సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 349వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • నా జీవితమంతా బాబా ఆశీస్సులు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను కేరళలో ఒక డాక్టరుని. నాకు 25 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటినుండి నా తల్లిదండ్రులు నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉండేవాళ్ళం. స్పష్టంగా చెప్పాలంటే, నేను వివాహ విషయంలో భయంవల్ల వచ్చిన ఏ సంబంధాన్నీ అంగీకరించటానికి నాకు ధైర్యం చాలలేదు. నా తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందేవారు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. చివరగా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి మంచివాడు, మంచి కుటుంబం నుండి వచ్చాడు. ఈసారి నిరాకరించటానికి నాకు కారణం లేక ఈ సంబంధానికి అంగీకరించాను. కానీ నా మనస్సులో చాలా సందేహాలు, భయాలు ఉన్నాయి. ఆ సమయంలో నేను దేవుడిని ఒక ప్రశ్న అడిగి, సమాధానం కోసం ఇంటర్నెట్‌లో శోధించాను. సాయిబాబా క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో నాకు సమాధానం దొరికింది. అక్కడినుండి నేను సాయిభక్తుల అనుభవాలు ఉన్న వెబ్‌సైట్‌లోకి వెళ్ళాను. ఆ వెబ్‌సైట్‌లో నేను సాయి సచ్చరిత్ర పుస్తకం గురించి, దాన్ని ఏడు రోజుల్లో చదవాలని తెలుసుకున్నాను. నేను అది చదవాలని అనుకున్నాను. కానీ పుస్తకం ఎలా దొరుకుతుందో తెలియలేదు. అప్పటినుండి నా మనస్సులో సందేహం వచ్చినప్పుడల్లా నేను బాబాను అడుగుతుండేదాన్ని. అలా నేను అడిగిన ప్రతిసారీ బాబా ఆ సంబంధం విషయంలో ముందుకు సాగమని సమాధానం ఇస్తుండేవారు. 

తరువాత ఒకరోజు నేను ఇంట్లో ఏదో వెతుకుతూ ఉంటే, హఠాత్తుగా నా మంచం మీద సాయి సచ్చరిత్ర ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఆ పుస్తకాన్ని అంతకుముందెప్పుడూ నేను మా ఇంటిలో చూడలేదు. నిజానికి నేనొక పుస్తకాల పురుగుని. మా ఇంటిలో ఉన్న ఏ పుస్తకాన్నీ నేను చదవకుండా ఉండలేదు. కొన్నేళ్ల క్రితం మా బామ్మగారు కన్నుమూశారు. ఆమె పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తురాలు. బహుశా ఈ పుస్తకం ఆమెకు సంబంధించినదై ఉంటుంది. ఏది ఏమైనా బాబా దానిని నాకు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. నేను దాన్ని చదవడం మొదలుపెట్టి ఏడురోజుల్లో పూర్తి చేశాను. ఏమీ అర్థంకాని దశలో బాబా నా పక్కన నిలచి, నాతో ఉన్నారు. నాకు కాబోయే భర్త అన్ని విధాలా మంచివ్యక్తి అని నేను నెమ్మదిగా తెలుసుకున్నాను. తరువాత మా వివాహం జరిగింది. మొదట్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. అవి నన్ను మళ్ళీ కలవరపరచగా నేను బాబాని ఆశ్రయించాను. ప్రతిసారీ ఆయన తమపట్ల, వైవాహిక జీవితంపట్ల నేను విశ్వాసం పెంచుకునేలా చేశారు. నిజంగా నా భర్త ఒక రత్నం. అతనిని వివాహం చేసుకున్న నేను అదృష్టవంతురాలిని. నాలాంటి అదృష్టవంతులు చాలా తక్కువమంది ఉంటారని నా నమ్మకం. బాబా లేకపోతే నేను అతనిని కోల్పోయేదాన్ని.

వివాహం తరువాత ఒక సంవత్సరం వరకు మేము పిల్లలు వద్దని అనుకున్నాము. తీరా సంవత్సరం దాటేసరికి నేను ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగంలో ఉన్నాను. అదే కాకుండా అన్ని వైపుల నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాను. ఆ ఒత్తిడి కారణంగా నెలలు గడుస్తున్నా పిల్లల విషయంలో ఎటువంటి సూచనా కనపడలేదు. నేను చాలా ఆందోళనపడ్డాను. 12 నెలల తర్వాత మేము వైద్యసహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. 12వ నెల నడుస్తుండగా నేను తీవ్రంగా బాబాను ప్రార్థించడం మొదలుపెట్టి ఈసారి ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని అనుకున్నాను. ఆ సమయమంతా నేను నా పొత్తికడుపుపై బాబా ​ఊదీ పూసుకునేదాన్ని. చివరిగా ఒక గురువారంనాడు నేను గర్భనిర్ధారణ పరీక్ష చేసుకున్నాను. నా నమ్మకం వమ్ము కాలేదు. బాబా ఆశీస్సులతో నేను గర్భవతినని తేలింది. తర్వాత కూడా గర్భధారణలో ఉన్న కాలమంతా నేను నా పొత్తికడుపుపై ఊదీ పూసుకుంటూ ఉండేదాన్ని. మొదటి నెలలో కొన్ని సమస్యలతో మానసికంగా కృంగిపోయినప్పటికీ బాబా దయతో అన్నీ సర్దుకుంటాయని నేను నమ్మినట్లే ఆ సమస్యల నుండి బయటపడ్డాను. బాబా ఆశీస్సులతో తొమ్మిది నెలలు సజావుగా సాగి నేను ఒక అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చాను

ఈరోజు నా జీవితమంతా బాబా ఆశీస్సులతో నిండి ఉంది. శిరిడీ దర్శించాలని నా కోరిక. ఆ అవకాశం ఇప్పటివరకు రాలేదు. బాబా పిలుపుకోసం నేను ఎదురుచూస్తున్నాను. నా మనస్సులో ఒక విన్నపం ఉంది. దాన్ని ఆయన వింటారని ఆశిస్తున్నాను. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. నాకు అండగా నిలిచి నా జీవితాన్ని అందంగా మలిచారు. అందరినీ ఆశీర్వదించండి బాబా!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2583.html


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo