సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 354వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఐటి రంగంలో ఉద్యోగావకాశాన్నిచ్చిన బాబా
  2. బాబాయే నా జీవితానికున్న తోడు

ఐటి రంగంలో ఉద్యోగావకాశాన్నిచ్చిన బాబా

కెనడా నుండి సాయిభక్తురాలు ప్రియ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! "బాబా! ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి". అమ్మాయినైన నేను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా బాధలుపడ్డాను. అయినప్పటికీ బాబా ఆశీస్సుల వలన నేను సజీవంగా, ఆరోగ్యంగా, ధైర్యంగా, సంతోషంగా ఉన్నాను. నేను భారతదేశం నుండి కెనడాకు వచ్చాను. అది బాబా చూపిన ఒక అద్భుతం. ఇప్పుడు నేను నా ఉద్యోగానికి సంబంధించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

నేను ఐటి రంగంలో ఉద్యోగం కోసం ఆశపడ్డాను. అయితే ఆ రంగంలో నాకు అనుభవం లేనందున నేను కోరుకున్నది జరగడం చాలా కష్టం. అందువలన నాకు ఆసక్తిలేని వేరే ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో చేరడమైతే చేరాను గానీ మంచి జీతం వచ్చే వేరే ఉద్యోగం కోసం తీవ్రంగా ఎదురుచూశాను. కొత్త దేశంలో నేను కోరుకునే ఉద్యోగం ఎలా పొందాలో తెలియదు, నాకు ఏ దారీ కనబడలేదు. ప్రతిరోజూ రాత్రి నాకోసం ఏదైనా అద్భుతం చేయమని బాబా ముందు ఏడ్చేదాన్ని. సంవత్సరం తరువాత, నా మేనేజర్ మరొక ఉద్యోగం చూసుకోమని నాకు నోటీసు ఇచ్చాడు. ఈ హఠాత్ పరిణామానికి నేను కొంచెం కలత చెందినప్పటికీ ఆరోజు గురువారం, బాబా రోజు కావడంతో చాలా త్వరగా కోలుకోగలిగాను. నాకు సహాయం చేయమని బాబాను ప్రార్థించడం ప్రారంభించాను.

అదృష్టవశాత్తూ, అదే సమయంలో ఇక్కడి ప్రభుత్వ రంగంలో 3 నెలలు ఐటి ఇంటర్న్‌షిప్ ఉందని నా స్నేహితుని ద్వారా తెలిసింది. అతను ప్రతి దశలో నాకు సహాయకారిగా ఉన్నాడు. నేను అతన్ని దేవుడే పంపాడని భావిస్తాను. హైరింగ్ మేనేజర్ అతని స్నేహితుడు. నాకు ఇంటర్వ్యూ కోసం కంపెనీ నుండి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ బాగా జరిగి నాకు ఆ ఇంటర్న్‌షిప్ వచ్చింది. అయితే అది బాబా నాకిస్తున్న అవకాశమని తెలియక నేను దానిని స్వీకరించడానికి ఇష్టపడలేదు. కానీ నా మేనేజర్ నాకు నోటీసు వ్యవధి ఇచ్చి ఉన్నందున నాకు వేరే దారి కూడా లేక వచ్చిన ఆ అవకాశాన్ని స్వీకరించాల్సి వచ్చింది.

ఆ ఇంటర్న్‌షిప్ 3 నెలలు మాత్రమే అయినందున మూడునెలల తరువాత మరో ఉద్యోగం చూసుకోవాలని నేను ఆందోళనచెందాను. ఇంటర్న్‌షిప్ ముగిసేలోపు నేను కొన్నినెలలు పొడిగించమని అడిగాను. బాబా ఆశీర్వదించారు. నేను ఊహించని విధంగా వాళ్ళు మంచి వేతనంతో 6 నెలలు పొడిగించారు. ఆరోజు నేను పట్టలేని ఆనందాన్ని అనుభవించాను.  నాకిది నిజంగా అద్భుతమే! ఎందుకంటే, కాంట్రాక్టు పీరియడ్ పొడిగించకుండా కంపెనీకి నిబంధనలున్నప్పటికీ నాకు అవకాశం ఇచ్చారు. అదేరోజు నా సోదరుడికి కూడా మరో కాంట్రాక్టు ఉద్యోగం వచ్చింది. చాలాకాలం తరువాత నా తల్లిదండ్రులు కూడా ఆరోజు చాలా సంతోషాన్ని అనుభవించారు. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. ఇకపై నన్ను బాధపెట్టకండి, ఇంక నేను ఏవీ తట్టుకోలేను బాబా. దయచేసి మంచి వైవాహిక జీవితాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరినీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా ఆశీర్వదించండి. లవ్ యు బాబా! ఎల్లప్పుడూ నాతో ఉండండి. నేను తెలిసీ తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి".

బాబాయే నా జీవితానికున్న తోడు

హైదరాబాదు నుండి సాయిభక్తురాలు శ్రీమతి సుప్రభ తన మనసులోని మాటను మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయిరామ్! నా పేరు సుప్రభ. నేను సాయిభక్తురాలిని. సాయిబాబా కృప వలన నేను పొందిన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మన సాయిభక్తులతో పంచుకుంటున్నాను. నాకు వివాహమైన తరువాత ఎన్నో బాధలు అనుభవించాను. వాటిని వివరించాలంటే చాలా కష్టం. ఆ సమయంలో బాబా నాతోనే ఉంటూ నాకు చాలా సహాయం చేశారు. బాబా సహాయంతో ఒక ఇల్లు కొనుక్కోగలిగాను. నా పిల్లలు బాగా చదువుకున్నారు. బాబా అనుగ్రహంతో వాళ్ళకి మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అంతా బాగానే ఉంది అని అనుకునే సమయంలో మా ఇంటిలో అనారోగ్య సమస్య వచ్చింది. ఎందుకో ఈసారి బాబా నాకు చాలా దూరంగా ఉన్నారనిపిస్తోంది. నేను సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తూనే ఉన్నాను. ఏదో ఒకరోజు బాబా మాకు తప్పకుండా సహాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. "బాబా! మాకు మీరే దిక్కు. మీ పాదాలకు నమస్కరించి వేడుకుంటున్నాను, మీ సహాయం కోసం ఆతృతతో వేచివున్నాను బాబా! దయచేసి అనారోగ్యాన్ని పారద్రోలి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా!" బాబా అనుగ్రహంతో  అనారోగ్యం దూరంగా పారిపోవాలని సాయిభక్తులందరూ ఒక్కరోజు మాకోసం బాబాని మీ మంచి మనసుతో వేడుకోవాలని కోరుకుంటున్నాను.


4 comments:

  1. Siprabha garu, worry avvakandi
    Saibaba mimmalni tappakunda kapadutharu
    Jai sairam

    ReplyDelete
  2. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  3. బాబా ఎంతో మంది జీవితాలలో వెలుగు చూపించిన మీరు నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు...నా సమస్యలు ఎంత ఘోరంగాఉన్నాయో మీకు తెలియనివి కావు...బాబా నా జీవితంలో వెలుగులు నింపండి..గతకొన్నేళ్ళు గా మీ ఆశీర్వాధం కోసం ప్రయత్నిస్తూనే వున్నా...బాబా ఇకనైనా నన్ను అనుగ్రహించండి...మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటా...ఓం సాయీ శ్రీ సాయీ జయ జయసాయీ...

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo