మందిరం ఊళ్లోనే వుంటుంది. అందుకే నా భర్త ముందు వాడపల్లిలో దర్శనం చేయించి తరువాత బాబా గుడికి తీసుకెళ్తారు నన్ను. కానీ నాకేమో ముందు బాబా దర్శనం అయిన తరువాత వాడపల్లికి వెళ్లాలని కోరిక. అందువలన ఈ సంవత్సరం నా పుట్టినరోజునాటి ఉదయం నేను, "బాబా! ముందుగా మీ దర్శనం అయిన తరువాతే నన్ను వాడపల్లికి పంపండి" అని బాబాకి చెప్పుకున్నాను. అంతేకాదు, "మీరు ఎల్లప్పుడూ నాపై దయచూపుతారని నాకు తెలుసు. అయినా కూడా మీ దర్శనానికి వచ్చినప్పుడు మీకు సమర్పించటానికి నేను ఏమీ తీసుకురాను. మీరే నాకు పువ్వులను ప్రసాదించండి బాబా" అని ప్రార్థించాను. ఇంక బాబా దయ చూడండి. వాడపల్లి వెళ్ళటానికి బయలుదేరాము. నేను కారు ఎక్కబోతుండగా, "ముందు బాబా గుడికి వెళ్లి తరువాత వాడపల్లి వెళ్దాం" అన్నారు మావారు. ఇంక నా ఆనందానికి అవధులు లేవు. బాబా దర్శనానికి వెళ్ళాను. ఆరోజు బాబా మెడలో పెద్ద బంతిపూల దండ వుంది. అందులోనుంచి పువ్వులను తెంపి ఇవ్వటానికి వీలుండదు. 'మరి బాబా నాకు ఎలా పువ్వులు ఇస్తారో?' అనుకున్నాను. బాబా దర్శనం అయిన తరువాత పూజారి దత్తాత్రేయస్వామి మెడలో వున్న లిల్లీ పూల మాల తీసి కొన్ని పువ్వులను తెంపి నన్ను పెట్టుకోమని ఇచ్చారు. ఇంక నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆవిధంగా నా పుట్టినరోజునాడు బాబా నన్ను అనుగ్రహించారన్న సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మరికొన్ని అనుభవాలతో మరోసారి మీ ముందుకు వస్తాను.
జై సాయిరాం!

బాబా తల్లిప్రేమ
సాయిభక్తురాలు శిరీష ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను పంచుకుంటున్నారు.
సాయిరామ్! నేను ఇటీవల జరిగిన రెండు అనుభవాల ద్వారా బాబా నాపై చూపిన తల్లిప్రేమను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2020, ఫిబ్రవరి 19, బుధవారం రాత్రి ఫేస్‌బుక్‌లో నేనొక బాబా సందేశాన్ని చూశాను. అదేమిటో ఉన్నది ఉన్నట్లు నాకు గుర్తులేదు గానీ, "ఈ గురువారం నా మందిరానికి రా" అనేది అందులోని భావం. ఆ రాత్రి నేను
హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్నందున మరుసటిరోజు మందిరానికి వెళ్ళలేనులే అని ఆ సందేశాన్ని అంతగా పట్టించుకోలేదు. మరుసటిరోజు గురువారం. నేను ఉదయం గం.6.10ని.లకి నా మహాపారాయణని పూర్తి చేశాను. అకస్మాత్తుగా బాబా మందిరానికి వెళ్లాలని నా మనసులో బలంగా అనిపించింది. అయితే ఆ సమయంలో నాకు చాలా ఆకలిగా ఉంది. బాబా చెప్పిన "ఖాళీ కడుపుతో దేవుని వెతకవద్దు" అన్న మాటలు గుర్తొచ్చి నేను రెండు చిలగడదుంపలను ఉడకబెట్టి తిన్నాను. తరువాత మా హాస్పిటల్ నుండి అర కిలోమీటర్ దూరంలో ఉన్న బాబా మందిరానికి బయలుదేరాను. దుంపలు తిని బయలుదేరినప్పటికీ నాకు ఇంకా ఆకలిగా ఉన్నందున, "ఈరోజు మందిరంలో బాబా నాకు ఏమైనా తినడానికి ఇస్తారా?" అని అనుకున్నాను. ఉదయం 7.30 సమయంలో నేను మందిరానికి చేరుకున్నాను. ఆ సమయంలో బాబాకు నైవేద్యం పెడుతున్నారు. నేను బాబా దర్శనం చేసుకున్న తరువాత శీరా, పెరుగన్నం, ఉడికించిన శనగలు ఒక ప్లేటు నిండా పెట్టి బాబా ప్రసాదంగా నాకిచ్చారు. పిల్లల ప్రతి అవసరాన్ని చూసుకునే తల్లిలా బాబా నా ఆకలి తీర్చారని నేను ఆనందంలో మునిగిపోయాను. బాబా చూపిన తల్లిప్రేమకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను ఇంతకుముందు నాలుగుసార్లు అదే సమయంలో ఆ మందిరానికి వెళ్ళాను. ఆ సమయంలో వాళ్ళు కాంస్య విగ్రహాలను శుభ్రపరుస్తుండేవాళ్లే గానీ నాకెప్పుడూ ప్రసాదం ఇవ్వలేదు. అదీ బాబాకు తన బిడ్డలపట్ల ఉండే ప్రేమంటే!
రెండవ అనుభవం:
2020, ఫిబ్రవరి 20, గురువారం రాత్రి నేను మరుసటిరోజు శివరాత్రి పర్వదినం ఉన్నందున బాబాకోసం ఒక తెల్లని ముఖమల్ వస్త్రాన్ని కొన్నాను. తరువాత నేను ఆ వస్త్రాన్ని కత్తిరిస్తూ, "రేపు శివరాత్రినాడు శిరిడీలో కూడా బాబా తెల్లని వస్త్రాలు ధరించినట్లైతే అది బాబా నా రోజువారీ పూజలను, సమర్పణలను స్వీకరిస్తున్నారన్న దానికి సంకేతం" అనుకున్నాను. మరునిమిషంలో 'ఇది వెర్రి ఆలోచన' అని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం నేను నిద్రలేచి శిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూసి ఆశ్చర్యపోయాను. బాబా పూర్తిగా తెలుపురంగు దుస్తులు ధరించి ఉన్నారు. నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. ఆ ఫోటోను, మా ఇంట్లో బాబా ఫోటోను కింద జతపరుస్తాను చూడండి. బాబా ఇచ్చిన నిదర్శనానికి ఆనందంతో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా తన బిడ్డల ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో ఈ రెండు అనుభవాల ద్వారా నేను తెలుసుకున్నాను. "బాబా! ఎల్లప్పుడూ మీ బిడ్డలను ఇలాగే అనుగ్రహిస్తూ ఉండండి".

Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
ఓం సాయిరాం🌷🙏🌷
ReplyDelete