సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 348వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి నెరవేర్చిన కోరిక
  2. సాయి ఆశీస్సులు

సాయి నెరవేర్చిన కోరిక

సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సునీత. మాది గుంటూరు. నాకు బాబా తప్ప వేరే దిక్కు లేదు. నాకు సర్వం బాబానే. నాకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా ఈ అవకాశాన్ని కల్పించిన సాయిభక్తులకి మరియు ఈ బ్లాగ్ గురించి చెప్పిన పద్మజకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 

బాబా గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన మనకోసం చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావు. నాకు ప్రతి విషయంలో బాబా తోడుగా ఉన్నారు. నా భర్తని, నా బిడ్డలని అందరినీ సాయి చల్లగా చూస్తున్నారు. 'సాయీ!' అంటే ‘ఓయ్’ అని పలుకుతానన్నారు బాబా. బాబా మాటపై విశ్వాసంతో నేను నా భర్త కోసం బాబాను ఒక కోరిక కోరుకొని మూడు వారాల పాటు సాయి వ్రతం చేశాను. మొదటివారం వ్రతం ప్రారంభించే ముందు, “బాబా! మీ అనుగ్రహంతో నా కోరిక నెరవేరబోతున్నట్లయితే దానికి ఏదైనా నిదర్శనం చూపండి” అని బాబాను  ప్రార్థించాను. సాయంత్రం అవుతున్నా కూడా నాకు ఏ నిదర్శనమూ కనిపించలేదు. నాకు ఏదో ఒక నిదర్శనం చూపించమని బాబాను ఎంతగానో ప్రార్థించాను. గురువారం సాయంత్రం నాకు ఒక క్యాలెండరు వచ్చింది. దానిమీద బాబా ఫోటో ఉంది. అది చూసిన నా ఆనందానికి అవధులు లేవు. బాబా దయతో నేను కోరుకున్న పని విజయవంతంగా పూర్తయ్యింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మా అబ్బాయి కోసం కూడా సాయి వ్రతం చేయాలనుకుంటున్నాను. మా అబ్బాయి కోసం కోరుకున్నది కూడా జరగాలని మీరందరూ కూడా బాబాను ప్రార్థించండి. నా అనుభవాన్ని చదివిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మరోసారి నా అనుభవాన్ని మీ అందరితో పంచుకొనే అవకాశాన్ని ఇవ్వాలని బాబాని కోరుతూ.. సెలవు. 

సాయిరామ్! సాయినాథ్ మహరాజ్ కీ జై!!!  

సాయి ఆశీస్సులు

USA నుండి సాయిభక్తుడు హరీష్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను సాధారణ సాయిభక్తుడిని. సదా ఆయనను స్మరించుకుంటూ ఉంటాను. 2018 డిసెంబరులో నేను, నా భార్య ఒక పర్యటనలో ఉండగా నా భార్య గర్భవతి అని తెలిసింది. కానీ ఈ రోజుల్లో బిడ్డను ప్రసవించేవరకు ఆడవాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం గురించి మనం వింటున్నాము. అందువలన మేము ఒకవైపు సంతోషంగా ఉన్నా, అదే సమయంలో మరోవైపు ఆందోళనపడి "అంతా సవ్యంగా సాగేలా అనుగ్రహించమ"ని సాయిని ప్రార్థించాము. అదే విషయమై నేను ఆరోజు ఉదయం సాయిబాబా వెబ్‌సైట్ లో ఒక ప్రశ్న అడిగాను. అప్పుడు, "మీరు ప్రయాణం నుండి తిరిగి వస్తారు. శ్రీసాయిని గుర్తుంచుకోండి. అంతా బాగానే ఉంటుంది. మీకు విజయం లభిస్తుంది" అని బాబా సమాధానం వచ్చింది. ఆ సందేశం నాకు, నా భార్యకు చాలా సంతోషాన్నిచ్చింది. మేము బాబానే అంతా చూసుకుంటారని అనుకున్నాం. అంతేకాదు, ఆ పర్యటనలో 'అంతా బాగుంటుంద'ని 9 సంఖ్యతో సాయి మాకు చాలా సంకేతాలు ఇచ్చారు. చివరికి మేము విమానాశ్రయంలో విమానం ఎక్కే ముందు G27 అని చూశాను. అది నా ప్రియమైన సాయి నుండి నాకు లభించిన మరో నిర్ధారణ. సాయి దయతో, ఆశీస్సులతో పెద్ద సమస్యలేవీ లేకుండా నెలలు నిండాయి. చివరికి ప్రసవించే సమయంలో నా భార్య కాస్త శ్రమ, బాధ అనుభవించినప్పటికీ, బాబా మగబిడ్డనిచ్చి ఆశీర్వదించడంతో అంతా ఆనందకరంగా మారిపోయింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ 9 నెలల కాలంలో మాకు అబ్బాయి పుడతాడని బాబా చాలా సూచనలు ఇచ్చారు.

సాయి ఆశీస్సులు అక్కడితో ఆగలేదు. బిడ్డ పుట్టిన మరుసటిరోజు మహాపారాయణ నిర్వహిస్తున్న పూజగారి నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె, "గ్లోబల్ మహాపారాయణ కోసం మరిన్ని గ్రూప్స్ ఏర్పాటు చేయడంలో మీ సమయాన్ని కేటాయిస్తారా?" అని అడిగారు. మహాపారాయణ వంటి గొప్ప కార్యానికి బాబా మాధ్యమంగా ఎంచుకున్న వ్యక్తి నుండి నాకు ఫోన్ రావడంతో నేను చాలా ఆనందించాను. ఆమె మరో విషయం కూడా చెప్పింది, ఇటీవలి నా రెండు అనుభవాలలో ఒకటి ప్రచురించామని. ఆవిధంగా, పుట్టిన బిడ్డతోపాటు మా అందరినీ సాయి ఆశీర్వదించినట్లుగా నేను భావించాను. పూజగారు చెప్పినట్లు బాబా టైమింగ్స్ చాలా ప్రత్యేకమైనవి. ఆ విషయంలో ఎవరూ ఆయనకు సాటికారు. ఆయన టైమింగ్స్ లోని మాధుర్యం అనుభవించవలసిందేగానీ పదాలలో పొందుపరచలేనిది. మహాపారాయణలో భాగం కావడం ఈ కలియుగంలో సాయి నుండి పొందిన గొప్ప వరం. అందులో ఎటువంటి సందేహం లేదు. మనమందరం ఆయన లీలలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం, వాటిని మననం చేసుకుందాం, ఆయన నామాన్ని సదా జపిద్దాం. మన చివరి శ్వాస వరకు బాబా యొక్క మహాపారాయణలో భాగం కావాలని హృదయపూర్వకంగా సాయిని ప్రార్థిద్దాం. సాయి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ... సాయి సాయి సాయి.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2576.html


3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo