ఈ భాగంలో అనుభవం:
- సాయే నా రక్షకుడు
అందరికీ హాయ్! నేను బాబా ఆశీస్సుల యొక్క అపారమైన ఫలితాన్ని అనుభవించిన సాయిభక్తురాలిని. నేను యు.కే.లో నివాసముంటనున్నాను. నేను మొదట్లో దేవుడంటే భయపడేదానిని. అలాంటి నాకు సాయిభక్తుడైన నా భర్తతో వివాహమైంది. పెళ్ళైనప్పటి నుండి నేను సాయిబాబాను హృదయపూర్వకంగా ఆరాధించడం మొదలుపెట్టాను. ఆయన నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. వాటి ద్వారా బాబా శక్తిని, సామర్థ్యాన్ని, ప్రేమను తెలుసుకున్నాను.
2012లో నా భర్త ఉద్యోగ విషయంగా మేము ఆరునెలల పాపతో యు.కే. వెళ్లాము. మేము మా పాప భవిష్యత్తు దృష్ట్యా కొంతకాలం ఇక్కడే ఉండాలని కోరుకున్నాము. కానీ 2013 చివరిలో నా భర్త చేస్తున్న ప్రాజెక్ట్ ముగిసింది. తను వేరే ప్రత్యామ్నాయం కనుగొనలేకపోయారు. సంపాదన లేకుండా ఇటువంటి ఖరీదైన ప్రదేశంలో జీవించడం అసాధ్యమని మేము తిరిగి ఇండియా వెళ్లాలని నిర్ణయించుకున్నాము. తరువాత కూడా నా భర్త ఉద్యోగాన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఏదైనా ఫలితం కనిపిస్తుందేమోనని మేము నవంబర్ చివరివరకు వేచి చూద్దామని అనుకున్నాము. ఆ సమయంలో నా భర్తకు ఒక సంస్థకి సంబంధించిన ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ బాగా జరిగింది, కానీ 3 రౌండ్ల ఇంటర్వ్యూలతో ఆ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలలు పడుతుందని హెచ్.ఆర్ మావారితో స్పష్టంగా చెప్పి, అదంతా విజయవంతంగా పూర్తయితే ఆఫర్ ఇవ్వబడుతుందని కూడా చెప్పారు. అప్పుడు నేను, "ఇండియా తిరిగి వెళ్లడం నాకు ఇష్టంలేదు బాబా. ఆ ఇంటర్వ్యూ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. తరువాత ఒక మధ్యాహ్నం నేను లాప్‌టాప్ పక్కన కూర్చుని హెచ్.ఆర్ నుండి మెయిల్ కోసం ఆశగా బాబాను ప్రార్థించాను. తరువాత నా కళ్ళు మూసుకుని, 'ఓం గణేశాయ నమః', 'ఓం సాయిరామ్' అని 1001 సార్లు జపించాను. నేను కళ్ళు తెరిచేసరికి హెచ్.ఆర్ నుండి నా భర్తకు ఒక మెయిల్ వచ్చింది. అందులో ఇంటర్వ్యూ తేదీలను ముందుకు నడిపి 3 నెలల ప్రక్రియను 2 వారాలకు కుదించినట్లు ఉంది. నా ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేవు. సాయిబాబా మమ్మల్ని ఆశీర్వదించి యు.కె లో ఉండే అవకాశాన్ని మాకిచ్చారు.
2016లో నా భర్త అనారోగ్యం పాలయ్యారు. వైద్యులు సమస్య ఏమిటన్నది అస్సలు నిర్ధారించలేకపోయారు. నవంబరులో నేను పిల్లలతో భారతదేశానికి వెళ్ళాను. ఆ సమయంలో వైద్యులు నా భర్తకు క్యాన్సర్ అన్న అనుమానాన్ని వ్యక్తం చేసారు. అది తెలిసి నా జీవితం ముగిసిపోయిందని అనుకున్నాను. ఈ విషయాన్ని నేను నా తల్లిదండ్రులతోగానీ, మరెవరితోగానీ పంచుకోలేక రోజూ "దయ చూపమ"ని సాయిని పార్థిస్తూ ఉండేదాన్ని. నా భర్త భారతదేశం వచ్చాక ఒక మంచి వైద్యుడిని సంప్రదించాము. డాక్టర్ దగ్గరకు వెళ్లేముందు నేను, "మందులతో నయమయ్యే ఏ ఇతర వ్యాధినైనా ఇవ్వమ"ని సాయిని ప్రార్థించాను. బాబా కృప చూపించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఒక ఆపరేషన్ చేశారు. దాంతో నా భర్త ఆరోగ్యం చక్కబడింది. బాబాకు కృతజ్ఞతలు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. ఆయన మన రక్షకుడని మరోసారి నిరూపించారు. ఆయన తన భక్తులందరిపట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ, వారిని ఎల్లప్పుడూ ప్రేమగా చూసుకుంటారు.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2587.html
Jai sairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete